పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. రాష్ట్రంపై అల్పపీడనం పూర్తిగా ఆవరించి ఉందని తెలిపింది. కోస్తాంధ్ర నుంచి తెలంగాణ మీదుగా అల్పపీడనం నెమ్మదిగా కదులుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
రాగల 48 గంటల్లో ఇటు తెలంగాణ, అటు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. 25 సెంటిమీటర్ల మేర వర్ష పాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. అలాగే హైదరబాద్ నగరంలో కూడా రాగల 48 గంటల్లో కుండపోతగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది.