సాక్షి, హైదరాబాద్/అమరావతి: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరబాద్‌లో పలు చోట్ల అర్ధరాత్రి నుంచి వర్షం పడుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఇవాళ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. విశాఖ-నరసాపురం మధ్య కాకినాడ సమీపంలో తీరందాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. రాయలసీమలో కొన్నిచోట్ల భారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 55-75 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
► పశ్చిమగోదావరి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. వాయుగుండం ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి. నర్సాపురం, తాడేపల్లిగూడెం,ఏలూరు పలు ప్రాంతాలలో కుండపోతగా వర్షాలుకురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూంమ్‌లు ఏర్పాటు చేశారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో వర్షం కురుస్తోంది. ఎద్దువాగు, జల్లేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. సుమారు 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
► తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల వర్షం పడుతోంది.కాకినాడలో కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాయుగుండం ప్రభావంతో రాజమండ్రిలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉప్పాడ, కొత్తపల్లి, తొండంగి, గండేపల్లి మండలాల్లో వర్షం పడుతోంది. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా వ్యాప్తంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా 70 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ టీములు సంసిద్దంగా ఉన్నాయి.మరికొన్ని గంటల్లో విశాఖ కాకినాడలో మధ్య వాయుగుండం తీరం దాటనున్నది. భారీ వర్షానికి ప్రత్తిపాడులో కోండివారి చెరువుకు గండిపడింది. జగ్గంపేటలో శెట్టిబలిజిపేట, గోపాల్‌నగర్, ఎస్సీ కాలనీలు జలమయం అయ్యాయి. రాజానగరంలో ఇళ్లల్లోకి చేరిన వరద నీరు చేరింది.
► హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం
ఖమ్మం జిల్లా వేంసూర్‌లో అత్యధికంగా 18.7 సెం.మీ వర్షపాతం
నాగర్‌కర్నూల్, నల్లగొండ, వనపర్తి జిల్లాల్లో పలుచోట్ల వర్షం
మెదక్, సిద్దిపేట, కుమ్రంభీం జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు
నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, యాదాద్రి జిల్లాల్లో తేలికపాటి జల్లులు
► విశాఖపట్నం: రాగల నాలుగైదు గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయిని వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో..భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం... కర్నూలు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ముందస్తుగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఐఎండీ సూచించింది.
► విశాఖపట్నం:
జిల్లాలో వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం
ఎంవీపీ కాలనీ, ద్వారకానగర్, ఎన్ఏడీ జంక్షన్‌లో భారీ వర్షం
గాజువాక హనుమంతవాక పరిసరాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం
చిమిడిపల్లి సమీపంలో రైలు పట్టాలపై విరిగిపడ్డ కొండచరియలు
కొండచరియలు విరిగిపడటంతో నిలిచిన రైళ్ల రాకపోకలు
పెద్దేరు రిజర్వాయర్‌కు భారీగా వరద, 4 గేట్లు ఎత్తివేత
ఇన్‌ఫ్లో 1436 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 964 క్యూసెక్కులు
కోనాం రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తిన అధికారులు
ఇన్‌ఫ్లో 5వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 500 క్యూసెక్కులు
చోడవరం మండలం మార్కమ్మరేవు సమీపంలో కూలిన భారీ వృక్షం
చోడవరం నుంచి పాడేరు, నర్సీపట్నం వెళ్లే దారిలో ట్రాఫిక్‌కు అంతరాయం
లింగరాజుపాలెం వద్ద బ్రిడ్జిపైనుంచి ప్రవహిస్తున్న వరాహ నది
నాలుగు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
ఉధృతంగా ప్రవహిస్తున్న తాండవ నది
సత్యవరం-రాంభద్రపురం మధ్య బ్రిడ్జిపైనుంచి ప్రవహిస్తున్న వరద నీరు
► మహబూబ్‌నగర్:
జూరాలకు పెరుగుతున్న వరద, 20 గేట్లు ఎత్తివేత
ఇన్‌ఫ్లో 1.65 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1.61 లక్షల క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు, ప్రస్తుతం 317.92 మీటర్లు
► కృష్ణా:
జిల్లాలో పలుచోట్ల వర్షం
విజయవాడలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
కైకలూరులో 29.8 మి.మీ అత్యధిక వర్షపాతం
తిరువూరులో ఇళ్లల్లోకి చేరిన వరద నీరు
గన్నవరంలో వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం
తెంపల్లి, వీఎన్‌పురం కాలనీల్లో మోకాళ్లలోతు నీరు
ఉధృతంగా ప్రవహిస్తున్న ఏలూరు, బుడమేరు, రివస్ కాల్వలు
చాట్రాయి మండలంలో రహదారులపై వరద ప్రవాహం
► శ్రీకాకుళం:
జిల్లావ్యాప్తంగా వర్షం
నాగావళి, వంశధార నదులకు పెరిగిన వరద
మడ్డువలస రిజర్వాయర్‌కు వరద, 3 గేట్లు ఎత్తివేత
ఇన్‌ఫ్లో 7,143 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 7,657 క్యూసెక్కులు
► కర్నూలు:
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
7 గేట్లు 10 అడుగల మేర ఎత్తిన అధికారులు
ఇన్‌ఫ్లో 2,47,032 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 2,22,850 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం 884.80 అడుగులు
► నిజామాబాద్:
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు పెరిగిన వరద
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 61,443 క్యూసెక్కులు
16 గేట్లు ఎత్తి 50వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
► కరీంనగర్:
లోయర్‌మానేర్ డ్యామ్‌కు వరద
12 గేట్లు ఎత్తి 24వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
ఇన్‌ఫ్లో 24,276 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 24,276 క్యూసెక్కులు
► రాజన్నసిరిసిల్ల:
మిడ్‌మానేరు కొనసాగుతున్న వరద
నాలుగు గేట్లు ఎత్తి 9,644 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
ఇన్‌ఫ్లో 5,845 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 9,711 క్యూసెక్కులు
Comments
Please login to add a commentAdd a comment