bangalakhatam
-
ట్యూనా చేపకు ఫుల్ డిమాండ్.. ఆ దేశ సైనికుల కోసం దిగుమతి
విదేశీ రక్షణ దళాల్లో ట్యూనా పేరు తరచూ వినిపిస్తోంది. అలాగని.. ఇదేమీ సైనికులు వినియోగించే ఆయుధం కాదు. వివిధ దేశాల్లోని సైనికులు లొట్టలేసుకుని తినే ఆహారం. బంగాళాఖాతంలోని లోతు జలాల్లో మాత్రమే లభించే ట్యూనా చేప దేశ సరిహద్దులు దాటుతోంది. ఎక్కువ పోషకాలతో కూడిన బలవర్ధక ఆహారం కావడంతో వివిధ దేశాలు సైనికుల కోసం వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. ట్యూనా చేపలను ప్రాసెస్ చేసిన కేన్డ్ ప్రొడక్ట్స్ (మాంసంగా తయారుచేసి డబ్బాల నుంచి నేరుగా తినేసేలా–రెడీ టు ఈట్)ను విదేశాల్లోని జవాన్ల కోసం ఎక్కువగా వినియోగిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: ట్యూనా చేప బోర్డర్ దాటుతోంది. ట్యూనా ఏమిటి.. బోర్డర్ దాటడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా. అన్ని సముద్రాలలో ట్యూనా చేపలు లభిస్తున్నా.. మన సముద్ర జలాల్లో లభించే ట్యూనా చేపలకుæ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, యూరోపియన్ దేశాలలో విపరీతమైన గిరాకీ ఉంది. రుచితోపాటు పోషకాలు ఎక్కువ ఉండటంతో బలవర్ధక ఆహారంగా ట్యూనా చేపల్ని ఇతర దేశాలు ఎగరేసుకుపోతున్నాయి. నరాల పటుత్వం కోసం వినియోగించే.. కొలె్రస్టాల్ లేని అధిక ప్రొటీన్లు, తక్కువ కేలరీలు ట్యూనా ప్రత్యేకత. 100 నుంచి 150 నాటికల్ లోతు జలాల్లో మెకనైజ్డ్ బోట్ల ద్వారా ప్రత్యేక వలలు, లాంగ్ లైన్(హుక్స్, గేలం)లకు మాత్రమే ట్యూనాలు చిక్కు తాయి. సముద్ర జలాల్లో ఎక్కువ.. ట్యూనా 20 నుంచి 80 కేజీల వరకు ఉంటుంది. వీటిపై 2012–15 మధ్య రెండు సంస్థలు సంయుక్తంగా అధ్యయనం చేసి వాటి ఉనికి, రాకపోకలను గుర్తించాయి. ఇంకోయీస్, సీఎంఎఫ్ఆర్ఐ సంస్థలు బంగాళాఖాతంలోని విశాఖపట్నం, కాకినాడ, పసిఫిక్ మహాసముద్రంలోని లక్షద్వీప్ ప్రాంతాల్లో రాడార్ల సాయంతో ఉపగ్రహాల ద్వారా ట్యూనాల గమనం, ఉనికి, దూరం, ఏ సమయాల్లో లోతు జలాల నుంచి పైకి వస్తున్నాయనేది గుర్తించాయి. అప్పటినుంచే ట్యూనా చేపలు మన సముద్ర జలాల్లో ఎక్కువగా పట్టుకుంటున్నారు. ముద్దుపేరు సీ చికెన్.. స్కాంబ్రిడే కుటుంబానికి చెందిన ట్యూనా శాస్త్రీయ నామం థున్నుస్ ఆల్బాకేర్. సాధారణంగా వీటిని వాడుక భాషలో సూరలు అని కూడా పిలుస్తారు. ఐదు రకాల ట్యూనాలు ఉన్నా మన సముద్ర జలాల్లో లభించే రెక్క సూర (ఎల్లో ట్యూనా) అంటే విదేశీయులు లొట్టలేస్తారు. ట్యూనాలో ఉండే ఒకే ఒక ముల్లు తీసేస్తే మటన్ (మేక మాంసం) కంటే రుచిగా ఉండటమే కాకుండా.. తినడానికి వీలుగా ఉంటుంది. అందుకే ట్యూనాకు సీ చికెన్ అని మరో ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు. ట్యూనా చేప మాంసంలో ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండటంతో రక్తపోటు తగ్గించడంలో క్రియాశీలకంగా ఉంటుంది. ఫుల్ ప్రొటీన్స్.. అధిక ప్రొటీన్లు, తక్కువ కేలరీలతో కూడిన కొవ్వు ఉండటంతో నరాలు పటుత్వం, శరీరంలో అవయవాలు బలీయంగా ఉండటానికి దోహదపడతాయి. వీటిలో విటమిన్ బి, బి–12, విటమిన్ సీ అధికంగా ఉండటంతో రోగనిరోధకత పెరుగుతుంది. పొటాషియం, మాంగనీస్, జింక్, సెలీనియం వంటి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. వారానికి రెండు రోజులు ట్యూనాను తీసుకుంటే క్యాన్సర్ దరిచేరదని మత్స్యశాఖ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆరోగ్యానికి బలవర్ధక ఆహారంగా వైద్యులు నిర్ధారించడంతోనే విదేశీయులు మన సముద్ర జలాల్లోని ట్యూనాలను దిగుమతి చేసుకుంటున్నారు. మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కేరళ, అండమాన్, లక్షద్వీప్ నుండి ఎగుమతి చేస్తున్నారు. ఎగుమతుల్లో రెండో స్థానం ట్యూనా చేపల ఎగుమతుల్లో శ్రీలంక మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానం మన దేశానిదే. ఏటా 42 వేల టన్నుల ట్యూనా చేపలు లేదా, మాంసంగా విదేశాలకు ఎగుమతి అవుతోంది. 2021–22 ఎంపెడా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో పట్టుకునే ట్యూనాలను మత్స్యకారులు రాష్ట్రంలో కాకినాడ, విశాఖపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం రేవులకు చేర్చి అక్కడి నుంచి చెన్నై, కేరళ రాష్ట్రాలకు కంటైనర్ల ద్వారా ఎగుమతి చేస్తున్నారు. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి జరుగుతోంది. ఇక్కడ కిలో రూ.1,200 నుంచి రూ.1,500 ధర పలుకుతోంది. విదేశాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండే సందర్భంలో కిలో రూ.3,500 కూడా పలుకుతోంది. స్థానిక ప్రజలు ట్యూనా చేపల్ని పెద్దగా ఇష్టపడరు. విదేశాల్లో మాత్రం చాలా బలవర్ధక ఆహారంగా ఆర్మీ జవాన్లకు వారానికి రెండు రోజులు కచి్చతంగా పెడుతున్నారు. అందుకే విదేశాల్లో మన ట్యూనాకు అంత డిమాండ్ ఉంది. రోగ నిరోధక శక్తి ఎక్కువ బంగాళాఖాతంలో లభించే ట్యూనా చేపలలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే విదేశాల్లో డిమాండ్ ఎక్కువ. క్యాన్సర్‌ను కూడా ఇది నియంత్రిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఈ చేపల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. విదేశాల్లో ఎక్కువగా మిలట్రీలో పనిచేసే సిపాయిలకు వారం వారం క్రమం తప్పకుండా వినియోగిస్తున్నారు. – చిట్టూరి గోపాలకృష్ణ, మత్స్య పరిశోధకుడు, కాకినాడ విదేశాల్లో డిమాండ్ విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తున్నాం. బంగాళాఖాతంలో లోతైన ప్రాంతాల్లో లభిస్తున్న ట్యూనా చేపలు పట్టుకోవడానికి 120 నాటికల్స్ వరకు వెళ్లాల్సి వస్తోంది. వేటకు వెళితే వారం రోజులు నడిసంద్రంలోనే ఉంటారు. ప్రస్తుతం ట్యూనాలు రాక కొంత తగ్గినా విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వీటి వేట లాభదాయకంగానే ఉంది. కాకినాడ తీరంలోని మెకనైజ్డ్ బోట్లు ఎక్కువగా ఉండటంతో ట్యూనా చేపలు ఎక్కువగా పడుతున్నాయి. – గోనెల వెంకటేశ్వరరావు, వ్యాపారి, కాకినాడ. ఇది కూడా చదవండి: నదిలో విహరిస్తూ...దేవాలయాలను దర్శిస్తూ..! -
మధ్య బంగాళాఖాతంలో "అల్పపీడనం"
సాక్షి, హైదరాబాద్: మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాని ప్రభావం వలన ఈ ప్రాంతంలో ఈరోజు (మంగళవారం) ఉదయం 08.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. ప్రారంభములో ఇది రాగల 48 గంటలలో వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 3 రోజులలో ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలోనూ అక్కడక్కడ భారీ వర్షాలు, పలు చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. -
భారీ వర్షాలు: తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం
సాక్షి, హైదరాబాద్/అమరావతి: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరబాద్‌లో పలు చోట్ల అర్ధరాత్రి నుంచి వర్షం పడుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఇవాళ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. విశాఖ-నరసాపురం మధ్య కాకినాడ సమీపంలో తీరందాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. రాయలసీమలో కొన్నిచోట్ల భారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 55-75 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ► పశ్చిమగోదావరి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. వాయుగుండం ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి. నర్సాపురం, తాడేపల్లిగూడెం,ఏలూరు పలు ప్రాంతాలలో కుండపోతగా వర్షాలుకురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్లోని కంట్రోల్ రూంమ్లు ఏర్పాటు చేశారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో వర్షం కురుస్తోంది. ఎద్దువాగు, జల్లేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. సుమారు 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ► తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల వర్షం పడుతోంది.కాకినాడలో కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాయుగుండం ప్రభావంతో రాజమండ్రిలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉప్పాడ, కొత్తపల్లి, తొండంగి, గండేపల్లి మండలాల్లో వర్షం పడుతోంది. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా వ్యాప్తంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా 70 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ టీములు సంసిద్దంగా ఉన్నాయి.మరికొన్ని గంటల్లో విశాఖ కాకినాడలో మధ్య వాయుగుండం తీరం దాటనున్నది. భారీ వర్షానికి ప్రత్తిపాడులో కోండివారి చెరువుకు గండిపడింది. జగ్గంపేటలో శెట్టిబలిజిపేట, గోపాల్‌నగర్, ఎస్సీ కాలనీలు జలమయం అయ్యాయి. రాజానగరంలో ఇళ్లల్లోకి చేరిన వరద నీరు చేరింది. ► హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం ఖమ్మం జిల్లా వేంసూర్లో అత్యధికంగా 18.7 సెం.మీ వర్షపాతం నాగర్‌కర్నూల్, నల్లగొండ, వనపర్తి జిల్లాల్లో పలుచోట్ల వర్షం మెదక్, సిద్దిపేట, కుమ్రంభీం జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, యాదాద్రి జిల్లాల్లో తేలికపాటి జల్లులు ► విశాఖపట్నం: రాగల నాలుగైదు గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయిని వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో..భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం... కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ముందస్తుగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఐఎండీ సూచించింది. ► విశాఖపట్నం: జిల్లాలో వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం ఎంవీపీ కాలనీ, ద్వారకానగర్, ఎన్ఏడీ జంక్షన్లో భారీ వర్షం గాజువాక హనుమంతవాక పరిసరాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం చిమిడిపల్లి సమీపంలో రైలు పట్టాలపై విరిగిపడ్డ కొండచరియలు కొండచరియలు విరిగిపడటంతో నిలిచిన రైళ్ల రాకపోకలు పెద్దేరు రిజర్వాయర్‌కు భారీగా వరద, 4 గేట్లు ఎత్తివేత ఇన్‌ఫ్లో 1436 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 964 క్యూసెక్కులు కోనాం రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తిన అధికారులు ఇన్‌ఫ్లో 5వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 500 క్యూసెక్కులు చోడవరం మండలం మార్కమ్మరేవు సమీపంలో కూలిన భారీ వృక్షం చోడవరం నుంచి పాడేరు, నర్సీపట్నం వెళ్లే దారిలో ట్రాఫిక్‌కు అంతరాయం లింగరాజుపాలెం వద్ద బ్రిడ్జిపైనుంచి ప్రవహిస్తున్న వరాహ నది నాలుగు గ్రామాలకు నిలిచిన రాకపోకలు ఉధృతంగా ప్రవహిస్తున్న తాండవ నది సత్యవరం-రాంభద్రపురం మధ్య బ్రిడ్జిపైనుంచి ప్రవహిస్తున్న వరద నీరు ► మహబూబ్‌నగర్: జూరాలకు పెరుగుతున్న వరద, 20 గేట్లు ఎత్తివేత ఇన్‌ఫ్లో 1.65 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1.61 లక్షల క్యూసెక్కులు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు, ప్రస్తుతం 317.92 మీటర్లు ► కృష్ణా: జిల్లాలో పలుచోట్ల వర్షం విజయవాడలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కైకలూరులో 29.8 మి.మీ అత్యధిక వర్షపాతం తిరువూరులో ఇళ్లల్లోకి చేరిన వరద నీరు గన్నవరంలో వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం తెంపల్లి, వీఎన్‌పురం కాలనీల్లో మోకాళ్లలోతు నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న ఏలూరు, బుడమేరు, రివస్ కాల్వలు చాట్రాయి మండలంలో రహదారులపై వరద ప్రవాహం ► శ్రీకాకుళం: జిల్లావ్యాప్తంగా వర్షం నాగావళి, వంశధార నదులకు పెరిగిన వరద మడ్డువలస రిజర్వాయర్‌కు వరద, 3 గేట్లు ఎత్తివేత ఇన్‌ఫ్లో 7,143 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 7,657 క్యూసెక్కులు ► కర్నూలు: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద 7 గేట్లు 10 అడుగల మేర ఎత్తిన అధికారులు ఇన్‌ఫ్లో 2,47,032 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 2,22,850 క్యూసెక్కులు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం 884.80 అడుగులు ► నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు పెరిగిన వరద శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 61,443 క్యూసెక్కులు 16 గేట్లు ఎత్తి 50వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల ► కరీంనగర్: లోయర్‌మానేర్ డ్యామ్‌కు వరద 12 గేట్లు ఎత్తి 24వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల ఇన్‌ఫ్లో 24,276 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 24,276 క్యూసెక్కులు ► రాజన్నసిరిసిల్ల: మిడ్‌మానేరు కొనసాగుతున్న వరద నాలుగు గేట్లు ఎత్తి 9,644 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల ఇన్‌ఫ్లో 5,845 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 9,711 క్యూసెక్కులు (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దూసుకొస్తున్న‘గజ’ తుపాను.. జాలర్లకు హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం : తితిలీ తుపాను సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోక ముందే ఆంధ్రప్రదేశ్‌ను మరో తుపాను వణికించేందుకు సిద్దమవుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. ప్రస్తుతం ఇది శ్రీహరి కోటకు 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ నెల 14 నుంచి 17 వరకు రాష్ట్రంలో తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. తీవ్ర తుపానుగా మారిన వాయుగుండం ఈ నెల 15 నాటికి తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. కాగా ఈ తుపానుకు శ్రీలంక దేశం సూచించిన ‘గజ’ పేరును ప్రకటించారు. గజ తుపాను ప్రస్తుతం దక్షిణ చెన్నైకి 250 కిలో మీటర్ల వేగంతో కదులుతోందని స్పష్టం చేసింది. తుపాను ప్రభావంతో రానున్న 24 గంటల్లో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే వేటలో ఉన్న వారు వెనక్కి రావాలని ఆదేశాలు జారీ చేసింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ సహాయచర్యలపై దృష్టి సారించింది. -
'అల'జడి
కృష్ణాజిల్లా,కోడూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపాన్‌గా మారి శుక్రవారం ఉదయం తీరాన్ని తాకే సమయంలో హంసలదీవిలోని సాగరతీరం, పాలకాయతిప్ప బీచ్ ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. సముద్రం సుమారు 150మీటర్ల మేర ముందుకు చొచ్చుకు వచ్చి, రోడ్డును తాకగా, సంగమం వద్ద విశ్రాంతి భవనం వరకు చేరాయి. వాయుగుండం ప్రభావం పూర్తిగా పోయే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదంటూ పాలకాయతిప్ప మెరైన్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. భారీగా కోత.. అలల ఉధృతికి సాగరతీరం పొడవునా ఉన్న ఇసుకతిన్నెలు భారీస్థాయిలో కోతకు గురయ్యాయి. సముద్రం నుంచి సంగమం వరకు ఉన్న మూడు కిలోమీటర్ల మేర తీరం రహదారిలో గుంతలు ఏర్పడ్డాయి. సాగరతీరం వద్ద భయానక పరిస్థితులు చోటు చేసుకోవడంతో మెరైన్ పోలీసులు మధ్యాహ్నం వరకు పర్యాటకులను బీచ్‌లోకి అనుమతించలేదు. సాయంత్రం నుంచి నిబంధనలను సడలించి, స్నానాలకు అనుమతిచ్చారు. -
పత్తికి జీవం
నల్లగొండ అగ్రికల్చర్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు పత్తిచేలకు జీవం పోశాయి. పదిహేను రోజులుగా వర్షం లేకపోవడంతో పత్తి చేలు వాడుపట్టే దశకు చేరుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ముందు వేసిన చేలు కాయలు పగలడంతో పత్తిని కూడా ఏరుతున్నారు. జిల్లాలో 2లక్షల 26 వేల 345 హెక్టార్లలో పత్తి సాగుచేశారు. ఖరీఫ్ ప్రారంభ దశలో వర్షాలు మెట్ట పంటలకు అనుకూలంగా కురవడంతో ఆయకట్టుతోపాటు ఆయకట్టేతర ప్రాం తాలైన దేవరకొండ, నల్లగొండ డివిజన్లలో జూలై చివరి వారంలో పత్తి గింజలు విత్తుకున్నారు. వారం వారం వర్షాలు కురుస్తుండడంతో పత్తి చేలలో కలుపుతీసుకోవడంతో పాటు రెండు మూడు సార్లు ఎరువులకు పెట్టుకున్నారు. దీంతో చేలు ఏపుగా పెరిగి పూత, కాయ దశకు చేరుకున్నాయి. పదిహేను రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతోపాటు ఎండాకాలాన్ని తలపించే విధంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. పత్తి చేలు వాడుపట్టాయి. ఆకులు ఎర్రబారి కొన్ని ప్రాంతాల్లో పూత, పిందెలు రాలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులు పత్తి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని రైతులతోపాటు వ్యవసాయ శాఖ అధికారులు ఆందోళన చెందారు. కనీ సం పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి వస్తాయో రావోనన్న భయం నెలకొంది. కానీ బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా జిల్లావ్యాప్తంగా సోమ, మంగళ, బుధవారాలలో కురిసిన వర్షాలు పత్తిచేలకు జీవం పోశాయి. చేలు ఏపుగా కనిపిస్తున్నాయి. రైతులు తిరిగి ఎరువులకు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. 34 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్‌లో పత్తి దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చే అవకాశం ఉన్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 34 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అస్కారం ఉందని చెబుతున్నారు. రైతులకు, మెట్ట పంటలకు అనుకూలమైన వర్షాలు కురుస్తుడడం పత్తి రైతులకు కలిసివచ్చే అవకాశం ఉంది. 25 మండలాల్లో కురిసిన వర్షం జిల్లాలో 25 మండలాల్లో వర్షం కురిసింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన వర్షపాతం ఇలా ఉంది. హాలియా మండలంలో 34.4 మిల్లీమీటర్లు, కనగల్ 29.2, దామరచర్లలో 27.0, పెద్దవూరలో 26.4, నల్లగొండలో 15.6, గుర్రంపోడులో 15.5, చింతపల్లిలో 14.6, శాలిగౌరారం 13.6, మర్రిగూడలో 13.4, నిడమనూరులో 9.8, దేవరకొండలో 9.4, నాంపల్లిలో 9.2, కేతేపల్లిలో 9.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అదే విధంగా చిట్యాలలో 6.2, మిర్యాలగూడలో 4.8, కట్టంగూరులో 3.6, మునుగోడులో 3.6, పీఏపల్లిలో 3.4, త్రిపురారంలో 2.0, డిండిలో 1.8, తిప్పర్తి 1.4, చండూరులో 0.8 మిల్లీమీటర్లు కురిసి సగటు వర్షపాతం 10.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. బుధవారం మధ్యాహ్నం కూడా జిల్లా వ్యాప్తంగా వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆనందంగా ఉంది వర్షాలు రాకపోవడంతో పత్తి చేను వాడిపట్టింది. ఇక పెట్టుబడి కూడా చేతికి వస్తుందో రాదో నని బాధపడ్డాం. ఎకరా నికి రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టి రెండు ఎకరాల్లో పత్తి గింజలు విత్తాను. పదిహేను రోజులుగా వర్షాలు రాకపోవడంతో అప్పుల పాలవుతామని భయపడ్డా. కానీ మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఆనందంగా ఉంది. పత్తి చేను మంచిగా పెరిగి పూత, కాయలు బాగానే పడుతున్నాయి. దిగుబడి బాగానే వస్తుందని అనుకుంటున్నాను.– అందే నరేష్, రైతు గుండ్లపల్లి పత్తి చేలకు మంచి అనుకూలం మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు పత్తి చేలకు మంచి అనుకూలం. వాడుపట్టే దశలో వర్షాలు కురవడం వల్ల చేలకు బలం చేకూరుతుంది. పూత, కాయలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చే వారం పది రోజుల్లో మరోసారి వర్షం కురిస్తే మంచి దిగుబడులు వచ్చి రైతులు లాభాలు పొందే అవకాశం ఉంది. ఏమైనా తెగుళ్లు ఆశించినట్లు కనిపిస్తే వ్యవసాయాధికారులను సంప్రదించి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. – జి.శ్రీధర్‌రెడ్డి, జేడీఏ -
బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం
విశాఖపట్నం జిల్లా : వాయివ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. బంగ్లాదేశ్ తీరం వైపు పయనిస్తూ, రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ, తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. చత్తీస్గడ్ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. రాయలసీమలో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో రాగల 24 గంటల్లో అక్కడక్కడ ఉరుమలు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయి. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ, తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. -
రానున్న మూడు రోజులు వర్షాలే వర్షాలు!
విశాఖపట్నం: బంగాళాఖాతం సముద్రంలో ఏర్పడిన వాయుగుండం ఊపుతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తాకు రుతుపవనాలు విస్తరించాయి. ఉత్తర కోస్తాలోని నర్సాపూర్ వరకు రుతుపవనాలు విస్తరించాయని వాతావరణశాఖ తెలిపింది. రుతుపవనాలు వేగంగా విస్తరించడంతో ఉష్ణోగ్రతలు తగ్గడమే కాకుండా వరుసగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. గత రెండుమూడు రోజులుగా వానలు కురవడంతో ప్రజలు, రైతులు ఎంతో ఊరట చెందారు. తాజాగా బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో వచ్చే రెండు, మూడు రోజుల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. -
ఉప్పుటేరు పాయల్లోనే ఉప్పాడ బోట్లు
కృత్తివెన్ను : హుదూద్ తుపాను తాకిడికి తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడకు చెందిన 65 బోట్లు కృత్తివెన్ను మండలంలోని పల్లెపాలెం, పడతడికల్లోని ఉప్పుటేరు పాయలకు శనివారం రాత్రి చేరుకున్నాయి. తహశీల్దార్ పి.మధుసూధనరావు క థనం ప్రకారం ఉప్పాడకు చెందిన 65 బోట్లలో సుమారు 700 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. ఈ సమయంలో బంగళాఖాతంలో ఏర్పడిన హుదూద్ తుపాను కారణంగా స్వగ్రామం చేరడానికి సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవటంతో సురక్షిత ప్రాంతమైన కృత్తివెన్ను మండలానికి వారు చేరుకున్నారు. మార్గమధ్యంలో అంతర్వేదిలో కొందరు మత్స్యకారులు దిగి స్వస్థలానికి వెళ్లిపోగా సుమారు 80 మంది మత్స్యకారులు కృత్తివెన్ను మండలంలో బోట్లకు లంగరు వేసి కాపలాగా ఉన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు శనివారం రాత్రి వారి నుంచి పూర్తి వివరాలు సేకరించి వారికి పునరావాస శిబిరం ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం అల్పహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తహశీల్దార్ తెలిపారు. వాతావరణం కుదుట పడే వరకు ఇక్కడే... సముద్రంలో వాతావరణం ప్రశాంతత ఏర్పడి చేపలవేటకు అనుకూలించే వరకు ఉప్పాడకు చెందిన బోట్లు కృత్తివెన్ను మండలంలో ఉంటాయని ఆర్డీవో సాయిబాబు తెలిపారు. ఆదివారం కృత్తివెన్ను మండలానికి వచ్చిన ఆర్డీవో ఉప్పాడకు చెందిన మత్స్యకారులతో మాట్లాడారు. ఆర్డీవోతో పాటు మండల తుపాను ప్రత్యేకాధికారి, ఉపాధిహామీ అడిషనల్ పీడీ సురేష్, ఎంఈవో సత్యవతి ఉన్నారు. ప్రమాద సూచికలు ముందు మాకే తెలుస్తాయి సముద్రంలో వేటకు వెళ్లిన మాకు తీరం నుంచి వచ్చిన సమాచారం కన్నా సముద్రంలో అలల ఉధృతే తుపాను ప్రభావాన్ని మాకు ముందుగా తెలుపుతుంది. విషయం తెలుసుకున్న మేము ఉప్పాడ వైపు వెళ్లడానికి అంతగా అనుకూలం లేకపోవటంతో కృత్తివెన్ను మండలం సురక్షితమని ఇక్కడకు చేరుకున్నాం. సముద్రంలో ఉధృతి తగ్గాక తిరిగి స్వస్థలాలకు వెళతాం. - సత్తిరాజు, ఉప్పాడ బోట్లకు లంగరు వేశాం సముద్రంలో వాతావరణం భయానకంగా ఉండటంతో ప్రమాదాన్ని పసిగట్టి ముందుగానే తీరానికి చేరుకున్నాం. మాతో పాటు మరో 64 బోట్లు మండలంలోని వివిధ ప్రాంతాల్లో లంగరు వేసి నిలిపాం. అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాక తిరిగి మా స్వస్థలాకు వెళతాం. - సుబ్బారావు, ఉప్పాడ