బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం | Continuous Impedance In BangalaKhatam | Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం

Published Sun, Jun 10 2018 11:36 AM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

Continuous Impedance In BangalaKhatam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

విశాఖపట్నం జిల్లా : వాయివ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌ తీరం వైపు పయనిస్తూ, రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ, తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. చత్తీస్‌గడ్‌ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. రాయలసీమలో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

కోస్తా జిల్లాల్లో రాగల 24 గంటల్లో అక్కడక్కడ ఉరుమలు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయి. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ, తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement