low depression
-
బంగాళాఖాతంలో వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం ఉదయం నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి శుక్రవారం ఉదయం తీవ్ర వాయుగుండంగా మారే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఇది శ్రీలంకలోని ట్రింకోమలికి 360 కి.మీ., తమిళనాడులోని నాగపట్నంకు 700 కి..మీ., పుదుచ్చేరికి 760 కి.మీ., చెన్నైకు 840 కి..మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ప్రస్తుతం గంటకు 18 కి.మీ. వేగంతో కదులుతోందని.. రాగల 48 గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణిస్తూ శ్రీలంక తూర్పు తీరం వెంబడి ఉత్తర తమిళనాడు వద్ద తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మార్చిలో తీవ్ర వాయుగుండం, తుపాను ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గడిచిన 200 సంవత్సరాల కాలంలో కేవలం 11 సార్లు మాత్రమే ఈ తరహా వాతావరణం ఏర్పడిందని.. చివరిసారిగా 1994లో బంగాళాఖాతంలో స్వల్ప తుపాను వచ్చినట్లు వారు వెల్లడించారు. ప్రస్తుత వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై తక్కువగా ఉంటుందన్నారు. దీని ప్రభావంవల్ల దక్షిణ కోస్తా, రాయలసీమలో నేడు, రేపు పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయనీ.. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 50–60 కి.మీ. గరిష్టంగా 70 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని.. ఈ కారణంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మత్స్యకారులెవ్వరూ 6వ తేదీ వరకూ వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. -
భారీ వర్షాలు: తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం
సాక్షి, హైదరాబాద్/అమరావతి: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరబాద్‌లో పలు చోట్ల అర్ధరాత్రి నుంచి వర్షం పడుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఇవాళ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. విశాఖ-నరసాపురం మధ్య కాకినాడ సమీపంలో తీరందాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. రాయలసీమలో కొన్నిచోట్ల భారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 55-75 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ► పశ్చిమగోదావరి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. వాయుగుండం ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి. నర్సాపురం, తాడేపల్లిగూడెం,ఏలూరు పలు ప్రాంతాలలో కుండపోతగా వర్షాలుకురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్లోని కంట్రోల్ రూంమ్లు ఏర్పాటు చేశారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో వర్షం కురుస్తోంది. ఎద్దువాగు, జల్లేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. సుమారు 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ► తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల వర్షం పడుతోంది.కాకినాడలో కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాయుగుండం ప్రభావంతో రాజమండ్రిలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉప్పాడ, కొత్తపల్లి, తొండంగి, గండేపల్లి మండలాల్లో వర్షం పడుతోంది. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా వ్యాప్తంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా 70 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ టీములు సంసిద్దంగా ఉన్నాయి.మరికొన్ని గంటల్లో విశాఖ కాకినాడలో మధ్య వాయుగుండం తీరం దాటనున్నది. భారీ వర్షానికి ప్రత్తిపాడులో కోండివారి చెరువుకు గండిపడింది. జగ్గంపేటలో శెట్టిబలిజిపేట, గోపాల్‌నగర్, ఎస్సీ కాలనీలు జలమయం అయ్యాయి. రాజానగరంలో ఇళ్లల్లోకి చేరిన వరద నీరు చేరింది. ► హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం ఖమ్మం జిల్లా వేంసూర్లో అత్యధికంగా 18.7 సెం.మీ వర్షపాతం నాగర్‌కర్నూల్, నల్లగొండ, వనపర్తి జిల్లాల్లో పలుచోట్ల వర్షం మెదక్, సిద్దిపేట, కుమ్రంభీం జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, యాదాద్రి జిల్లాల్లో తేలికపాటి జల్లులు ► విశాఖపట్నం: రాగల నాలుగైదు గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయిని వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో..భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం... కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ముందస్తుగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఐఎండీ సూచించింది. ► విశాఖపట్నం: జిల్లాలో వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం ఎంవీపీ కాలనీ, ద్వారకానగర్, ఎన్ఏడీ జంక్షన్లో భారీ వర్షం గాజువాక హనుమంతవాక పరిసరాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం చిమిడిపల్లి సమీపంలో రైలు పట్టాలపై విరిగిపడ్డ కొండచరియలు కొండచరియలు విరిగిపడటంతో నిలిచిన రైళ్ల రాకపోకలు పెద్దేరు రిజర్వాయర్‌కు భారీగా వరద, 4 గేట్లు ఎత్తివేత ఇన్‌ఫ్లో 1436 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 964 క్యూసెక్కులు కోనాం రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తిన అధికారులు ఇన్‌ఫ్లో 5వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 500 క్యూసెక్కులు చోడవరం మండలం మార్కమ్మరేవు సమీపంలో కూలిన భారీ వృక్షం చోడవరం నుంచి పాడేరు, నర్సీపట్నం వెళ్లే దారిలో ట్రాఫిక్‌కు అంతరాయం లింగరాజుపాలెం వద్ద బ్రిడ్జిపైనుంచి ప్రవహిస్తున్న వరాహ నది నాలుగు గ్రామాలకు నిలిచిన రాకపోకలు ఉధృతంగా ప్రవహిస్తున్న తాండవ నది సత్యవరం-రాంభద్రపురం మధ్య బ్రిడ్జిపైనుంచి ప్రవహిస్తున్న వరద నీరు ► మహబూబ్‌నగర్: జూరాలకు పెరుగుతున్న వరద, 20 గేట్లు ఎత్తివేత ఇన్‌ఫ్లో 1.65 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1.61 లక్షల క్యూసెక్కులు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు, ప్రస్తుతం 317.92 మీటర్లు ► కృష్ణా: జిల్లాలో పలుచోట్ల వర్షం విజయవాడలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కైకలూరులో 29.8 మి.మీ అత్యధిక వర్షపాతం తిరువూరులో ఇళ్లల్లోకి చేరిన వరద నీరు గన్నవరంలో వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం తెంపల్లి, వీఎన్‌పురం కాలనీల్లో మోకాళ్లలోతు నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న ఏలూరు, బుడమేరు, రివస్ కాల్వలు చాట్రాయి మండలంలో రహదారులపై వరద ప్రవాహం ► శ్రీకాకుళం: జిల్లావ్యాప్తంగా వర్షం నాగావళి, వంశధార నదులకు పెరిగిన వరద మడ్డువలస రిజర్వాయర్‌కు వరద, 3 గేట్లు ఎత్తివేత ఇన్‌ఫ్లో 7,143 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 7,657 క్యూసెక్కులు ► కర్నూలు: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద 7 గేట్లు 10 అడుగల మేర ఎత్తిన అధికారులు ఇన్‌ఫ్లో 2,47,032 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 2,22,850 క్యూసెక్కులు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం 884.80 అడుగులు ► నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు పెరిగిన వరద శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 61,443 క్యూసెక్కులు 16 గేట్లు ఎత్తి 50వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల ► కరీంనగర్: లోయర్‌మానేర్ డ్యామ్‌కు వరద 12 గేట్లు ఎత్తి 24వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల ఇన్‌ఫ్లో 24,276 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 24,276 క్యూసెక్కులు ► రాజన్నసిరిసిల్ల: మిడ్‌మానేరు కొనసాగుతున్న వరద నాలుగు గేట్లు ఎత్తి 9,644 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల ఇన్‌ఫ్లో 5,845 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 9,711 క్యూసెక్కులు (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తెలంగాణకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత తీవ్రమైంది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రానికి ఒకటో నంబరు హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో గత మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా వానలు కురుస్తున్నాయి. శనివారం రాష్ట్రంలో 4.52 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.(హెలికాప్టర్‌తో రైతులను రక్షించిన రెస్క్యూ టీం) ఇక ఆది, సోమవారాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులతో మాట్లాడారు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షించారు. హైదరాబాద్‌లో రెండు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రులు తమ జిల్లాల్లోనే ఉండాలని, కలెక్టర్, పోలీస్ అధికారులతో కలసి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. అలాగే తెలంగాణవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగుతున్నాయి.(వాగులో కొట్టుకుపోయిన లారీ) -
నగరంలో భారీ వర్షం.. ట్రాఫిక్‌కు అంతరాయం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. దీంతో వర్షం నీరు రోడ్లపై నిలిచిపోవడంతో పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలు దేరిన వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. హైటెక్‌సిటీ, కూకట్పల్లి, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. ఒక్క వానకే నగర రోడ్లు, ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తమయింది. దీంతో వర్షాకాలం ముగిసేవరకు ఇంకా ఎన్ని ఇక్కట్లు పడాల్సి వస్తుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గురువారం సాయంత్రం సరూర్‌నగర్‌లో 33.8, రాజేంద్రనగర్‌లో 28.8, నాంపల్లిలో 27.3, మలక్‌పేట్, ఫలక్నామాలో 25.0, చందానగర్‌లో 24.5, గోల్కొండలో 23.5, పటాన్చెరు పరిసర ప్రాంతాల్లో 21.0, హయత్‌నగర్‌లో 19.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అధికారులు తెలిపారు. తెలంగాణలో ఒక మోస్తరుపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశించారు. -
భారీ వర్షంతో భాగ్యనగరం తడిచిముద్దయింది
-
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్ : భారీ వర్షంతో భాగ్యనగరం తడిచిముద్దయింది. గురువారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలు దేరిన వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గచ్చిబౌలి, రాజేంద్రనగర్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్‌లలో ఈదురు గాలుతో కూడిన వర్షం కురుస్తోంది. మరో రెండు గంటల పాటు భారీగా వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అధికారులు తెలిపారు. తెలంగాణలో ఒక మోస్తరుపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశించారు. -
నేడు, రేపు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ, రాయలసీమల మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో కోస్తాంధ్రలోను, మంగళవారం రాయలసీమలోను అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు గాని, తేలికపాటి వర్షం గాని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఆదివారం తెలిపింది. అదే సమయంలో కొన్ని చోట్ల ఈదురుగాలులకు, అకాల వర్షాలకు ఆస్కారం ఉందని హెచ్చరించింది. -
సికింద్రాబాద్‌లో భారీ వర్షం
-
హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం
- చిలకలగూడలో అత్యధికంగా 2.5 సెం.మీ భారీ వర్షం సాక్షి, హైదరాబాద్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో మంగళవారం నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చిలకలగూడలో రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా 2.5 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. ఆసిఫ్‌నగర్‌లో 1.8, ఉప్పల్‌లో 1.6, చార్మినార్‌లో 1.3, ఫీవర్ ఆస్పత్రి వద్ద 1.3, షేక్‌పేట్‌లో 1.2, మల్కాజ్‌గిరిలో 1.1, నారాయణగూడలో 1.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పలు చోట్ల కురిసిన వర్షానికి రహదారులపై వరదనీరు పోటెత్తింది. సాయంత్రం వేళ కార్యాలయాలు, విద్యాసంస్థల నుంచి ఇంటికి బయలుదేరిన ఉద్యోగులు, విద్యార్థులు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. మరో 48 గంటలపాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు... రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అలాగే రెండ్రోజుల్లో బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో 21, 22, 23 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. గడచిన 24 గంటల్లో మణుగూరులో 7 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. ఆత్మకూరు, గూడూరుల్లో 6 సెంటీమీటర్ల చొప్పున, సిర్పూరు, హైదరాబాద్, గుండాలల్లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
కోస్తాంధ్ర, తెలంగాణలో అతిభారీ వర్షాలు
హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో ఖమ్మం జిల్లా పలుప్రాంతాలు.. ములకలపల్లిలో 17 సెం.మీ, టేకులపల్లిలో 14, చంద్రగొండలో 11.8, బయ్యారంలో 10.9 సెం.మీ నమోదైన వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాలో మొగుళ్లపల్లిలో 13 సెం.మీ, గోవిందరావుపేట 13 సెం.మీ, వెంకటాపూర్ 12.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో 3.6 సెం.మీ, విజయనగరంలో 3.3 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, తూర్పుగోదావరి జిల్లాలో 2.3 సెం.మీ, కృష్ణా జిల్లాలో 2.1 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. -
బంగ్లాదేశ్ వైపు తరలిన అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడనం బంగ్లాదేశ్ వైపు తరలిపోయింది. ఇంకోవైపు, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరింత బలపడనుంది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ ఆదివారం నాటికి తుపానుగా మారనుంది. ఈ నెల 12 నుంచి బలహీన పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుపానుకు బంగ్లాదేశ్ సూచించిన ‘చపల’ అనే పేరు పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండబోదని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా బిహార్ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఉపరితల ద్రోణి, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. -
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనంకూడా కొనసాగుతోంది. మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో మరొక బలమైన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని భారత వాతావరణ విభాగం గురువారంరాత్రి విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. మరోవైపు రాయలసీమపై రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటన్నింటి ప్రభావంవల్ల రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గాని ఉరుములతో కూడినజల్లులు గాని కురిసే అవకాశముందని తెలిపింది. -
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం
విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి బుధవారం ఉదయానికి గా మారింది. తొలుత అంచనా వేసినట్టుగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో కాకుండా, ఏర్పడడంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్న ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కూడా బలపడి వచ్చే 24 గంటల్లో ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం నాటి నివేదికలో పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలమైన అల్పపీడనంగా మారవచ్చని దీని ప్రభావం.. ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలపై అధికంగాను, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో కొంతవరకు ప్రభావం చూపవచ్చని వాతావరణం నిపుణులు చెబుతున్నారు. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. గడచిన 24 గంటల్లో తిరుపతిలో 6, పాలసముద్రంలో 5, తనకల్లో 4, రుద్రవరం, చిన్నమాడెం, జమ్మలమడుగు, ఆలూరుల్లో 3, పెనుకొండ, రాజంపేట, పుత్తూరు, పుల్లంపేట, కంబదూరు, పలమనేరు, కల్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, పాడేరుల్లో రెండేసి సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. -
మూడు రోజుల్లో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వర్షాలు మరికొన్నాళ్లు కొనసాగడానికి వాతావరణం అనుకూలంగా మారుతోంది. ఇప్పటికే నాలుగైదు రోజులుగా అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు, నైరుతి రుతుపవనాల చురుకుదనంతో ఏపీ, తెలంగాణలో ఆశాజనకంగా వానలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం బలం పుంజుకుంటోంది. దీంతో మరో మూడు రోజుల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాయలసీమలో బలంగాను, కోస్తాంధ్రలో మోస్తరుగాను ప్రభావం చూపుతున్నాయి. అంతేగాక ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడనద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. వీటి ఫలితంగా రానున్న రెండు రోజులు ఆంధ్ర, తెలంగాణల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. -
నేడూ కొనసాగనున్న అల్పపీడన ద్రోణి
సాక్షి,సిటీబ్యూరో: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గ్రేటర్ పరిధిలో పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు జడివాన కురిసింది. సరూర్‌నగర్‌లో అత్యధికంగా 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ ప్రకటించింది. మహేశ్వరంలో 1.7 సెంటీమీటర్లు, శామీర్‌పేట్‌లో ఒక సెంటీమీటరు మేర వర్షపాతం నమోదైందని తెలిపింది. భారీ వర్షం కారణంగా సరూర్‌నగర్ పరిధిలోని పలు కాలనీలు,ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రాత్రి 8.30 గంటల వరకు 3.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం వేళ కురిసిన వర్షంతో రహదారులపై వరదనీరు పోటెత్తింది. పలు ప్రధాన రహదారులపై గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించడంతో ఉద్యోగులు,విద్యార్థులు,మహిళలు ట్రాఫిక్ రద్దీతో విలవిల్లాడారు. రాగల 24 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. -
బలపడిన అల్పపీడన ద్రోణి... రుతుపవనాల్లో కదలిక
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో వానలకు పరిస్థితులు మళ్లీ అనుకూలిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి రాయలసీమ, తెలంగాణల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ఒక్కసారిగా బలం పుంజుకుంది. అదే సమయంలో బలహీనంగా ఉన్న నైరుతి రుతుపవనాల్లో కూడా చురుకుదనం సంతరించుకున్నట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. రానున్న రెండు, మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. గడచిన 24 గంటల్లో బాపట్ల, విజయనగరంలో 7 సెం.మీలు, పూసపాటిరేగలో 6, చీమకుర్తి, ప్రత్తిపాడు, అద్దంకి, మర్రిపూడి, చిత్తూరుల్లో 5, మాచెర్ల, నర్సీపట్నం, తిరుమలలో 4, కుప్పం, కళింగపట్నం, పోలవరంలలో 3, జూపాడుబంగ్లా, పాలసముద్రం, పాకాల, సంతమగుళూరు, డెంకాడ, గూడూరు, తునిల్లో రెండేసి సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
అల్పపీడనంగా వాయుగుండం
జార్ఖండ్, ఒడిశాలపై కేంద్రీకృతం ఇరు రాష్ట్రాలకు మోస్తరు వానలు సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతం తీరం దాటిన వాయుగుండం సోమవారం ఉదయానికి బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఇది ఒడిశాకు ఆనుకుని జార్ఖండ్‌పై ఆవరించి ఉంది. ఫలితంగా నాలుగు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు విరామం దొరికింది. మరోవైపు అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. కోస్తాంధ్ర, తెలంగాణలపై నైరుతి రుతుపవనాలు ఒకింత చురుగ్గా ఉన్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ రానున్న 24 గంటల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) సోమవారం నాటి నివేదికలో తెలిపింది. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వానలు కురవవచ్చని పేర్కొంది. సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. -
వానలే వానలు
* రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు * జల దిగ్బంధంలో వందలాది గ్రామాలు * వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో కుండపోత * కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరుగా.. * ఏటూరునాగారం, వాజేడులో 21 సెం.మీ. అత్యధిక వర్షపాతం * ఖమ్మం జిల్లాలో వరదలో చిక్కుకొని ఇద్దరు బాలికల మృతి * మరో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం సాక్షి, నెట్వర్క్: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఒడిశాలోని పూరీ-గోపాల్పూర్ మధ్య తీరం దాటడం, దానికితోడు రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఆదివారం తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలను కుండపోత వర్షాలు ముంచెత్తగా కరీంనగర్, రంగారెడ్డి సహా ఇతర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో వివిధ జిల్లాల్లో వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్ జిల్లాలో 27 చెరువులకు గండ్లు.. వరంగల్ జిల్లావ్యాప్తంగా 51 మండలాల్లో ఆదివారం 10.09 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారంలో అత్యధికంగా 21.12 సెం.మీ. వర్షం కురిసింది. జూన్‌లో ఇప్పటివరకు మొత్తం 13.72 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్యప్రణాళికాధికారి బీఆర్.రావు వివరించారు. భారీ వర్షాలతో జిల్లాలో 27 చెరువులకు గండ్లు పడ్డారుు. ఏటూరునాగారం ఏజెన్సీలో 8 గ్రామాలు, చిట్యాల మండలంలో చలివాగు ఉధృతితో 4 గ్రామా లు, గణపురం మండలంలో మోరంచవాగు ఉప్పొంగడం తో 15 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారుు. ఏటూరునాగారం మండలంలోని దేవాదుల ఎత్తిపోతల పథకం వద్ద నీటిమట్టం 78 మీట ర్ల వరకు చేరుకుంది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 7.50 మీటర్లకు చేరింది. గణపురం మండలం చెల్పూరు శివారులోని కేటీపీపీలోకి భారీగా వరదనీరు చేరుతుండటంతో ప్లాంటు రెండో దశ పనులకు ఆటంకం ఏర్పడింది. భద్రాచలంలో 31.1 అడుగులకు గోదావరి... భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా తడిసి ముద్దవుతోంది. జిల్లాలోని వాజేడులో ఆదివారం 21 సెం.మీ., వెంకటాపురం, చర్ల, ముల్కలపల్లి, ఇల్లెందులో 15 సెం.మీ చొప్పున వర్షం కురిసింది. వాజేడు మండలల్లోని చీకుపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మండల కేంద్రం నుంచి చీకుపల్లి వాగు అవతల ఉన్న 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 31.1 అడుగులకు చేరుకుంది. టేకులపల్లి మండలంలోని కోయగూడెం పంచాయతీ కొండంగుల బోడు గ్రామానికి చెందిన సునీత (7) అంజలి (12) అనే బాలికలు ఓ కల్వర్టు వద్ద కాలు జారి వరదనీటిలో కొట్టుకుపోయి మృతిచెందారు. జాలిముడి ప్రాజెక్టు సమీపంలో కరకట్టకు గండి పడటంతో వరద మధ్య ఉన్న పాకల్లో విద్యుత్‌శాఖ సిబ్బంది చిక్కుకుపోయూరు. పోలీసులు వారిని కాపాడారు. కరీంనగర్లో ఓ మోస్తరుగా... కరీంనగర్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 6.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మహదేవపూర్ మండలంలో 13.6 సెం.మీ. వర్షం కురిసింది. మహదేవపూర్, మహాముత్తారం మండలాలోని 17 అటవీగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు చేరడంతో ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రంగారెడ్డి జిల్లాలోని తాండూరు, వికారాబాద్, శంషాబాద్, మొయినాబాద్ తదితర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం కుండపోతగా వర్షం కురిసింది. ఈ వర్షాలతో కంది, పెసర, మినుము, సోయాబీన్, మొక్కజొన్న తదితర పంటలకు మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 3 సెం.మీ వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లావ్యాప్తంగా 58 మండలాల్లో వర్షం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 1.38 సెం.మీ.గా నమోదైంది. మరో 48 గంటలపాటు కుండపోత రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని అనేక చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. అయ్యో రామలింగేశ్వరా.. వరంగల్ జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయం పైకప్పు నుంచి వర్షపు నీరు ధారాల్లాగా కురుస్తుండడంతో ఆలయం లోపలి భాగం చిత్తడిగా మారింది. దీంతో అధికారులు ఆలయం పైకప్పుపై పరదా కప్పి చేతులు దులుపుకున్నారు. ఆలయ పైకప్పును పునరుద్ధరించేందుకు రూ.15 లక్షలతో గత ఫిబ్రవరిలో పనులు చేపట్టారు. మూడు నెలలపాటు పనులను చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఈ దుస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తిన వాన ఆదివారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఆదిలాబాద్ జిల్లా జలమయమైంది. జిల్లాలో సగటున 8.48 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వేమనపల్లిలో అత్యధికంగా 20.86 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 15 మండలాల్లో 10 సెం.మీ.పైగా వర్షం కురవగా 27 మండలాల్లో 5 నుంచి 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా సుమారు 30 ఇళ్లు నేలమట్టమయ్యాయి. వాగులు ఉప్పొంగడంతో 151కిపైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జైపూర్ మండలం మిట్టపల్లి, చెన్నూరు మండల పరిధిలోని సుద్దాల, కత్తర శాల, నారాయణపూర్, అక్కెపల్లి, సంకారం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఆసిఫాబాద్ మండలం కొమురంభీం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గేట్లు ఎత్తివేశారు. రెబ్బెనలో 50 ఎకరాల్లో పత్తి విత్తనాలు వరదల్లో కొట్టుకుపోగా, 30 ఎకరాల్లో పత్తి మొలకలు దెబ్బతిన్నాయి. కైరిగూడ, డొర్లి-1, డొర్లి-2 ఓపెన్‌కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. సుమారు రూ.3 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. పెన్‌గంగలో స్మగ్లర్ల సాహసం..! ఆదిలాబాద్ జిల్లాలో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెన్ గంగ ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినా, దేశీదారు స్మగ్లర్లు సాహసమే చేశారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా లారీ ట్యూబ్‌పై దేశీదారును పెన్‌గంగలో తరలించారు. ముగ్గురు స్మగ్లర్లు దేశీదారును పెన్‌గంగ దాటిస్తూ ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు. - ఆదిలాబాద్ -
విశాఖ నగరాన్ని వణికిస్తున్న చలిపులి
విశాఖపట్నం: నగరంలో చలిపులి పంజా విసురుతోంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలితీవత్ర రోజురోజుకీ పెరుగుతోంది. ఒక్కసారిగా గరిష్ట ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోవడంతో విశాఖ ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికీ విశాఖలో 20 నుంచి 23 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దాంతో విశాఖ మన్యం ప్రాంతంలో చల్లగాలులు వీస్తున్నాయి. రాత్రివేళల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండటంతో తట్టుకోలేక ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశమున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈశాన్య దిశగా ఈదురుగాలులు వీసే అవకాశమున్నట్టు అధికారులు తెలిపారు. ఫలితంగా దక్షిణాకోస్తాలో చాలా చోట్ల వర్షాలు, ఉత్తరకోస్తాలో ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశముంది. చేపల వేటకు వెళ్లే మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. -
బలపడనున్న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని శ్రీలంక సమీపంలో (గల్ఫ్ ఆఫ్ మన్నార్) ఏర్పడ్డ అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడనుందని భారత వాతావరణవిభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. దీనికి తోడు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటల్లో తమిళనాడులో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. అదే సమయంలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని కురుస్తాయని, ఉత్తర కోస్తా, తెలంగాణల్లో అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. గడచిన 24 గంటల్లో అత్యల్పంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్యవరంలో 13, తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
కొనసాగుతున్న అల్పపీడనం
* కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం కనిపిస్తున్న చలి ప్రభావం విశాఖపట్నం, సాక్షి: నైరుతి బంగాళాఖాతంలో శ్రీ లంక, హిందూ మహాసముద్రానికి ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా ఉంది. సముద్రమట్టానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. దీని ప్రభావం తమిళనాడు కోస్తాపై ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షంగానీ, ఉరుములతో కూడిన జల్లులుగానీ పడవచ్చని వివరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుముఖం పడుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రత కంటే 1-5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో చలి ప్రభావం కనిపిస్తోంది. మరోవైపు ఏపీలోని నందిగామ, ఆరోగ్యవరాల్లో 15 డిగ్రీలు, తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. దీని ప్రభావం తమిళనాడుపై ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం మరింత బలపడనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 25నాటికి అల్పపీడనంగా మారవచ్చు. కోస్తాంధ్రలో మూడు రోజుల పాటు పొడివాతావరణం ఉంటుందని వాతావరణ అధికారులు తెలియజేశారు. -
మరో రెండు రోజులు వర్షాలు
సాక్షి, హైదరాబాద్ / విశాఖపట్నం: అల్పపీడనం కారణంగా తెలంగాణలో మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికితోడు ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు, ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరో రెండు రోజుల పాటు ఇవి కొనసాగే అవకాశమున్నట్లు పేర్కొంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో ఒక మాదిరి వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇక హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై కొద్దిపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా.. గత 24 గంటల్లో హైదరాబాద్‌లోని గోల్కొండలో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక చేవెళ్ల, వికారాబాద్‌లో 4 సెంటీమీటర్లు, రామాయంపేటలో 3, మద్దూరు, తాండూరు, సంగారెడ్డి, ములుగు, ధర్మాసాగర్, హకీంపేట్, బిక్నూర్, దుబ్బాక, జుక్కల్, మేడ్చల్‌లలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లోని కావలి, ఆత్మకూరు, గూడూరుల్లో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నెల్లూరు, తడ, సూళ్లూరుపేట, అవనిగడ్డలో 8, సత్యవీడులో 7, గరుగుబిల్లి, శ్రీహరికోట, వింజమూరు, మార్కాపురం, ఉదయగిరి, కాళహస్తి, తిరుపతిలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
బలపడనున్న అల్పపీడనం
* ఏపీ, తెలంగాణల్లో వర్షసూచన సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి అనుకుని ఏర్పడిన అల్పపీడన ప్రాంతం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి ఉపరితల ఆవర్తనం తోడైంది. అల్పపీడనం బలపడనుందని భారత వాతావరణ విభాగం బుధవారం రాత్రి తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంట ల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల మోస్తరు వర్షాలుగానీ, ఉరుములతో కూడిన జల్లులు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. అదే సమయంలో ఉత్తర కోస్తా, తెలంగాణల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులుగానీ, వర్షాలు కురవవచ్చని పేర్కొంది. గడచిన 24 గంటల్లో గూడూరు, సూళ్లూరుపేటల్లో 3 సెం.మీలు, శ్రీహరికోట, అశ్వారావుపేటల్లో 2 సెం.మీ.లు, తడలో 1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తిరుమలను ముంచెత్తిన వర్షం సాక్షి, తిరుమల: తిరుమలలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ వర్షం కురిసింది. ఫలితంగా ఆలయం వద్ద వర్షం నీరు నిలిచింది. శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన భక్తులు తడిసిముద్దయ్యారు. వర్షం వల్ల తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే రెండో ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అదనపు సిబ్బందిని నియమించి పడిన రాళ్లను పడినట్టుగా తొలగించారు. వర్షం వల్ల తిరుమలలో చలి పెరిగింది. -
కోస్తాంధ్ర, తెలంగాణకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఒరిస్సా, ఉత్తర కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీన్ని ఆనుకుని సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. ఇది ప్రస్తుతం నైరుతి దిశగా కదులుతోంది. మరోవైపు ఆంధ్రా తీరం నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర జిల్లాల్లోను, తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవాకాశాలున్నాయని తెలిపింది.