
మరో 24 గంటలపాటు భారీ వర్షాలు
దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. దాంతో మరో 24 గంటలపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా ఆ అల్పపీడనం దారి మళ్లి వచ్చే 48 గంటల్లో వాయవ్యదిశగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది. ఈశాన్య రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయని, అలాగే రుతుపవనాలు, అల్పపీడనం వల్ల పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.