నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది.
హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. దీని ప్రభావం తమిళనాడుపై ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం మరింత బలపడనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 25నాటికి అల్పపీడనంగా మారవచ్చు. కోస్తాంధ్రలో మూడు రోజుల పాటు పొడివాతావరణం ఉంటుందని వాతావరణ అధికారులు తెలియజేశారు.