Next 48 hours
-
వచ్చే 48 గంటల్లో పలుచోట్ల వర్షాలు
-
చెన్నైవాసులకు ఊరట కలిగించే వార్త
చెన్నై: భారీ వర్షాలు, వరదలతో కష్టాలుపడుతున్న చెన్నై వాసులకు ఊరట కలిగించే వార్త. మరో 48 గంటల పాటు చెన్నైలో వర్షాలు పడే సూచన లేదని శుక్రవారం భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరో మూడు రోజుల పాటు చెన్నైలో భారీ వర్షాలు పడతాయని ఈ రోజు ఉదయం చేసిన హెచ్చరికను ఉపసంహరించుకున్నట్టు తెలియజేసింది. చెన్నైలో వర్షం కాస్త తగ్గుముఖంపట్టినా చాలా ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. భారత వైమానిక దళం ఏరియల్ సర్వే నిర్వహించి సహాయక చర్యలు చేపడుతోంది. వర్షం ఇకనైనా ఆగిపోతే సహాయక చర్యలను వేగవంతం చేయడానికి వీలవుతుంది. తమిళనాడు వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు, వివిధ రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల వల్ల తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో అపారనష్టం ఏర్పడిన సంగతి తెలిసిందే. రోడ్లన్నీ జలమయంకాగా రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
మరో 48గంటలపాటు భారీ వర్షాలు
-
మరో 48 గంటలు చాలా ప్రమాదం..
చెన్నై: భారీ వర్షాలు, వరదలతో అష్టకష్టాలు పడుతున్న చెన్నై వాసులకు మరింత ముప్పు పొంచి ఉంది. రోడ్లు, కాలనీలు, రైల్వే ట్రాక్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు జలమయంకావడంతో ఇప్పటికే జనజీవనం స్తంభించిపోగా.. చెన్నైలో మరో 48 గంటలు పాటు భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ 48 గంటలు పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంటుందని హెచ్చరించింది. మరో 72 గంటల పాటు వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. చెన్నైలో తాగు నీరు, నిత్యావసర వస్తువులు దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే రోడ్లు నదులను తలపిస్తున్నాయి. చెన్నైలో రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడం వల్ల సహాయక చర్యలకు విఘాతం ఏర్పడుతోంది. చెన్నై వెళ్లేందుకు బలగాలు సిద్ధంగా ఉన్నాయని, అయితే బలగాల తరలింపునకు వాతావరణం అనుకూలించలేదని రక్షణ మంత్రి మనోమర్ పారికర్ ప్రకటించారు. చెన్నైలో భారీ వర్షాలు పడితే మరింత నష్టం కలిగే ప్రమాదముంది. -
వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు
-
మరో 48 గంటలపాటు వడగాల్పులు
విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాలలో మరో రెండు రోజుల పాటు వడగాల్పులు కొనసాగనున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. ఈ నెల 30 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. -
రాగల 48గంటల్లో తెలంగాణ,కోస్తాంద్రలో వర్షాలు
-
ఆంధ్ర, తెలంగాణకు భారీ వర్ష సూచన
-
నేడో రేపో భారీ వర్షాలు
-
కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు
మహారాష్ట్రలోని విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు దక్షిణ కోస్తాంధ్ర మీదగా అల్పపీడనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం బుధవారం విశాఖపట్నంలో వెల్లడించింది. రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల... తెలంగాణలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. -
రాగల 48 గంటల్లో వర్షలు
-
రాగల 48 గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షాలు
-
రాగల 48 గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. రాష్ట్రంపై అల్పపీడనం పూర్తిగా ఆవరించి ఉందని తెలిపింది. కోస్తాంధ్ర నుంచి తెలంగాణ మీదుగా అల్పపీడనం నెమ్మదిగా కదులుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాగల 48 గంటల్లో ఇటు తెలంగాణ, అటు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. 25 సెంటిమీటర్ల మేర వర్ష పాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. అలాగే హైదరబాద్ నగరంలో కూడా రాగల 48 గంటల్లో కుండపోతగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది.