సాక్షి, విశాఖపట్నం : ఇటీవల వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడుతోంది. ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి ప్రయాణిస్తూ.. ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈశాన్య దిశగా జబల్‌పూర్‌కు 75 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి రాగల 48 గంటల్లో క్రమంగా బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారనుందని భారత వాతావరణ విభాగం గురువారం రాత్రి పేర్కొంది.
దీని ప్రభావంతో రాగల రెండు, మూడు రోజులు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి వానలు పడతాయని ఐఎంసీ తెలిపింది. గాలుల ప్రభావం మాత్రం కొనసాగుతుందని, గంటకు 45 నుంచి 55 కి.మీ వరకు గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా, మత్స్యకారులు శనివారం కూడా వేటకు వెళ్లవద్దని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. గడచిన 24 గంటల్లో కోస్తాలోని కొమరాడలో 9 సెం.మీ, కురుపాంలో 8, జియ్యమ్మవలస, పలాస, పార్వతీపురంలలో 5 సెం.మీ వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment