
తెలంగాణ, కోస్తాంధ్రలలో భారీ వర్షాలు
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం చెప్పింది.
వర్షాలు లేక అల్లాడుతున్న అన్నదాతలకు శుభవార్త. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
అల్పపీడనం ఉన్న ప్రాంతంలో 7.7 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో గంటకు 45 - 50 కిలోమీటర్ల వేగంగా వేగంతో దక్షిణ దిశగా బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్ర తీరంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.