విశాఖపట్నం: ఉత్తరాంధ్ర తీరానికి అనుకుని అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. ఆ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం లేదని అయితే అల్పపీడనం భూమిపైకి చేరుకుని క్రమేణా బలహీనపడుతుందని తెలిపింది.
రాగల 24 గంటల్లో కోస్తా, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.