రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం శనివారం విశాఖపట్నంలో వెల్లడించింది. కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అలాగే కొన్ని చోట్ల కుండపోతగా వర్షాలు తప్పవని పేర్కొంది. కోస్తాంధ్రలో ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వివరించింది. మత్స్యకారులు ఎవరు సముద్రంలో చేపల వేటకు వెళ్ల వద్దని సూచించింది. తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.