కోస్తా జిల్లాలకు మరో తుపాను ముప్పు
Published Sat, Nov 1 2014 8:55 PM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM
విశాఖ: కోస్తా జిల్లాలకు మరో తుపాను ముప్పు పొంచి ఉందని కేంద్ర వాతావరణశాఖ ఇండియా మెటెరోలాజికల్ డిపార్ట్ మెంట్ (ఐఎండీ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈనెల 8 లేదా 9 తేదిన మరో తుపాను వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయని ఐఎండీ తెలిపింది. ఈనెల 5 తేదిన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నని ఐఎండీ అధికారులు తెలిపారు.
అల్పపీడనం క్రమంగా తుపానుగా మారవచ్చని ఐఎండీ అంచనా వేశారు. తుపాను హెచ్చరికల దృష్ట్యా కోస్తా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకూ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని, దాంతో కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన జల్లులు గాని, ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Advertisement
Advertisement