
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. క్రమంగా ఇది వాయువ్యదిశగా కదులుతూ పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.
రేపటికి(నవంబర్ 15కల్లా) పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండగా మారే అవకావం కనిపిస్తోంది. వాయవ్య దిశగా పయనించి.. 16వ తేదీ నాటికి తీవ్రవాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై కనిపించనుంది. కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శుక్రవారం నాటికి ఇది ఉత్తర- ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరానికి చేరుకుంటుంది. కోస్తాంధ్ర తీరంలో వర్షాల నేపథ్యంలో.. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment