నైరుతీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.
విశాఖపట్నం: నైరుతీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో కోస్తా ఆంధ్ర ప్రాంతంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. దక్షిణ కోస్తాలో రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.