సాక్షి, అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో.. రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. రానున్న 24 గంటల్లో వాయువ్యం దిశగా కదిలి ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా ఈరోజు (మంగళవారం), రేపు (బుధవారం) భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
(చదవండి : ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు)
కర్ణాటక కోస్తా ప్రాంతంలో కూడా దీని ప్రభావం ఉంటుందని, 23, 24 తేదీల్లో అక్కడ కూడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది. ఇక వచ్చే నాలుగు రోజులపాటు ద్వీపకల్ప భారతంలో కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తూర్పు, ఈశాన్య భారతంలో ఈనెల 24 25న వర్షాలు కురుస్తాయని తెలిపింది. మధ్య భారతంలో వచే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మరోవైపు బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీయ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. మంగళవారం నుంచి చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. మిగిలిన జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది.
(చదవండి : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు)
Comments
Please login to add a commentAdd a comment