
సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలలో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని మంగళవారం అమరావతి వాతావణ కేంద్రం ప్రకటించింది. ఈ ఉపరితల ఆవర్తనం ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నదని వాతావారణ శాఖ తెలిపింది. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు:
ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం పాటు దక్షిణ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేగాక భారీ నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు(బుధవారం) ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది. గురువారం రోజున మూడు జిల్లాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావారణ కేంద్రం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment