
AP Rains Updates..
👉బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం గురువారం తెల్లవారుజామున తీరం దాటింది. నెల్లూరు జిల్లాలోని తడా వద్ద వాయుగుండం తీరం దాటినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అల్పపీడనంగా వాయుగుండం బలహీనపడనుంది.
కోనసీమ:
- ఓడలరేవు వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది.
- సముద్రపు అలలు ఓఎన్‌జీసీ టెర్మినల్ గేటును తాకాయి.
- ఓఎన్‌జీసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
విశాఖ:
- విశాఖలో ముందుకొచ్చిన సముద్రం
- సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి.
- విశాఖ, గంగవరం పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.
- నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక
👉తిరుపతిలో భారీ వర్షాలు..
- వర్షాల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు
- భారీ వర్షాలతో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ వేంకటేశ్వ ర్
- భారీ వర్షాలు కారణంగా ఈరోజు శ్రీవారి మెట్టు మార్గం మూసివేసిన టీటీడీ

👉గడిచిన ఆరు గంటల్లో 22 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం తీరం దాటింది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక, ఇప్పటికే అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లోనూ రెండు రోజులుగా ఎడతెగని వర్షాలు పడుతున్నాయి. వర్షాల తీవ్రతకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. నెల్లూరు నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై ఉండడంతో జన జీవనానికి ఇబ్బంది ఏర్పడింది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

వాయుగుండం కారణంగా తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

