సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తమిళనాడు సహా ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఏపీవైపు పయనిస్తోంది. అల్పపీడనం ప్రభావం తమిళనాడులోని 12 జిల్లాలతో సహా ఏపీలోకి దక్షిణ కోస్తా, రాయలసీమపై పడనుంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
నేడు బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, గుంటూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు.. అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, ప్రభుత్వం అప్రమత్తమైంది.
Villupuram, Pondy, Cuddalore, Mayiladuthurai stretch getting very good rains. Rains will continue for next few hours.
Our chennai radar is clear, no heavy rains expected for next 1/2 hours. Get ready for Schools and Colleges :(#ChennaiRains | #ChennaiRainsUpdate | #RainAlert pic.twitter.com/lvTvFtog2Y— TamilNadu Weather (@TamilNaduWeath2) November 13, 2024
Comments
Please login to add a commentAdd a comment