సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర వైపు అల్పపీడనం దూసుకొస్తోంది. రేపు తీవ్ర అల్పపీడనంగా బలపడి విశాఖ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావారణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ మాట్లాడుతూ.. అల్పపీడనం ప్రభావంతో నేడు ఏపీలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సెప్టెంబర్ రెండో తేదీ నాటికి అల్పపీడనం వాయుగుండంగా మారి తెలంగాణ మీదుగా పయనించనుంది. ఈ క్రమంలో తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దన్నారు.
NOWCAST UPDATE
Currently parts of Coastal prakasam, scattered parts of central Ap, Godavari, Uttrandhra getting light to moderate rains in few places. Low pressure is around 300km away from #Vizag coast. As system comes closer to coast we can see gradual increase in rainfall pic.twitter.com/qyep9CEEi2— Eastcoast Weatherman (@eastcoastrains) August 30, 2024
వర్షం కురిసే అవకాశం జిల్లాల వారీగా..
అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు
కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు
కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.
Daily Weather Inference 30.08.2024
Influence of Low Pressure Area over North Bay Heavy rains will continue in Central & North Coastal AP Telangana Odissa Chhattisgarh Vidarbha Kerala & Coastal Karnataka. Moderate/Heavy Rains likely in Nilgiris Valparai Ghats OVer TN.Sivagnagai… pic.twitter.com/ZYWqT8iIjB— MasRainman (@MasRainman) August 30, 2024
Comments
Please login to add a commentAdd a comment