సాక్షి, అమరావతి: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావారణ కేంద్రం హెచ్చరించింది. రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని పేర్కొంది. కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు
Published Thu, Jul 22 2021 2:57 PM | Last Updated on Thu, Jul 22 2021 3:07 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment