
సాక్షి, విశాఖపట్నం: ఈనెల 13వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవిర్భవించనుంది. దీని ప్రభావంతో 15వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. వీటి ఫలితంగా సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి వెల్లడించింది.