
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈనెల 7న ఇదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది క్రమంగా బలపడి ఈ నెల 8న తీవ్ర అల్పపీడనంగా ఆపై 8న వాయుగుండంగా మారే అవకాశముందని భారత వాతావరణ విభాగం పేర్కొంది.
ఆ వాయుగుండం మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఉత్తర దిశగా పయనిస్తూ తుపానుగా మారే అవకాశం ఉందని బుధవారం వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు తెలంగాణవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు రానున్న రెండ్రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment