హైదరాబాద్‌లో మళ్లీ దంచికొడుతున్న వాన | Heavy Rain Fall Hyderabad May 20 Updates | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మళ్లీ దంచికొడుతున్న వాన

Published Mon, May 20 2024 2:43 PM | Last Updated on Mon, May 20 2024 2:43 PM

Heavy Rain Fall Hyderabad May 20 Updates

హైదరాబాద్‌, సాక్షి: నగరంలో మళ్లీ భారీ వాన దంచికొడుతోంది. సోమవారం మధ్యాహ్నాం పలు ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. నగరంతో పాటు రాష్ట్రంలో ఈ నాలుగురోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. 

ఇదిలా ఉంటే.. నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు.. మరిన్ని ప్రాంతాల్లోకి విస్తరించనున్నాయి. ఈనెల చివరి వరకు  కేరళను తాకి,  జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. 

నేటి నుంచి మరో నాలుగు రోజుల పాటు తేలిక నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని , దక్షిణ ఈశాన్య జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట నాగర్ కర్నూల్, వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం కనిపిస్తోంది.  

ఈనెల 22 న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్ప పీడన  ఏర్పడే అవకాశం. ఈ అల్ప పీడనం  ఈనెల 24 వ తారీఖు  నాటికీ మధ్య బంగాళాఖాతం ప్రాంతం లో వాయుగుండం గా బలపడే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement