
హైదరాబాద్, సాక్షి: నగరంలో పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం వర్షం కురిసింది. సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చిలకలగూడ, మెట్టుగూడ, కుషాయిగూడ, నాగారం తదితర ప్రాంతాల్లో వాన పడింది. హఠాత్తుగా కురిసిన వర్షంతో నగరవాసులు ఇబ్బందులకు గురయ్యారు. ఇక.. మేడ్చల్ జిల్లా మల్కాజ్‌గిరి, ఈసీఐఎల్, కీసర, చర్లపల్లి, కుషాయిగూడ భారీ వర్షం పడింది.