సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఏజెన్సీలో బుధవారం నుంచి రెండు రోజుల పాటు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పర్యటించున్నారు. మంత్రి ఈ పర్యటనలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలోని ప్రభుత్వ నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని పరిశీలిస్తారు. ఏజెన్సీలో సీజన్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు మంత్రి విశాఖపట్నం బయలుదేరారు. బుధవారం ఉదయం పాడేరులో పర్యటించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఏజెన్సీలోని పాడేరు, అనకాపల్లిలో, గురువారం నాడు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. సీఎం వైఎస్ జగన్ ఏజెన్సీలోని గిరిజనులకు మెరుగైన వైద్య సదుపాయం కలిపించాలని, సత్వరమే వైద్య కాలేజీలు నిర్మాణం వేగవంతం చేయాలని మంత్రి ఆళ్ల నానిని ఆదేశించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment