వలసల ఉత్తరాంధ్ర జాబ్‌హబ్‌గా మారబోతోంది: సీఎం జగన్‌ | CM Jagan Speech At Bhogapuram Public Meeting | Sakshi
Sakshi News home page

వలసల ఉత్తరాంధ్ర జాబ్‌హబ్‌గా మారబోతోంది.. భోగాపురం బహిరంగ సభలో సీఎం జగన్‌

Published Wed, May 3 2023 11:30 AM | Last Updated on Wed, May 3 2023 6:55 PM

CM Jagan Speech At Bhogapuram Public Meeting - Sakshi

సాక్షి, విజయనగరం: అన్ని ప్రాంతాలు బాగాపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం, అందుకే వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం.. సవరవల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 

ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలు గుర్తొచ్చేవి. కానీ, రాబోయే రోజుల్లో జాబ్‌ హబ్‌గా మారుతుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. మూలపేటలో ఈ మధ్యే పోర్టుకు శంకుస్థాపన చేశాం. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుందని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. ఇవాళే అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయబోతున్నాం. డేటా సెంటర్‌తో ఏపీ ముఖచిత్రమే మారబోతోందని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఓర్వలేకనే.. 
ఇవాళ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు హడావిడిగా కొబ్బరి కాయలు కొట్టారు. పైగా మేమే శంకుస్థాపనలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. సుప్రీం కోర్టు, ఎన్జీటీలలో కేసులు వేసి అడ్డుపడ్డారు. అన్ని ఆటంకాలు దాటుకుని ఇవాళ ఎయిర్‌పోర్ట్‌కి శంకుస్థాపం చేసుకున్నాం. రైతన్నల వల్లే ఈ ప్రాజెక్టు వచ్చింది. మెడికల్‌ టూరిజం, ఐటీ, ఇండస్ట్రీస్‌కు కేంద్ర బిందువుగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ మారబోతోంది అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

ఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా.. 
2026లో మీ బిడ్డనే(సీఎం జగన్‌ తనను ఉద్దేశించుకుంటూ..) వచ్చి ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభిస్తాడని,ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ఎవరు ఎన్నికుట్రలు చేసినా ఫలించవని ధీమా వ్యక్తం చేశారాయన.  24 నుంచి 30 నెలల్లోనే ఎయిర్‌పోర్ట్‌ పూర్తి చేస్తామని జీఎంఆర్‌ హామీ ఇచ్చింది. ఏ380 డబుల్‌ డెక్కర్‌ ల్యాండ్‌అయ్యేలా.. ఏర్పాట్లు చేస్తాం. మొదటి ఫేజ్‌లో 60 లక్షల జనాభాకు సదుపాయలు సమకూరుస్తాం. చివరి దశకు వచ్చే సరికి నాలుగు కోట్ల ప్రజలకు సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని సీఎం జగన్‌ తెలిపారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

అందుకే అల్లూరి జిల్లా..
ఉత్తరాంధ్ర పేరు చెప్పగానే.. మన్నెం వీరుడు అల్లూరి గుర్తుకొస్తారు. ఉత్తరాంధ్ర అంటే ఉత్తరాంధ్ర అంటే మన్యం వీరుడి పౌరుషం.  బ్రిటీషర్లను గడగడలాడించిన అల్లూరి జన్మించిన గడ్డ ఇది. అందుకే కొత్త జిల్లాకు అల్లూరి పేరు పెట్టుకున్నాం.  అభివృద్ధికి సులువుగా ఉండాలనే ఉన్న మూడు జిల్లాలను.. ఆరు జిల్లాలను చేశాం. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్లు ఏర్పాటు చేశాం. జూన్‌లోనే కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్లను జాతికి అంకితం చేస్తాం. ఇచ్చాపురం, పలాసలకు రక్షిత తాగు నీరు అందిస్తాం. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం అని సీఎం జగన్‌ తెలిపారు. ఈ సెప్టెంబర్‌ నుంచే విశాఖ నుంచి పాలన నడుస్తుందని మరోసారి భోగాపురం బహిరంగ సభ వేదికగా సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: డబుల్‌ డోస్‌తో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారిపోవాలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement