కాజోల్‌కు మమత మద్దతు | West Bengal CM Mamata Banerjee comes to Kajol's support | Sakshi

కాజోల్‌కు మమత మద్దతు

May 3 2017 9:08 PM | Updated on Sep 5 2017 10:19 AM

కాజోల్‌కు మమత మద్దతు

కాజోల్‌కు మమత మద్దతు

బీఫ్‌ తింటున్నానని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ పెట్టి ఇబ్బందులపాలైన ప్రముఖ బాలీవుడ్‌ నటి కాజోల్‌కు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ మద్దతుగా నిలిచారు

సౌత్‌ డినజ్‌పూర్‌ :
బీఫ్‌ తింటున్నానని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ పెట్టి ఇబ్బందులపాలైన ప్రముఖ బాలీవుడ్‌ నటి కాజోల్‌కు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ మద్దతుగా నిలిచారు. బుధవారం నాడిక్కడ ఆమె మాట్లాడుతూ‘ నేను ఆ నటి పేరు చెప్పను. కానీ ఆమె షారుక్‌ ఖాన్‌తో చాలా సినిమాల్లో నటించింది. ఇటీవల ఆమె బీఫ్‌ తింటున్న ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. దీంతో ఆన్‌లైన్‌లో ఆమెను తీవ్రంగా వేధించడమే కాకుండా అవమానించారు. చివరికి తాను తిన్నది గేదె మాంసమని వివరణ ఇచ్చేవరకూ పరిస్థితి వచ్చింది’ అని మమత తెలిపారు.

దేశంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్న మమత, కొందరు వ్యక్తులు ఇతరులు ఏం తినాలో నిర్దేశిస్తున్నారని విమర్శించారు. ఇటీవల కాజోల్‌ బీఫ్‌ తింటున్న వీడియోను పోస్ట్‌ చేయడంతో ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీంతో మత విశ్వాసాలను అగౌరవపరిచే ఉద్దేశ్యం తనకు లేదని కాజోల్‌ వివరణ ఇచ్చింది. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌, ట్వీట్టర్‌లలో బీఫ్‌ ఫోటోలను తొలగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement