మోడీకి మద్దతు ఇవ్వం: మాయావతి
వారణాసి: బీజేపీ కూటమికి తమ పార్టీ దూరమని బహుజన సమాజ్వాది పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోమని ఆమె తేల్చిచెప్పారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఊహించినంతగా ఫలితాలు రావన్న విషయం నరేంద్ర మోడీకి తెలిసిపోయిందన్నారు.
దీంతో జయలలిత, మమతా బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్, మాయావతి మద్దతు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మోడీ చెబుతున్నారని అన్నారు. జయ, ములాయం, మమత... మోడీకి మద్దతు ఇచ్చే అవకాశముందన్నారు. తాము మాత్రం బీజేపీకి లేదా మోడీకి మద్దతు ఇవ్వబోమని మాయావతి స్పష్టం చేశారు.