పోలీసుల అదుపులోకి ముఖ్యమంత్రి...విడుదల | Kejriwal detention unacceptable: Mamata | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులోకి ముఖ్యమంత్రి...విడుదల

Published Wed, Nov 2 2016 9:33 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

పోలీసుల అదుపులోకి ముఖ్యమంత్రి...విడుదల

పోలీసుల అదుపులోకి ముఖ్యమంత్రి...విడుదల

కోల్కతా: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఒక సీఎంను ఆయన సొంత రాష్ట్రంలోనే అరెస్టు చేసిన సందర్భం మునుపెన్నడూ జరగలేదని, ఇలాంటివి ఆహ్వానించదగిన పరిణామాలు కావని మమత పేర్కొన్నారు. (మాజీ జవాన్ ఆత్మహత్యపై ఢిల్లీలో హైడ్రామా)

వన్ ర్యాంక్ వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) విధానాన్ని అమలు చేయడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న రిటైర్డ్ జవాను రామ్ క్రిషన్ గ్రెవాలే కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారం ఢిల్లీలోని రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి వెళ్లిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సైతం పోలీసులు అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ఆర్కే పురం స్టేషన్ కు తరలించారు. 5 గంటలకు పైగా పోలీసుల నిర్భంధంలో ఉన్న సీఎం క్రేజీవాల్‌ను బుధవారం అర్థరాత్రి విడుదల చేశారు. మాజీ జవాన్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా పోలీసులు ఇదే రీతిగా అరెస్టు చేశారు. (రాహుల్ గాంధీని నిర్భంధించిన పోలీసులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement