OROP
-
‘నేను ఇందిరను కాదు.. ఆమెలానే సేవ చేస్తాను’
లక్నో : ప్రజలకు సేవ చేయడంలో తప్ప మిగతా ఏ విషయాల్లోనూ నన్ను నానమ్మతో పోల్చకండి అంటున్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. కార్యకర్తలు తనను తన నానమ్మ.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో పోల్చడంపై స్పందిస్తూ.. ఈ విధంగా వ్యాఖ్యనించారు ప్రియాంక. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మా నానమ్మతో నన్ను పోల్చడం తగదు. నేను ఏ విషయంలోనూ ఆమెతో పోటీ పడలేను. కానీ ఈ దేశ ప్రజలకు సేవ చేయాలనే కోరిక నానమ్మ మనసులో చాలా బలంగా ఉండేది. అదే లక్షణం నాకు, నా సోదరునికి కూడా అబ్బింది. దాన్ని మాత్రం మా నుంచి ఎవరు వేరు చేయలేరు. అందుకు మీరు అనుమతించినా.. ఇవ్వకపోయినా ఏదో ఒక రకంగా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం’ అని తెలిపారు. ఈ క్రమంలో ప్రియాంక బీజేపీ మీద విమర్శల వర్షం కురిపించారు. ఈ ఐదేళ్లలో వారు తమ అభివృద్ధి గురించి ఆలోచించారు తప్ప ప్రజలకు చేసిందేమి లేదని మండిపడ్డారు. బీజేపీ తీరు పట్ల దేశంలో అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానం వల్ల నిజంగా మేలు జరిగిందా అని ప్రశ్నించారు. కాన్పూర్ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. కానీ నేటికి ఇక్కడ నిరుద్యోగం, రైతులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎన్డీయే చేతల ప్రభుత్వం
డెహ్రాడూన్: మొక్కుబడిగా కాకుండా చేతల ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం సాయుధ బలగాల సంక్షేమానికి సంబంధించిన సమస్యల్ని పరిష్కరిస్తోందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. చాన్నాళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఒకే ర్యాంక్–ఒకే పెన్షన్(ఓఆర్ఓపీ), జాతీయ యుద్ధ స్డ్మారక నిర్మాణం లాంటివి మోదీ చొరవతో కొలిక్కి వచ్చాయని గుర్తుచేశారు. డెహ్రాడూన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో అమర జవాన్ల కుటుంబాలనుద్దేశించి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమైతే మోదీ ప్రభుత్వం చేతలను నమ్ముకుందని తెలిపారు. బడ్జెట్లో ఓఆర్ఓపీకి రూ.8 వేల కోట్లను కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ..మొక్కుబడి విధానాల స్థానంలో నిజంగా పనిచేస్తే ఫలితం ఇలాగే ఉంటుందని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రెండేళ్ల వ్యవధిలో నాలుగు దఫాల్లో ఓఆర్ఓపీ బకాయిలన్నింటిని చెల్లించామని వెల్లడించారు. జవాను అంగవైకల్యాన్ని సాయుధ బలగాల ట్రిబ్యునల్ ధ్రువీకరించిన తరువాత అప్పీల్ చేయకూడదని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు తెలిపారు. సైనిక సంక్షేమ పథకాలపై దుష్ప్రచారం చేస్తున్నవారంతా ఏమైనా సందేహాలుంటే నేరుగా తనను లేదా వారి ఎంపీలనే ప్రశ్నించొచ్చని సూచించారు. అమరులైన 15 మంది జవాన్ల భార్యలు, తల్లులను ఈ సందర్భంగా సన్మానించిన నిర్మలా సీతారామన్, ఓ తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. -
మోదీజీ.. అబద్ధాలు కట్టిపెట్టండి
-
మోదీజీ.. అబద్ధాలు కట్టిపెట్టండి
న్యూఢిల్లీ: ‘ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్’ (ఓఆర్ఓపీ) అంశంలో ప్రధాని మోదీ అబద్ధాలాడుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. మోదీ చెప్పినట్టు మాజీ సైనికోద్యోగులకు అందుతోంది ఓఆర్ఓపీ కాదని... సాధారణ పెన్షన్ మాత్రమేనన్నారు. ‘మోదీజీ... ఇకనైనా మీ అబద్ధాలు కట్టిబెట్టండి’ అని అన్నారు. 70 మంది మాజీ సైనికోద్యోగులు శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్‌తో గోడు వెళ్లబోసుకున్నారు. . ఈ సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఓఆర్ఓపీ మిలిటరీ సిబ్బంది హక్కని, ఈ డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని వెల్లడించారు. మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించివుంటే 509 రోజులుగా జంతర్‌మంతర్ వద్ద వారు ఆందోళన ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. 15 మంది బడా పారిశ్రామికవేత్తలకు సంబంధించి 1.1 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన కేంద్రం వద్ద... సైనికులు, రైతులకు ఇచ్చేందుకు మాత్రం ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. బ్యాంకర్లదే పాపం.. జైట్లీ: గ్రెవాల్ ఆత్మహత్యపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. ఓఆర్ఓపీ కింద ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసినా... బ్యాంక్ పాలక వ్యవస్థ లోపం వల్ల గ్రెవాల్ ఖాతాలో డబ్బు జమ కాలేదన్నారు. -
'జవాన్ల సమస్యలను రెండు నెలల్లో పరిష్కరిస్తాం'
బుద్గాం: కేవలం ఒక లక్ష మంది ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగులు మాత్రమే వన్ ర్యాంక్-వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) అమలులో సమస్యలు ఎదుర్కొంటున్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ గురువారం తెలిపారు. పథకం అమలులో సమస్యలను రెండు నెలల్లోగా పరిష్కరిస్తామని చెప్పారు. పట్టణంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మొత్తం 20 లక్షల మంది ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగుల్లో లక్ష మంది ఉద్యోగుల పత్రాల్లో సాంకేతికంగా తేడాలు ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. పరీకర్ తో పాటు భారత ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇరువురు 1947లో పాక్ రైడర్ల నుంచి శ్రీనగర్ ఎయిర్ పోర్టును రక్షించిన భారత మొదటి పరమ వీర చక్ర అవార్డు గ్రహీత మేజర్ సోమనాథ్ శర్మ, జవానులకు నివాళులు అర్పించారు. గత 43ఏళ్లుగా అమలుకు నోచుకోని ఓఆర్ఓపీ పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కలిగివుందని అన్నారు. ప్రస్తుతం 23 నుంచి 24 శాతం పెరిగిన పెన్షన్ ను జవానులు అందుకుంటున్నట్లు చెప్పారు. జవానుల బాధలు విన్న పరీకర్ వాటన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తాను విన్న సమస్యలకు తన తర్వాత పర్యటనలో పరిష్కారం అవుతాయని చెప్పారు. -
ఆ జవాను కాంగ్రెస్ సర్పంచ్‌గా గెలిచాడు!
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్‌వోపీ) అమలు విషయమై ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ మాజీ జవాను రాంకిషన్ గ్రెవాల్‌పై మరోసారి కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ విమర్శలు గుప్పించారు. రాంకిషన్ మానసిక పరిస్థితిపై బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేసిన వీకేసింగ్ తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని ఆరోపించారు. రాంకిషన్ కాంగ్రెస్ టికెట్‌పై సర్పంచ్‌గా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారని చెప్పారు. ఏదిఏమైనా ఆయన ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఆయనకు ఆత్మహత్య చేసుకోవడానికి సల్ఫాస్ ట్యాబ్లెట్లు ఎవరు ఇచ్చారనే దానిపై దర్యాప్తు జరపాల్సిన అవసరముందని పేర్కొన్నారు. బ్యాంకు డబ్బు విషయమై ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. రాం కిషన్ సాయం కోసం ప్రభుత్వాన్ని సంప్రదించి.. అది లభించకపోయి ఉంటే.. అప్పుడు తమ తప్పు అయ్యేదని, ఈ వ్యవహారంలో ప్రభుత్వం తప్పేమీ లేదని పేర్కొన్నారు. ఆర్మీ జవాన్లుకు మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చినమేరకు ఓఆర్‌వోపీ పథకాన్ని అమలుచేయకపోవడంతో మనస్తాపం చెందిన ఆర్మీ మాజీ సుబేదార్ రామ్ కిషన్ గ్రెవాల్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికీ లక్షమందికిపైగా రక్షణశాఖ సిబ్బందికి ఓఆర్‌వోపీ ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉందని తెలిపారు. కాగా, ఆత్మహత్య చేసుకున్న జవాను మానసిక పరిస్థితి ఏమిటో విచారించాలన్న వీకే సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేత రాజ్ బబ్బర్ మండిపడ్డారు. ముందు వీకే సింగ్ మానసిక పరిస్థితి ఏమిటో ఆరా తీయాలని, ఇలాంటి వ్యక్తి పేరు ముందు జనరల్ అని రాసుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. -
రాంకిషన్ విషయంలో వెనక్కి తగ్గని కేజ్రీవాల్
న్యూఢిల్లీ: 'ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్'(ఓఆర్ఓపీ) పథకం అమలుతీరుతో ఆవేదన చెందిన మాజీ జవాను రాంకిషన్ గ్రెవాల్(70) ఆత్మహత్య చేసుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. జవాన్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై నిన్న (బుధవారం) ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు తమ పార్టీల నేతలతో కలసి దేశ రాజధాని ఢిల్లీలో నిరసన చేపట్టగా వారికి చేదు అనుభవమే ఎదురైంది. పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయంపై ఢిల్లీ సీఎం చాలా పట్టుదలతో కనిపిస్తున్నారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ మాజీ జవాను రాంకిషన్ కుటుంబాన్ని కలిసి తిరుతానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. నేడు జవాను రాంకిషన్ సొంతగ్రామానికి వెళ్లనున్నట్లు కేజ్రీవాల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న జవాను రాంకిషన్ స్వగ్రామం హరియాణాలోని భివానీ జిల్లా బామ్లా గ్రామం. జవాను కుటుంబసభ్యులను కలిసి వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపి, వారికి అండగా ఉండనున్నట్లు తెలిపారు. అయితే ఢిల్లీలోని రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి నిన్న వెళ్లిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఓఆర్ఓపీ పథకం అమల్లో లోపాలను సరిచేయాలని రక్షణమంత్రిని కలిసి వివరించేందుకు మంగళవారం ముగ్గురు మాజీ సైనికులతో వచ్చిన రాంకిషన్ పురుగుల మందు ఆత్మహత్య చేసుకున్నారు. జవానుగా సేవలందించిన రాంకిషన్ రిటైరైన తర్వాత గ్రామంలో పారిశుధ్యంలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు 2008లో రాష్ట్రపతి చేతుల మీదుగా 'నిర్మల్ గ్రామ్ పురస్కార్' అందుకున్నారు. Will go to their village and meet Ram Kishan ji's family there today — Arvind Kejriwal (@ArvindKejriwal) 3 November 2016 -
‘పెన్షన్’ టెన్షన్!
ఒకే ర్యాంక్.. ఒకే పింఛన్‌పై ఆవేదనతో మాజీ జవాన్ ఆత్మహత్య ఢిల్లీలో పురుగుల మందు తాగి రాంకిషన్ బలవన్మరణం - రాంమనోహర్ లోహియా ఆసుపత్రి వద్ద హైడ్రామా - బాధిత కుటుంబాన్ని కలిసేందుకు పలుమార్లు ప్రయత్నించిన రాహుల్ - అడ్డుకున్న పోలీసులు..రెండుసార్లు అరెస్టు - ఓఆర్ఓపీని సరిగా అమలు చేయాలంటూ రాహుల్ డిమాండ్ - కేజ్రీవాల్ అరెస్టు.. మోదీ జవాన్లను మోసం చేస్తున్నారని విమర్శ - ఎస్బీఐ బ్రాంచ్ పొరపాటుతోనే రాంకిషన్‌కు తక్కువ పింఛన్: పరీకర్ దేశ రాజధాని హస్తినలో బుధవారం రోజంతా హైడ్రామా నడిచింది. ‘ఒకే ర్యాంకు, ఒకే పింఛన్’ రాజకీయ కాక పుట్టించింది. ఈ పథకం అమలులో తనకు అన్యాయం జరుగుతోందంటూ రాంకిషన్ అనే మాజీ జవాను బలవన్మరణానికి పాల్పడడంతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కేంద్రాన్ని టార్గెట్ చేశాయి. కాంగ్రెస్ నేతలు ఉదయమే రోడ్లపైకి వచ్చి ఆందోళన బాట పట్టారు. రాంకిషన్ మృతదేహాన్ని ఉంచిన రాంమనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లేందుకు యత్నించిన రాహుల్‌గాంధీ, కేజ్రీవాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. న్యూఢిల్లీ: ‘ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్’ (ఓఆర్ఓపీ) పథకం అమల్లో లోటుపాట్లపై ఆవేదనతో రాంకిషన్ గ్రెవాల్(70) అనే మాజీ జవాను ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీలోని సెంట్రల్ ఏరియాలోని జన్‌పథ్ ప్రభుత్వ భవనాల వెనుక భాగంలో పురుగుల మందు తాగి మంగళవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓఆర్ఓపీ అమలుపై జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఆందోళనలో రాంకిషన్ క్రియాశీలంగా పాల్గొన్నారు. పథకం అమల్లో లోపాలను సత్వరమే సరిచేయాలని రక్షణ మంత్రిని కలసి వివరించేందుకు ముగ్గురు మాజీ సైనికులతో వచ్చిన రాంకిషన్ ఆత్మహత్యకు పాల్పడటం దేశరాజధానిలో సంచలనం సృష్టించింది. బుధవారం ఉదయాన్నే కాంగ్రెస్ నేతలు రోడ్లెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఢిల్లీలో రాంకిషన్ మృతదేహం ఉన్న రాం మనోహర్ లోహియా ఆస్పత్రి బయట కాంగ్రెస్, ఆప్ కార్యకర్తల ఆందోళనతో హైడ్రామాకు తెరలేచింది. ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబాన్ని కలిసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాంకిషన్ కుమారుడితోసహా అతని బంధువులు 12 మందినీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆర్ఎంఎల్ ఆస్పత్రి వద్ద ఆందోళన రాంకిషన్ మృతదేహాన్ని లోహియా ఆస్పత్రికి తరలించారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రాహుల్ రావటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాహుల్‌ను ఆస్పత్రి లోపలకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.. భద్రతా కారణాల రీత్యా అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. రాహుల్ ససేమిరా అనటంతో.. అరెస్టు చేసి మందిర్‌మార్గ్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై ఆయన మండిపడుతూ.. ‘ఈ విధంగా ప్రజాస్వామ్య దేశాన్ని పాలిస్తామా? మృతుడి కుటుంబ సభ్యులనూ అరెస్టు చేస్తారా? ఇదేనా మోదీ ఇండియా?’ అని విమర్శించారు. ‘దేశంకోసం పోరాడిన జవాన్లు వారికి న్యాయంగా రావాల్సిన బకాయిల కోసం కూడా పోరాడే పరిస్థితి తీసుకురాకండి. ఓఆర్ఓపీని అర్థవంతంగా అమలుచేయండి’ అని కోరారు. జవాన్లపై గౌరవాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలన్నారు. 70 నిమిషాల తర్వాత విడుదలైన రాహుల్.. కాంగ్రెస్ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, అజయ్ మాకెన్‌లతో కలసి మళ్లీ ఆసుపత్రికి బయలుదేరారు. దీంతో పోలీసులు మళ్లీ అరెస్టుచేసి.. తుగ్లక్ రోడ్స్టేషన్కు అక్కడి నుంచి తిలక్మార్క్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆప్ నేతల అరెస్టు.. మృతుని బంధువులను పరామర్శించేందుకు బయలుదేరిన కేజ్రీవాల్‌నూ మధ్యలోనే పోలీసులు అరెస్టు చేశారు. ‘మోదీ దేశానికి అబద్ధం చెప్పారు. ఓఆర్ఓపీ సరిగా అమలయితే.. రాంకిషన్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు?’ అని కేజ్రీ ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను కూడా ఆర్ఎంఎల్ ఆస్పత్రి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. 5 గంటలకు పైగా పోలీసుల నిర్భంధంలో ఉన్న సీఎం క్రేజీవాల్‌ను బుధవారం అర్థరాత్రి విడుదల చేశారు. (చదవండి : పోలీసుల అదుపులోకి ముఖ్యమంత్రి...విడుదల) రాంకిషన్ మానసికస్థితి ఏంటో: వీకే సింగ్ ‘రాంకిషన్ ఆత్మహత్య కారణమేంటో తెలియదు. కానీ ఓఆర్ఓపీని తెరపైకి తెస్తున్నారు. ఆయన మానసిక పరిస్థితేంటో తెలుసుకోవాలి’ అని కేంద్ర మంత్రి, జనరల్ వీకే సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చితగ్గొట్టారు: రాంకిషన్ కుమారుడు పోలీసులు తనతోపాటు కుటుంబసభ్యులు 12 మందిని అరెస్టు చేసి చితగ్గొట్టారని ఆత్మహత్య చేసుకున్న రాంకిషన్ కుమారుడు జస్వంత్ తెలిపారు. ‘జైల్లో నన్ను, నా తమ్ముడిని చితగ్గొట్టారు. బూతులు తిట్టారు. మాకు న్యాయం చేయండి’ అని ఓ వీడియోలో వెల్లడించారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత.. మృతుడు రాంకిషన్.. జవానుగానే కాదు రిటైరయ్యాకా పోరాడాడు. 28 ఏళ్లు ఆర్మీలో సుబేదార్‌గా పనిచేసి 2004లో రిటైరయ్యాక సొంతగ్రామమైన హరియాణా భివానీ జిల్లా బామ్లాలో సర్పంచుగా ఎన్నికయ్యారు. గ్రామ పారిశుధ్యంలో గణనీయ ఫలితాలు సాధించినందుకు 2008లో అప్పటి రాష్ట్రపతి చేతుల మీదుగా ‘నిర్మల్ గ్రామ్ పురస్కార్’ అందుకున్నారు. జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఓఆర్ఓపీ ఆందోళనల్లోనూ క్రియాశీలంగా పాల్గొన్నారు. పథకం అమలు సమస్యలపై ఇటీవలే ప్రధానికి లేఖ రాసినట్లు తెలిసింది. వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికల్లో బరిలో దిగనున్న ఫౌజ్జనతా పార్టీకి రాంకిషన్ సలహాదారు. ఎస్బీఐ తప్పిదంతోనే: పరీకర్ ఆత్మహత్య చేసుకున్న మాజీ జవాను రాంకిషన్ ఈ పథకం కింద పింఛను పొందుతున్నారని రక్షణ మంత్రి పరీకర్ వెల్లడించారు. అయితే.. హరియాణాలోని భివానీ ఎస్బీఐ బ్రాంచ్ లెక్కల్లో పొరపాటు వల్ల ఆరో వేతన కమిషన్ ప్రకారం కాస్త తక్కువ మొత్తాన్ని అందుకుంటున్నట్లు తేలిందన్నారు. ఓఆర్ఓపీ ప్రకారం రూ.28 వేల పింఛను రావాల్సి ఉండగా, రాంకిషన్‌కు రూ.23 వేలే అందుతోందని తేలింది. విచారణ జరుపుతామన్న పరీకర్.. ఓఆర్ఓపీ అమల్లో కేంద్రానికున్న చిత్తశుద్ధి కారణంగానే.. రూ.5,507.47 కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కాగా, రాహుల్, ఆప్ నేతలపై పోలీసు చర్యలను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమర్థించారు. సమస్య మరింత తీవ్రం కాకుండా పోలీసులు తక్షణ చర్యలు తీసుకున్నారన్నారు. ఎడతెగని వివాదం ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్(ఓఆర్ఓపీ) పథకం అంటే.. ఒకే ర్యాంకులో పదవీవిరమణ చేసిన, ఒకే సర్వీసు కాలం గల సైనిక సిబ్బందికి.. వారు రిటైరైన తేదీతో నిమిత్తం లేకుండా సమాన పెన్షన్ ఇవ్వడం. ఈ డిమాండ్ ఎందుకు ముందుకు వచ్చిందంటే.. గతంలో రిటైరైన సైనికులకు, ఆ తర్వాత రిటైరైన సైనిక సిబ్బందికి.. వారి ర్యాంకులు(హోదాలు), సర్వీసు కాలం ఒకటే అయినాపెన్షన్లలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. గతంలో రిటైరైన వారికి.. కొత్తగా రిటైరైన వారికంటే తక్కువ పెన్షన్ లభిస్తుంది. అయితే.. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనూ ఇలానే ఉందని.. సైనికోద్యోగులకు మాత్రం ఈ డిమాండ్ ఎందుకన్న ప్రశ్న వస్తుంది. కానీ.. ఇందుకు చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనది తప్పనిసరి పదవీ విరమణ! సైన్యాన్ని ఎల్లవేళలా యువశక్తితో బలంగా ఉంచడానికి సైనిక సిబ్బందిని.. ముఖ్యంగా సాధారణ సిపాయిలకు 15 నుంచి 17 ఏళ్ల సర్వీసుతర్వాత తప్పనిసరి పదవీ విరమణ వర్తింపజేస్తారు. అంటే వారు 35-37 ఏళ్ల వయసుకే మాజీ ఉద్యోగులవుతారు. ఆ తర్వాతి ర్యాంకులకు కూడా నిర్ణీత వయో పరిమితి రాగానే తప్పనిసరి పదవీవిరమణ అమలవుతుంది. దీంతో కొద్దిమందికే పదోన్నతులు లభిస్తాయి. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల లాగా 58 లేదా 60 ఏళ్ల వరకూ పనిచేసి మెరుగైన ర్యాంకుతో పదవీ విరమణ చేసే అవకాశం అత్యధికులైన సైనికులకు లభించదు. మరో కీలక అంశం.. వేతన సంఘం సిఫారసుల అమలు. 1986లో రిటైరైన సైనిక సిబ్బందికి నాలుగో వేతన సంఘం నిర్ణయించిన వేతనంపై పెన్షన్ లభిస్తుంది. 2012 తర్వాత రిటైరైన సైనిక సిబ్బందికి ఆరో వేతన సంఘం నిర్ణయించిన వేతనం ఆధారంగా పెన్షన్ లభిస్తుంది. ఉదాహరణకు చూస్తే.. 2012కు ముందు రిటైరైన మేజర్ జనరల్ ర్యాంకు మాజీ సైనికోద్యోగి పెన్షన్ రూ. 26,700 ఉంటే.. 2012 తర్వాత రిటైరైన కల్నల్ ర్యాంకు అధికారి పెన్షన్ రూ. 35,841 గా ఉంటుందని సైనికుల చెబుతున్నారు. 1973కు ముందు అమలులో... 1973 ముందు వరకూ సైనిక సిబ్బందికి ఓఆర్ఓపీ అమలులో ఉండేది. ఆ ఏడాది అమలు చేసిన మూడో వేతన సంఘం సిఫారసుల్లో భాగంగా ఈ పద్ధతిని మార్చివేశారు. అమలు.. ఆందోళనలు! 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక మాజీ సైనికోద్యోగులు తమ ఆందోళనను తీవ్రం చేయడంతో 2015 సెప్టెంబర్ 6న ఓఆర్ఓపీని అమలు చేస్తున్నట్లుమోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం అమలు వల్ల ప్రభుత్వానికి రూ. 8,000 కోట్ల నుండి రూ. 10,000 కోట్ల వరకూ అదనపు వ్యయం అవుతుందని, ఇది భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని అంచనా. ఓఆర్ఓపీ అమల్లో భాగంగా తొలి వాయిదాలో రూ. 5,500 కోట్లు విడుదల చేసినట్లు మోదీ చెప్పారు. రెండో వాయిదా చెల్లించాల్సి ఉంది. కానీ.. తమ ఆందోళనలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ జవాన్లు అంటున్నారు. ఇవీ మాజీ జవాన్ల డిమాండ్లు... ► ఓఆర్ఓపీ పథకం 2013 ఆధార సంవత్సరంగా 2014 జూలై 1 నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అయితే.. 2014 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని, ఆధార సంవత్సరంగా 2015ను నిర్ణయించాలని మాజీ జవాన్లు డిమాండ్ చేస్తున్నారు. పథకాన్ని ఐదేళ్లకు ఒకసారి సమీక్షించాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, ఏటా సమీక్షించాలన్న ది జవాన్ల డిమాండ్. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న జవాన్లకు పథకం వర్తించదని ప్రభుత్వం తొలుత పేర్కొంది. అయితే సైనికుల్లో కనీసం 40 % మంది ముందుగా పదవీ విరమణ చేస్తారు. దీంతో సర్కారు ప్రతిపాదన సైనికులను ఆగ్రహానికి గురిచేసింది.ఈ పథకం అమలు కావడానికి ముందు రిటైరన వారికి మాత్రమే ఓఆర్ఓపీ వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పింది. ► ఈ నేపథ్యంలో ఓఆర్ఓపీలోని పలు కోణాలపై అధ్యయనం చేయడానికి పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏకసభ్య న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిటీ గత నెల 27వ తేదీన ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించింది. -
పోలీసుల అదుపులోకి ముఖ్యమంత్రి...విడుదల
కోల్‌కతా: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఒక సీఎంను ఆయన సొంత రాష్ట్రంలోనే అరెస్టు చేసిన సందర్భం మునుపెన్నడూ జరగలేదని, ఇలాంటివి ఆహ్వానించదగిన పరిణామాలు కావని మమత పేర్కొన్నారు. (మాజీ జవాన్ ఆత్మహత్యపై ఢిల్లీలో హైడ్రామా) వన్ ర్యాంక్ వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) విధానాన్ని అమలు చేయడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న రిటైర్డ్ జవాను రామ్ క్రిషన్ గ్రెవాలే కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారం ఢిల్లీలోని రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి వెళ్లిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సైతం పోలీసులు అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ఆర్కే పురం స్టేషన్ కు తరలించారు. 5 గంటలకు పైగా పోలీసుల నిర్భంధంలో ఉన్న సీఎం క్రేజీవాల్‌ను బుధవారం అర్థరాత్రి విడుదల చేశారు. మాజీ జవాన్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా పోలీసులు ఇదే రీతిగా అరెస్టు చేశారు. (రాహుల్ గాంధీని నిర్భంధించిన పోలీసులు) -
మాజీ జవాన్ ఆత్మహత్యపై ఢిల్లీలో హైడ్రామా
న్యూఢిల్లీ : మాజీ ఆర్మీ జవాన్ ఆత్మహత్యపై దేశ రాజధాని ఢిల్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను పోలీసులు నిర్భందంలోకి తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న జవాన్ కుటుంబసభ్యుల్ని పరామర్శించేందుకు ఈ రోజు సాయంత్రం రామ్ మనోహర్ లోహియ ఆస్పత్రికి వెళ్లిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఢిల్లీ టూరిజం శాఖ మంత్రి కపిల్ మిశ్రా ట్విట్ చేశారు. అలాగే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురు ఆప్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక జ్యోతిరాదిత్య సింధియా, అజయ్ మాకెన్ సహా పలువురు నేతలు కూడా అరెస్ట్ అయ్యారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేయలేదంటూ మనస్తాపంతో మాజీ ఆర్మీ ఉద్యోగి రామ్ కిషన్ గ్రేవాల్ మంగళవారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్‌ను పోలీసులు అడ్డుకుని అక్కడ నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపు అనంతరం రాహుల్‌ను విడుదల చేయగా, ఆయన మరోసారి బాధిత కుటుంబానికి కలవడంతో మళ్లీ అదుపులోకి తీసుకుని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులతో రాహుల్ తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి దిగారు. న్యాయం చేయాల్సింది పోయి, మృతుడి కుమారుడిని ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. తనను కూడా అరెస్ట్ చేయాలంటూ రాహుల్ సవాల్ విసిరారు. ఒక యోధుడి కుమారుడి పట్ల అలా ప్రవర్తించడం దారుణమన్నారు. ఇది సిగ్గుచేటు చర్య అని ఆయన అభివర్ణించారు. రెండోసారి అదుపులోకి తీసుకున్న రాహుల్ ను పోలీసులు తిలక్ మార్గ్ పీఎస్‌కు తరలించారు. అంతకు ముందు అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్(వోఆర్వోపీ) పథకాన్ని కేంద్రం అమలు చేస్తోందని ప్రధాని అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఆ పథకం సక్రమంగా అమలైతే ఈ ఆత్మహత్యలు జరిగి ఉండేవి కావన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ తన ట్విట్టర్ ద్వారా ప్రశ్నలు సంధించారు. బాధిత కుటుంబాన్ని తాము కలుస్తామని, అది తమ బాధ్యత అని ఆయన అన్నారు. -
ఢిల్లీలో ఆర్మీ జవాను ఆత్మహత్య
-
రాహుల్ గాంధీని నిర్భంధించిన పోలీసులు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వన్ ర్యాంకు వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) పథకం ఆచరణలోకి రావడం లేదనే మనస్తాపంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి రామ్ క్రిషన్ గ్రెవాలే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కోపోద్రేకుడైన రాహుల్.. ఇదే కొత్త భారత్ అని వ్యాఖ్యానించారు. ఘటనపై స్పందించిన ఢిల్లీ ఏసీబీ చీఫ్ ఎంకే మీనా.. ఆసుపత్రి కుటుంబాన్ని పరామర్శించే ప్రదేశం కాదని అన్నారు. ఆసుపత్రిలో పరామర్శ కుదరదని చెబుతున్నా రాహుల్ వినకపోవడంతోనే అడ్డుకోవాల్సివచ్చిందని వెల్లడించారు. ఆయన్ను ప్రస్తుతం మందిర్ మార్గ్ పోలీసు ఠాణాలో ఉంచినట్లు చెప్పారు. మాజీ జవాను కుటుంబాన్ని పలకరించేందుకు వచ్చిన ఆప్ నేతలు ఆసుపత్రి వాతావరణాన్ని గందరగోళంలోకి నెట్టే పరిస్ధితిని కల్పించేందుకు యత్నించినట్లు తెలిపారు. గ్రెవాల్ కుటుంబసభ్యులు రాజకీయ నేతలను కలిసేందుకు యత్నిస్తుండటంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యం అంటే అడ్డంకులు సృష్టించడం కాదని అన్నారు. ఆసుపత్రి మీటింగ్ ల ప్రదేశం కాదని నాయకులు అర్ధం చేసుకోవాలని కోరారు. ఏ రాజకీయ నేతను ఆసుపత్రిలోకి అనుమతించలేదని పేర్కొన్నారు. హర్యానా రాష్ట్రంలోని భీవానికి చెందిన గ్రెవాలే విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తోటి జవానుల కోసం ప్రాణాలను త్యాగం చేస్తున్నట్లు తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. వన్ ర్యాంకు వన్ పెన్షన్ డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమవ్వడంతోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని సుబేదార్ గ్రెవాల్ కుమారుడు రామ్ క్రిష్ణ గ్రెవాల్ తెలిపారు. దేశం కోసం ఎంతో కష్ట పడిన మాజీ సైనికోద్యోగులందరికీ వన్ ర్యాంకు-వన్ పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని జంతర్ మంతర్ వద్ద వారు గతేడాది నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. 80 రోజుల మాజీ సైనికోద్యోగుల ఆందోళనలకు దిగొచ్చిన ప్రభుత్వం, ఆ పథకాన్ని అమలుచేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, తమ నాలుగు ప్రాథమిక పరిస్థితులను చేరుకోవడంలో ప్రభుత్వం విఫలమైనట్టు మాజీ సైనికోద్యోగులు చెబుతున్నారు. ఈ విధానాన్ని అమలుచేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. -
'అందరినీ సంతృప్తి పరచలేం'
న్యూఢిల్లీ: ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ నోటిఫికేషన్ పై వెల్లడైన అభ్యంతరాలపై రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. అందరినీ సంతృప్తిపరచడం సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. పథకం అమల్లో తలెత్తే సమస్యల పరిష్కారానికి జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. 'ప్రధాన అంశాలన్నింటినీ నోటిఫికేషన్ లో చేర్చాం. ఇంకా ఏవైనా సమస్యలుంటే కమిషన్ పరిష్కరిస్తుంది. ప్రజాస్వామ్యంలో డిమాండ్ చేసే హక్కు అందరికీ ఉంది. ప్రధాన డిమాండ్లను నెరవేర్చాం. ప్రతి ఒక్కరినీ సంతృప్తిపరచడం సాధ్యం కాదు' అని పారికర్ అన్నారు. సైనికులు 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్న 'ఒక ర్యాంకు-ఒక పెన్షన్' పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 7న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఒకే ర్యాంకులో పనిచేసి గతంలో రిటైరైన ఉద్యోగులకు.. అదే ర్యాంకులో పనిచేసి 2013 తర్వాత రిటైరైన ఉద్యోగులతో సమానంగా పెన్షన్ అందనుంది. 2014 జూలై 1 నుంచి ఈ పథకం వర్తించనుంది. కాగా, నోటిఫికేషన్ సరిగా లేదని, తమ డిమాండ్లను సర్కారు పరిగణనలోకి తీసుకోలేదని నిరసన చేస్తున్న సైనికోద్యోగులు విమర్శించారు. ఐదేళ్లకోసారి దీన్ని సమీక్షించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని.. సర్కారు దీన్ని 'వన్ ర్యాంక్ ఫైవ్ పెన్షన్స్'గా మార్చేసిందన్నారు. -
ముందస్తు విరమణకూ వర్తింపు
ఓఆర్ఓపీపై ప్రధాని మోదీ స్పష్టీకరణ * ఎంతో కష్టమైనా.. హామీ మేరకు ఓఆర్ఓపీని అమలు చేస్తున్నాం * 40 ఏళ్లుగా ఏమీ చేయని వారు మమ్మల్ని ప్రశ్నిస్తారా? * కాంగ్రెస్‌పై ఫరీదాబాద్ సభలో ధ్వజం ఫరీదాబాద్/న్యూఢిల్లీ: సైనిక బలగాల నుంచి త్వరగా పదవీ విరమణ చేసిన జవాన్లకు కూడా ఒకే ర్యాంకు - ఒకే పెన్షన్ (ఓఆర్ఓపీ) వర్తిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టంచేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఓఆర్ఓపీ డిమాండ్‌ను అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. వీఆర్ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ) తీసుకున్న వారికి ఇది వర్తించబోదని రక్షణమంత్రి మనోహర్ పారికర్ పేర్కొనటంపై.. మాజీ సైనికోద్యోగులు తీవ్రంగా స్పందించారు. శనివారం రాత్రే రక్షణమంత్రిని కలిసిన మాజీ సైనికోద్యోగులు.. సైనిక బలగాల్లో వీఆర్ఎస్ అనేదే లేదన్న తమ వాదనతో మంత్రి ఏకీభవించారని, కాబట్టి నిర్ణీత గడువుకన్నా ముందుగా పదవీ విరమణ చేసిన వారికీ ఓఆర్ఓపీ వర్తిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో మోదీ ఆదివారం ఈ అంశంపై స్పందించారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో మెట్రో రైలును ఆవిష్కరించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘15-17 ఏళ్ల సర్వీసు అనంతరం ఉద్యోగం నుంచి వైదొలగిన వారికి ఓఆర్ఓపీ రాదని కొందరు భావిస్తున్నారు. నా జవాను సోదరులారా.. హవల్దార్ కానీ, సిపాయి కానీ, నాయక్ కానీ.. దేశానికి భద్రత కల్పించేది మీరు. ఎవరికైనా ఓఆర్ఓపీ వచ్చేట్లయితే.. ముందు మీరే ఉంటారు’ అని పేర్కొన్నారు. ‘యుద్ధం చేస్తూ శరీరంలో ఒక అవయవాన్ని కోల్పోయి సైన్యం నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిన వారికి ఓఆర్ఓపీ నిరాకరించటం జరుగుతుందా? సాయుధ బలగాలను ప్రేమించే ఒక ప్రధాని అలా ఎన్నడూ కనీసం ఆలోచన కూడా చేయలేడు. అటువంటి వారందరికీ ఓఆర్ఓపీ వస్తుంది. అందుకే.. రూ. 8 వేల కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లలో అత్యధిక మొత్తం 15-17 ఏళ్ల సర్వీసు తర్వాత వెళ్లిపోవాల్సి వచ్చిన అటువంటి జవాన్లకు వెళుతుంది’అని చెప్పారు. సాయుధ బలగాల్లో 80-90 శాతం మంది అటువంటి సైనికులే ఉంటారని పేర్కొన్నారు. ఏమీ చేయని వారు ప్రశ్నిస్తారా? తమ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు కాంగ్రెస్‌కు లేదని పరోక్షంగా విమర్శిస్తూ.. ఓఆర్ఓపీ 42 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని.. ఈ కాలంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా సైనిక బలగాలకు వట్టి మాటలతో సానుభూతి చూపటం మినహా చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. తాను గత ఏడాది మే 26వ తేదీన పదవి స్వీకరించానని, ఈ నిర్ణయాన్ని అమలు చేయటం చాలా కష్టంతో కూడుకున్నదని పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వం ఓఆర్ఓపీకి రూ. 500 కోట్లే కేటాయించింది. మేం అధికారంలోకి వచ్చినపుడు రూ. 600 కోట్లు లేదా రూ. 700 కోట్లు ఉంటుందనుకున్నాం. కానీ.. కూర్చుని లెక్కవేసినపుడు కొత్త విషయాలు ముందుకొచ్చాయి. ప్రభుత్వం, అధికారుల్లో అయోమయం నెలకొంది. గత కొన్ని రోజులుగా నేను లెక్కవేయటం మొదలుపెట్టాను. మొత్తం రూ. 8 వేల కోట్ల నుంచి రూ. 10 వేల కోట్ల వరకూ ఉండొచ్చని తెలుసుకున్నాను. ఈ అంశం చాలా కష్టమైనది. దీని ప్రభావం ఎలా ఉంటుందో మున్ముందు ఏఏ అంశాలు తలెత్తుతాయో తెలియదు. కానీ.. మేం ఒక హామీ ఇచ్చాం.. దానిని అమలు చేస్తున్నాం’ అనివివరించారు. ‘42 ఏళ్ల పాటు ఏమీ చేయని వారు.. వీఆర్ఎస్ పేరుతో మిమ్మల్ని (సైనికులను) తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్లు రాజకీయంగా పైచేయి సాధించాలని మాత్రమే అనుకుంటున్నారు’ అని కాంగ్రెస్‌ను విమర్శించారు. అలాగే.. ప్రతిపాదిత కమిషన్ గురించి ప్రస్తావిస్తూ.. అదేమీ వేతన సంఘం కాదని.. ఓఆర్ఓపీ అమలులో చిన్నచిన్న మార్పులు ఏమైనా అవసరమా అనేది పరిశీలించేందుకు మాత్రమేనని.. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాగా, ఓఆర్ఓపీ అమలులో ఎదురయ్యే చిన్న చిన్న అంశాలను క్రమంగా పరిష్కరిస్తూ వెళ్తామని రక్షణమంత్రి పారికర్ చెప్పారు. అవసరమైన ఆర్థిక అవసరాలన్నింటినీ పూర్తిగా తీరుస్తామని అన్నారు. అయితే..నూటికి నూరు శాతం అంతా తృప్తి చెందలేరని పారికర్ తెలిపారు. ఓఆర్ఓపీని పలచబార్చారు: ఆంటోని యూపీఏ తెచ్చిన ఓఆర్ఓపీ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం గణనీయంగా పలచబార్చటంతో పాటు.. దానిపై రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ నేత, మాజీ రక్షణమంత్రి ఎ.కె.ఆంటోని విమర్శించారు. ఓఆర్ఓపీని 2014 ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని యూపీఏ ప్రకటించిందని.. ఆ తేదీతో ప్రకటిస్తే ఆ ఘనత యూపీఏకు వెళుతుందన్న భయంతో జూలై నుంచి అమలు చేసేలా తేదీ మార్చారని ధ్వజమెత్తారు. ఓఆర్ఓపీకి ఎన్ని నిధులైనా ఇస్తామని చెప్పామన్నారు. మాజీ సైనికోద్యోగుల ఆమరణ దీక్ష విరమణ * నాలుగు డిమాండ్లపై ఆందోళన కొనసాగుతుందని వెల్లడి ఓఆర్ఓపీ కోసం గత 85 రోజులుగా ఆందోళన చేస్తున్న మాజీ సైనికోద్యోగులు ప్రధాని ప్రకటన నేపథ్యంలో నిరవధిక నిరాహారదీక్షను ఆదివారం విరమించారు. ప్రధాని ప్రకటనను స్వాగతిస్తున్నామని.. అయితే మరో నాలుగు అంశాలనూ ప్రభుత్వం అంగీకరించే వరకూ ఆందోళనను కొనసాగిస్తామని రిటైర్డ్ మేజర్ జనరల్ సత్బీర్సింగ్ పేర్కొన్నారు. ఐదేళ్లకోసారి పెన్షన్‌ను సమీక్షిస్తామనటం తమకు అంగీకారం కాదన్నారు. రెండేళ్లకోసారి సమీక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన జ్యుడీషియల్ కమిషన్‌లో ముగ్గురు మాజీ సైనికోద్యోగులు, ఒక ప్రస్తుత సైనికాధిపతితో పాటు రక్షణశాఖ నుంచి ఒక ప్రతినిధి.. మొత్తం ఐదుగురు సభ్యులు ఉండాలన్నారు. ఈ కమిషన్ తన నివేదికను ప్రభుత్వం ప్రకటించినట్లు ఆరు నెలల్లో కాకుండా నెల రోజుల వ్యవధిలోనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఓఆర్ఓపీ అమలుకు ప్రామాణిక సంవత్సరంగా 2013 క్యాలెండర్ సంవత్సరం కాకుండా.. 2014 మార్చి 31ని నిర్ణయించాలని పట్టుపట్టారు. ప్రభుత్వం క్యాలెండర్ సంవత్సరానికి కట్టుబడి ఉంటే.. డిసెంబర్ 31ని నిర్ణయించాలన్నారు. పెండింగ్ అంశాలను సత్వరం పరిష్కరించాలని ఈ నెల 12న ఢిల్లీలో భారీ స్థాయిలో ‘గౌరవ్ ర్యాలీ’ నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వం తమ అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్లయితే తిరిగి ఆమరణ నిరాహారదీక్ష చేపడతామని స్పష్టంచేశారు. గురుద్వారా నుంచి తెచ్చిన ప్రసాదంతో మాజీసైనికోద్యోగుల ఐక్యవేదిక సభ్యులు నిరశనదీక్ష విరమించారు. మెట్రో రైల్లో మోదీ * ఫరీదాబాద్ మెట్రో ప్రారంభం ఫరీదాబాద్: ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న బదర్పూర్-ఫరీదాబాద్ మెట్రో రైలు కారిడార్‌ను ప్రధాని మోదీ ఆదివారం ఫరీదాబాద్‌లో ప్రారంభించారు. ఈ మార్గం దేశ రాజధాని ఢిల్లీని హరియాణాలోని ఫరీదాబాద్‌తో కలుపుతుంది. మెట్రో ప్రారంభం కోసం ప్రధాని ఢిల్లీలోని జనపథ్ స్టేషన్ నుంచి మెట్రో వెలైట్ లైన్ రైల్లో ఫరీదాబాద్‌లోని బాటా స్టేషన్‌కు చేరుకున్నారు. షెడ్యూలు ప్రకారం హెలికాప్టర్లో వెళ్లాల్సిన ప్రధాని రైల్లో ప్రయాణించడంతో ప్రయాణికులు, అధికారులు ఆశ్చర్యపోయారు. మోదీ ప్రయాణికులతో ముచ్చటించారు. వారి కోరికపై సెల్ఫీ ఫొటోలు కూడా దిగారు. ప్రధాని వెంట కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, వీరేందర్ సింగ్, రావ్ ఇందర్జిత్ సింగ్, ఢిల్లీ మెట్రో చీఫ్ మంగు సింగ్ ప్రయాణించారు. మెట్రో ప్రారంభం తర్వాత నిర్వహించిన సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ కొత్త కారిడార్ వల్ల కీలక పారిశ్రామిక ప్రాంతమైన ఫరీదాబాద్‌లో ఢిల్లీ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగి, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అన్నారు. మెట్రో కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదని, ఆర్థిక ప్రగతికి కూడా అవకాశం కల్పిస్తుందని అన్నారు. 14 కిలోమీటర్ల బదర్పూర్-ఫరీదాబాద్ కారిడార్‌ను రూ. 2,500 కోట్లతో నిర్మించారని, దీన్ని బల్లభ్‌గఢ్‌కు పొడిగించేందుకు మరో రూ. 400 కోట్లు ఖర్చు పెట్టనున్నామని తెలిపారు. సభలో వెంకయ్య మాట్లాడుతూ ఈ కారిడార్ నిర్మాణంతో ఢిల్లీ మెట్రోలో 200 కి.మీ పూర్తయిందని తెలిపారు. 9 స్టేషన్ల గుండా వె ళ్లే ఈ మార్గం దాదాపు ఫరీదాబాద్‌లోని అన్ని ప్రాంతాల మీదుగా వెళ్తుంది. ఈ మార్గంలో రోజూ 2 లక్షల మంది ప్రయాణిస్తారని అధికారుల అంచనా. -
కల ఫలించింది.. దీక్ష విరమించారు!
ఢిల్లీ: గత కొంతకాలంగా ఒకే పింఛను-ఒకే హోదా(వన్ పెన్షన్-వన్ ర్యాంక్) కోరుతూ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ సైనికులు ఆదివారం తమ దీక్షను విరమించారు. గత కొద్ది రోజులుగా జంతర్ మంతర్ వద్ద మాజీ సైనికులు నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. 42 ఏళ్లుగా ఎదురుచూసిన వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదించింది. ఈ సందర్భంగా కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన మాజీ సైనికులు.. తమ డిమాండ్లు పూర్తిస్థాయిలో నెరవేరిన తర్వాతే దీక్ష విరమిస్తామని చెప్పారు. కానీ, అంతకుముందే దీక్ష విరమించారు. ఈ సందర్భంగా దీక్ష చేపట్టిన ముగ్గురు ప్రముఖులు జంతర్ మంతర్ వద్ద భోజన కార్యక్రమం పూర్తి చేశారు. రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వన్ ర్యాంక్ వన్ పెన్షన్ 2014 జూలై ఒకటో తేదీ నుంచి అమలయ్యేలా అమలుచేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. -
‘వన్ పెన్షన్’ వచ్చేసింది
►ఒక ర్యాంకు- ఒక పెన్షన్ అమలుకు కేంద్రం ఓకే ► ఐదేళ్లకోసారి పెన్షన్ మొత్తం సవరణ.. వీఆర్ఎస్ తీసుకున్నవారికి వర్తింపు లేనట్లే ► 2013 ఆధారంగా గరిష్ట, కనిష్ట పెన్షన్ మొత్తాల సగటు కనీస పెన్షన్‌గా నిర్ధారణ ► ఏటా రూ.10వేల కోట్ల వరకూ భారం.. 2014 జూలై నుంచే వర్తింపు.. రూ.12వేల కోట్ల వరకు బకాయిలు.. ఆర్నెల్లకోసారి నాలుగు వాయిదాల్లో బకాయిల చెల్లింపు ► పథకం అమలుపై ఏక సభ్య న్యాయ కమిటీ.. ఆర్నెల్లలోగా నివేదిక ► ప్రతిపాదనపై పెదవి విరిచిన మాజీ సైనికులు.. రెండేళ్లకోసారి పెన్షన్ సవరించాల్సిందే ►చాలా అంశాల్లో స్పష్టత అవసరం.. ఆందోళన కొనసాగిస్తాం న్యూఢిల్లీ: మాజీ సైనికులకు ‘ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్’(ఓఆర్ఓపీ) అంశంపై ఎట్టకేలకు ముందడుగు పడింది. దీనిని త్వరలోనే అమల్లోకి తీసుకువస్తామని.. 2014 జూలై నుంచే వర్తింపజేస్తామని కేంద్రం శనివారం ప్రకటించింది. కానీ మాజీ సైనికులు డిమాండ్ చేస్తున్నట్లుగా పెన్షన్‌ను రెండేళ్లకోసారి కాకుండా ఐదేళ్లకోసారి సవరిస్తామని పేర్కొంది. మరోవైపు కేంద్రం ప్రకటనపై మాజీ సైనికులు పెదవి విరిచారు. అందులోని పలు అంశాలు తమ డిమాండ్లకు విరుద్ధంగా ఉన్నాయని... ఈ అంశంపై తమ ఆందోళన కొనసాగుతుందని ప్రకటించారు. ఈ ఓఆర్ఓపీ అమల్లోకి వస్తే దాదాపు 26 లక్షల మంది రిటైర్డ్ సైనికులు, సిబ్బంది, వారి కుటుంబాలకు ప్రయోజనం కలుగనుంది. మాజీ సైనికులకు ఓఆర్ఓపీని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ శనివారం ప్రకటించారు. ‘భారీ ఆర్థిక భారం పడుతున్నా.. మాజీ సైనికుల ప్రయోజనం కోసం దీనిని అమల్లోకి తీసుకొస్తున్నాం. దీనికోసం మాజీ సైనికులు 40 ఏళ్లుగా పోరాడుతున్నా.. ఇప్పుడు మా ప్రభుత్వమే అమల్లోకి తెచ్చింది. జూలై 2014 నుంచే దీనిని అమలు చేస్తాం. పెన్షన్‌ను ఐదేళ్ల కోసారి సవరిస్తాం. ఇందుకు 2013 ఏడాదిని బేస్ ఇయర్‌గా తీసుకుంటాం. ఒకే సర్వీసు, ఒకే హోదా ఉన్నవారి గరిష్ట, కనిష్ట పెన్షన్ల సగటును కనీస పెన్షన్ మొత్తంగా నిర్ణయిస్తాం. అయితే దీనితో పోలిస్తే ఎక్కువ పెన్షన్ ఉన్నవారికి అది యథాతథంగానే కొనసాగుతుంది’ అని వివరించారు. ఇక స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మాజీ సైనికులకు ఇది వర్తించబోదన్నారు. ఈ ఓఆర్ఓపీ అమలుపై ఏక సభ్య న్యాయ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని... ఆ కమిటీ 6నెలల్లో తమ నివేదికను సమర్పిస్తుందని చెప్పారు. ఈ పథకాన్ని అమలు కేవలం పరిపాలనా పరమైన నిర్ణయం కాదని... దీని వల్ల రూ.8,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.10వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు ఉంటాయన్నారు. ఈ బకాయిలను ఆరు నెలలకోసారి చొప్పున నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామని.. అదే వితంతువులకు మాత్రం ఒకేసారి మొత్తం బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. కాగా రక్షణ దళాల అనుమతితో, చట్టబద్ధంగా వీఆర్ఎస్ తీసుకున్నవారికి ఓఆర్ఓపీ ప్రయోజనాలు అందుతాయని సమాచార, ప్రసారశాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ చెప్పారు. ఇక ఈ పెన్షన్ విధానం అమలు చాలా క్లిష్టమైన విషయమని, ఇందుకోసం వివిధ సమయాల్లో, వివిధ ర్యాంకుల్లో రిటైరైన సైనికులకు కలిగే ప్రయోజనాలను పరిశీలించాల్సి ఉంటుందని రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి. పూర్తి వివరాలతో కూడిన ఉత్తర్వులు వచ్చే నెలలో జారీ అయ్యే అవకాశముందని వెల్లడించాయి. వీఆర్ఎస్ తీసుకున్న వారికి పెన్షన్ వర్తింపుపై ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశముంది. ఎన్డీఏ నమ్మక ద్రోహం: కాంగ్రెస్ ఎన్డీఏ ప్రభుత్వం మాజీ సైనికులకు నమ్మకద్రోహం చేసిందని.. శనివారం ప్రకటించిన ఓఆర్ఓపీలోని చాలా అంశాలు వారి ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని కాంగ్రెస్ మండిపడింది. ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత, రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ విమర్శించారు. వీఆర్ఎస్ తీసుకున్న వారికి వర్తింపజేయబోమనడం దారుణమని.. అసలు సైనికుల్లో 90 శాతం మంది 35 నుంచి 40 ఏళ్ల మధ్యే రిటైర్ అవుతారని పేర్కొన్నారు. యూపీఏ హయాంలోనే ‘వన్ పెన్షన్’ను తాము అమల్లోకి తెచ్చామని, ఎన్డీఏ సర్కారే తొలిసారిగా తెచ్చినట్లుగా రక్షణ మంత్రి చెప్పుకొంటున్నారని విమర్శించారు. ఓఆర్ఓపీపై కేంద్రం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని బీజేపీ చీఫ్ అమిత్‌షా వ్యాఖ్యానించారు. ఆందోళన విరమించాలి: వెంకయ్యనాయుడు ఓఆర్ఓపీ అమలుకు కేంద్రం ముందుకొచ్చినందున మాజీ సైనికులు ఆందోళనను విరమించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. అసంతృప్తి ఉంటే చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఒప్పుకోం: మాజీ జవాన్లు ఓఆర్ఓపీ అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ఈ అంశంపై ఉద్యమిస్తున్న మాజీ సైనికుల నాయకుడు, రిటైర్డ్ మేజర్ జనరల్ సత్బీర్ సింగ్ పేర్కొన్నారు. కానీ దీని అమల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలు తమకు ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ‘ఐదేళ్లకోసారి పెన్షన్‌ను సమీక్షిస్తామన్న నిర్ణయం ఆమోదయోగ్యం కాదు. వీఆర్ఎస్ తీసుకున్న వారికి కూడా ఈ పథకం వర్తింపజేస్తామని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇస్తేనే నిరవధిక నిరాహారదీక్ష విరమిస్తాం. ఏకసభ్యకమిటీ ఏర్పాటుకు కూడా అంగీకరించేది లేదు. మొత్తం ఐదుగురు సభ్యులతో కమిటీ వేయాలి. ఇందులో ముగ్గురు మాజీ సైనికోద్యోగులు, ఒక ప్రస్తుత సైనికోద్యోగి, ఒక ప్రభుత్వ ప్రతినిధి కేంద్ర రక్షణ మంత్రి పరిధిలో ఉండాలి. ఈ కమిటీకి కాలపరిమితిని ఆరు నెలలు కాకుండా ఒక నెల మాత్రమే ఇవ్వాలి. పెన్షన్‌ను లెక్కించటానికి సగటున అత్యధిక పెన్షన్ వస్తున్న పెన్షనర్‌ను ప్రామాణికంగా తీసుకోవాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. వివాదానికి ఆజ్యం పోసిన ఇందిర ఓఆర్ఓపి వివాదానికి మూలం ఇప్పటిదేం కాదు.. 1973లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ సృష్టించిన వివాదం ముదిరి మోదీని చుట్టుకుంది. మూడో పే కమిషన్ నివేదికతో ఓఆర్ఓపీని రద్దు చేస్తూ ఇందిర తీసుకున్న నిర్ణయంతో ఓఆర్ఓపీకి ఆజ్యం పోసినట్లయింది. ఇందిర తర్వాతి ప్రభుత్వాలన్నీ ఈ అంశాన్ని పెండింగ్‌లో పెడుతూనే పోయాయి. ఒకే ర్యాంకు, ఒకే సర్వీసు కాలం ఉండి.. గతంలో రిటైర్ అయిన, ప్రస్తుతం రిటైర్ అవుతున్న.. భవిష్యత్తులో రిటైర్ కాబోతున్న వారికి ఒకేరకమైన పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నది సైనికోద్యోగుల డిమాండ్. దాదాపు 26 లక్షల మంది మాజీ సైనికోద్యోగులు ఉండటంతో వివాదం పరిష్కారానికి నోచుకోకుండా ఏళ్లూపూళ్లూ గడిచిపోయాయి. ఒక ఆర్మీ ఆఫీసర్ లేదా జవాను 1973లో రిటైర్ అయినా.. 2010లో రిటైర్ అయినా ఇద్దరికీ ఒకే పెన్షన్ రావాలన్నది ప్రధాన డిమాండ్. ఒక ఆర్మీ అధికారి 20 ఏళ్లు సర్వీసు పూర్తి చేసి రిటైర్ అయితే, చివరగా తీసుకున్న వేతనంలో 50శాతం పింఛన్ లభిస్తోంది. అయితే.. అంతకు ముందు ఇంతే సర్వీసు పూర్తి చేసి ఇదే ర్యాంకులో రిటైర్ అయిన అధికారికి మాత్రం చాలా తక్కువ వస్తోంది. ఈ రెంటినీ ఒకటి చేయాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం ఇంతకాలానికి అంగీకరించింది. సైనికోద్యోగుల్లో 98 శాతం మంది 54ఏళ్ల లోపు రిటైర్ అవుతున్నారు. వీరిలో 85శాతం మంది 35-37 ఏళ్ల మధ్య స్వచ్ఛంద పదవీవిరమణ చేస్తున్నారు. 40-54 ఏళ్ల మధ్య రిటైరవుతున్న వారి శాతం 13 శాతానికి మించి ఉండటం లేదు. పెన్షన్ విషయంలో వీరు మాత్రమే ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. వీఆర్ఎస్ తీసుకున్న వారికి ఓఆర్ఓపీ వర్తించదని ప్రభుత్వం తొలుత ప్రకటించటంతో సైనికోద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే చట్టసమ్మతంగా వీఆర్ఎస్ తీసుకున్నవారికి వర్తిస్తుందని కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ అన్నారు. -
'ప్రభుత్వ ప్రకటన సంతృప్తిగా లేదు.. నిరసన కొనసాగిస్తాం'
న్యూఢిల్లీ: వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల మాజీ సైనికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తామని మాజీ సైనికులు తెలిపారు. ఓఆర్ఓపీ డిమాండ్లపై కేవలం ఒక్కదాన్నే ప్రభుత్వం ఆమోదించిందని మాజీ సైనిక ఉద్యోగులు చెప్పారు. తాము చేసిన ఆరు డిమాండ్లను కేంద్రం తిరస్కరించిందని చెప్పారు. ఓఆర్ఓపీ విధానంపై కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ శనివారం మధ్యాహ్నం ప్రకటన చేశారు. కాగా ప్రభుత్వ ప్రకటనపై తాము పూర్తిగా సంతృప్తి చెందలేని, నిరసన కొనసాగిస్తామని మాజీ సైనికులు చెప్పారు. -
మాజీ జవాన్లపై పోలీసు జులుం
- ఢిల్లీలో ధర్నాచేస్తున్న వారిపై ఖాకీల బలప్రయోగం - ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ కోసం 62 రోజులుగా నిరసన - టెంట్లు తీసేసి, బలవంతంగా ఖాళీ చేయించిన పోలీసులు - ఖండించిన రాహుల్, మాజీ సైనికులకు సంఘీభావం - ‘ఓఆర్ఓపీ’అమలు తేదీ చెప్పాలని ప్రధానికి డిమాండ్ న్యూఢిల్లీ: రక్షణ శాఖలో ‘ఒకే ర్యాంకు ఒకే పెన్షన్(ఓఆర్ఓపీ)’ అమలు చేయాలన్న డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 62 రోజులుగా ధర్నా చేస్తున్న మాజీ సైనికులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దేశం కోసం ప్రాణాలను అడ్డుపెట్టినవారిని భద్రతకు ముప్పంటూ బలవంతంగా ఖాళీ చేయించా రు. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ విజ్ఞప్తి మేరకు స్వాతంత్య్ర దిన భద్రతా ఏర్పాట్లలో భాగంగా మాజీ సైనికులను జంతర్ మంతర్ వద్ద నుంచి ఢిల్లీ పోలీసులు శుక్రవారం బలవంతంగా తరలించారు. ధర్నా వేదిక వద్ద టెంట్లను తొలగించారు. భద్రత పేరుతో పోలీసులు ఇలా మాజీ సైనికులపై బలప్రయోగం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం తర్వాత వెనక్కి తగ్గింది. ఘటనపై విచారం తెలిపింది. జంతర్ మంతర్ వద్ద మాజీ సైనికులు ధర్నా కొనసాగించేందుకు అనుమతించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ఆదేశాలు జారీచేసినట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ సైనికులకు తెలిపారు. కేంద్రం అనుమతించినందున తొలగించిన టెంట్లను మళ్లీ ఏర్పాటు చేయాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీకి మాజీ సైనికులు విజ్ఞప్తిచేశారు. కాగా, ఓఆర్ఓపీ విధానాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మాజీ సైనికులపై పోలీసులు బలప్రయోగాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ధర్నా స్థలికి చేరుకుని మాజీ జవాన్లకు సంఘీభావం ప్రకటించారు. ప్రధాని సులభంగా హామీలిస్తారని, కానీ వాటిని నెరవేర్చడంలో విఫలమవుతుంటారన్నారు. ‘యువతకు ఉద్యోగాల హామీనిచ్చారు. మేక్ ఇన్ ఇండియా విఫలమైంది. స్వచ్ఛ భారత్ ఫలప్రదం కాలేదు. తన కార్పొరేట్ మిత్రులకు భూ బిల్లును తెస్తానని హామీనిచ్చినా, సాధ్యం కాలేదు. ఓఆర్ఓపీనీ నెరవేర్చలేదు’ అని విమర్శించారు. అయితే, రాహుల్‌కు మాజీ సైనికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లుగా రాహుల్ ఎందుకు మౌనంగా ఉన్నారని వారు ప్రశ్నించారు. జంతర్‌మంతర్ వద్దకు రావడం కంటే ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్లమెంట్లో ప్రస్తావిస్తే బాగుండేదన్నారు. దీన్నిప్పుడు రాజకీయం చేయొద్దన్నారు. ఢిల్లీ సీఎంకేజ్రీవాల్ కూడా మాజీ సైనికులకు సంఘీభావం ప్రకటించారు. ఓఆర్ఓపీ అమలు గురించి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని ప్రకటించాలని కోరారు. హామీని నెరవేరుస్తాం.. ఓఆర్ఓపీపై రక్షణ మంత్రి మనోహర్ పారికర్ డెహ్రాడూన్‌లో మాట్లాడుతూ.. ఈ విధానం అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని, అయినా హామీని నెరవేరుస్తామన్నారు. ప్రభుత్వ పదవీకాలంలోపు ఈ హామీని నెరవేరుస్తామన్నామని, వీలైనంత త్వరగా అమలు చేస్తామన్నారు. ఓఆర్ఓపీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అరుణ్ జైట్లీ కూడా తెలిపారు. ఈ విధానం అమలుకు కసరత్తు జరుగుతోందన్నారు. రక్షణశాఖలో ఒకే ర్యాంకు, ఒకే సర్వీస్‌తో రిటైర్ అయ్యే సిబ్బందికి ఓఆర్ఓపీ విధానం అమలుచేయాలని మాజీ సైనికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విధానం అమలైతే తక్షణం 22 లక్షల మంది మాజీ సైనికులు, 6 లక్షలకు పైగా అమరసైనికుల భార్యలు లబ్ధి పొందనున్నారు. అయితే, ఓఆర్ఓపీ త్వరలోనే అమలు కానుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ జైపూర్‌లో విలేకరులకు తెలిపారు. మేం దేశ భద్రతకు ముప్పా? దేశం కోసం ఒకప్పుడు ప్రాణాలను అడ్డుపెట్టిన తాము ఇప్పుడు దేశ భద్రతకు ముప్పుగా కనిపిస్తున్నామా? అంటూ పోలీసుల తీరుపై మాజీ సైనికులు మండిపడ్డారు. ‘మమ్మల్ని ఎలా అనుమానిస్తారు? దేశాన్ని రక్షించిన మేం ఇప్పుడు ముప్పుగా మారామా?’ అని ఒకరన్నారు. ‘భద్రతా కారణాల రీత్యా మమ్మల్ని ఖాళీ చేయిస్తున్నట్లు చెప్పారు. కానీ నన్ను తోసేశారు. చొక్కా చిరిగింది’ అంటూ 82 ఏళ్ల మాజీ సైనికుడు తప్పుట్టారు. పంద్రా గస్టుకు ఒక రోజు ముందు తమ స్వాతంత్య్రాన్ని హరించడం ఆటవికమన్నారు. -
'వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ ఉండాల్సిందే'
న్యూఢిల్లీ : మాజీ సైనికులకు వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ కోసం ఆందోళన చేస్తున్న మాజీ సైనికోద్యోగులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమ నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాలని కోరారు. దేశం కోసం పోరాడిన జవాన్లు పెన్షన్ల కోసం ఆందోళనకు దిగాల్సి రావడం దురదృష్టకరమని విమర్శించారు. వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలుచేయాలన్నారు. సాధ్యమైనంత త్వరగా పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని రాహుల్ డిమాండ్ చేశారు. అటు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే గతంలోనే వీరికి మద్దతు తెలిపారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పై మాజీ సైనికులకు ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందని ఆయన మండిపడ్డారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ను అమలుచేయకపోతే.. అక్టోబర్ 2న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
'త్వరలో శుభవార్త వింటారు'
లక్నో: వన్ ర్యాంకు వన్ పెన్షన్(ఓఆర్ఓపీ)పై త్వరలో శుభవార్త వింటారని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఓఆర్ఓపీ అమలు చేయాలని పదవీ విరమణ చేసిన సైనికోద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం గత నెలరోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. 'ఓఆర్ఓపీ అమలు అనేది రక్షణశాఖ అంతర్గత వ్యవహారం. దీనిపై కసరత్తు దాదాపు కొలిక్కివచ్చింది. దీనికి చాలా సమయం పడుతుంది. అయినప్పటికీ ఓఆర్ఓపీపై త్వరలోనే గుడ్ న్యాస్ వింటారు' అని పారికర్ వ్యాఖ్యానించారు. ఓఆర్ఓపీ అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఇంతకుముందు స్పష్టం చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ సైనిక ఉద్యోగులకు పీఆర్సీ సిఫారసు ఆధారంగా పెన్షన్లు ఇస్తున్నారు. -
ఆర్మీ మనసుతో ఆటలాడారు
‘ఒక ర్యాంకు ఒక పెన్షన్’ విషయంలో గత ప్రభుత్వాల తీరుపై ప్రధాని మోదీ ధ్వజం ♦ మేం తప్పకుండా ఈ విధానాన్ని అమలు చేస్తాం ♦ 40 ఏళ్లు ఓపిక పట్టారు.. నాకు కొంత సమయం ఇవ్వండి న్యూఢిల్లీ: సైనిక దళాల్లో ‘ఒక ర్యాంకు ఒక పెన్షన్’ విధానం విషయంలో గత ప్రభుత్వాలు అనుసరించిన తీరుపై ప్రధాని నరేంద్రమోదీ మండిపడ్డారు. ఈ విధానంపై నాన్చుడు ధోరణితో గత నలభై ఏళ్లుగా సైన్యం మనోభావాలతో ప్రభుత్వాలు ఆడుకున్నాయని విమర్శించారు. మరికొద్ది రోజుల్లో ‘ఒక ర్యాంకు ఒక పెన్షన్ ’(ఓఆర్ఓపీ) పై అడ్డంకులన్నీ తొలగిపోతాయని, దీనికి తగిన పరిష్కారం కనుగొనాల్సిందిగా అన్ని విభాగాలకు సూచించినట్లు తెలిపారు. తాజాగా నిర్వహించిన ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘మీరు గత 40 ఏళ్ల నుంచి ఓపిక పట్టారు. నాకు కొద్దిగా సమయం ఇవ్వండి. ఈ సంక్లిష్టమైన సమస్యకు పరిష్కారం చూపుతా’ అని మాజీ సైనిక ఉద్యోగులను ఉద్దేశించి అన్నారు. ఈ విధానం అమలులో ఏళ్లుగా జరుగుతున్న జాప్యంపై మాజీ సైనిక ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తుండడం తెలిసిందే. ‘నేను ఒక్కటే చెబుతున్నా. ప్రధానిగా కాదు.. ఒక మానవత్వం ఉన్న మనిషిగా చెబుతున్నా. మేం అధికారంలోకి రాగానే సైన్యంలో ఒక ర్యాంకు ఒక పెన్షన్ విధానాన్ని అమలు చేస్తానని ఎన్నికల సమయంలో మాటా ఇచ్చా. ఆ బాధ్యత నుంచి ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి వెళ్లను. ఈ విధానం అమలు నేను ఇంతకుముందు అనుకున్నంత తేలికేమీ కాదు. సంక్లిష్టతరమే. అయినా కచ్చితంగా అమలు చేస్తాం. ఇప్పటికే వివిధ విభాగాలు దీనిపై పనిచేస్తున్నాయి. నాపై విశ్వాసం ఉంచండి. మీకు(సైనిక దళాలు) సాయం చేయడం నా రాజకీయ ఎజెండానో, లేదా ప్రభుత్వ కార్యక్రమమో కాదు. జాతికి చేసే సేవగా భావిస్తా’ అని స్పష్టంచేశారు. ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూసినవారు సైన్యంతో గత 40 ఏళ్లుగా ఆటలాడుకున్నారని, తాను మాత్రం అలా చేయనని చెప్పారు. మరోవైపు తమకు హామీలు అక్కర్లేదని, ఈ విధానం అమలుకు కచ్చితమైన తేదీ చెప్పాలని మాజీ సైనిక సిబ్బంది కోరుతున్నారు. విధానం అమలులో జాప్యాన్ని నిరసిస్తూ జూన్ 14న నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఏడాది పాలనకు డిస్టింక్షన్ తన ఏడాది పాలనకు డిస్టింక్షన్ వచ్చిందని మోదీ అన్నారు. మన్‌కీ బాత్‌లో సుమారు 25 నిమిషాలపాటు ప్రసంగించిన మోదీ.. ఏడాది పాలనపైనా కాసేపు మాట్లాడారు. ‘‘ఏడాది పాలనపై విశ్లేషణలు జరిగాయి. కొందరు విమర్శలు చేశారు. కానీ చాలామంది మాకు డిస్టింక్షనే ఇచ్చారు. పాలనపై ఇలాంటి చర్చలు జరగడం ప్రజాస్వామ్యానికి మంచిదే. కొందరు ఒక అంశాన్ని సమర్థిస్తారు. మరికొందరు విభేదిస్తారు. లోపం ఎక్కడుందో తెలుసుకునేందుకు ఇలాంటి చర్చలు దోహదపడతాయి’’ అని మోదీ అన్నారు. పేదల కోసం ఇటీవల మూడు సామాజిక పథకాలకు శ్రీకారం చుట్టానని, వీటికి ప్రజల నుంచి విశేషమైన స్పందన వ స్తోందన్నారు. పథకాలు ప్రారంభించిన 20 రోజులకే అందులో 8.52 కోట్ల మంది చేరారని వివరించారు. అట్టడుగు వర్గాలకు అండగా నిలబడి, వారినే ఒక సైన్యంలా మలిచి దేశం నుంచి పేదరికం, ఆకలిని తరిమివేస్తామని చెప్పారు. కొద్దిరోజుల క్రితం ప్రారంభించిన డీడీ కిసాన్ టీవీ రైతులు, జారల్లకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భారత్‌లో పాల దిగుబడి మరింత పెరగాలని, ఇందుకు ఆధునిక శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలి అని పేర్కొన్నారు. హామీని విస్మరిస్తున్నారు: కాంగ్రెస్ ఒక ర్యాంకు ఒక పెన్షన్ విధానం హామీ నుంచి మోదీ వెనక్కి వెళ్తున్నారని, ఇది ‘సంక్లిష్ట’ సమస్య అని చెబుతూ గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి అజయ్ మాకెన్ పేర్కొన్నారు. ఒక ర్యాంకు ఒక పెన్షన్ అంటే? సైనిక దళాల్లో ఒకే ర్యాంకులో, సమాన సర్వీసు కాలంపాటు పనిచేసిన సిబ్బందికి ఎప్పుడు రిటైర్ అయ్యారన్న దానితో సంబంధం లేకుండా ఒకే పెన్షన్ ఇవ్వాలన్నది దీని ఉద్దేశం. ప్రస్తుతం ఎప్పుడు రిటైర్ అవుతున్నారన్న దానిపై ఆధారపడి మాజీ ఉద్యోగులకు పెన్షన్ అందిస్తున్నారు. వన్ ర్యాంకు వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) విధానం అమలైతే.. ఉదాహరణకు 1995లో రిటైరయిన సిపాయి, 1996లో రిటైరయిన సిపాయి ఒకే పెన్షన్‌ను పొందుతారు. ఓఆర్‌ఓపీతో 2006కు ముందు రిటైరయిన సైనిక సిబ్బందికి ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం 2006కు ముందు రిటైరయినవారు.. ఆ తర్వాత రిటైర్(ఒకే ర్యాంకు) అయినవారికంటే తక్కువ పెన్షన్ పొందుతున్నారు. వీరికి పదేళ్లకోసారి వేతన సంఘం సిఫారసులకు పెంచుతున్న పెన్షన్ మొత్తమూ తక్కువగా వస్తోంది. ఓఆర్ఓపీ అమలైతే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ మాజీ ఉద్యోగులకు ఈ సమస్య తీరుతుంది. ఈ పథకానికి గత యూపీఏ ప్రభుత్వం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది. ఎన్డీఏ తన బడ్జెట్లో ఈ పథకానికి రూ.1,000 కోట్లు కేటాయించింది.