మోదీజీ.. అబద్ధాలు కట్టిపెట్టండి | Narendra Modi ji you should stop lying and implement OROP: Rahul Gandhi | Sakshi

మోదీజీ.. అబద్ధాలు కట్టిపెట్టండి

Published Sat, Nov 5 2016 12:37 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

మోదీజీ.. అబద్ధాలు కట్టిపెట్టండి - Sakshi

మోదీజీ.. అబద్ధాలు కట్టిపెట్టండి

‘ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్’ (ఓఆర్‌ఓపీ) అంశంలో ప్రధాని మోదీ అబద్ధాలాడుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు.

 న్యూఢిల్లీ: ‘ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్’ (ఓఆర్‌ఓపీ) అంశంలో ప్రధాని మోదీ అబద్ధాలాడుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. మోదీ చెప్పినట్టు మాజీ సైనికోద్యోగులకు అందుతోంది ఓఆర్‌ఓపీ కాదని... సాధారణ పెన్షన్ మాత్రమేనన్నారు. ‘మోదీజీ... ఇకనైనా మీ అబద్ధాలు కట్టిబెట్టండి’ అని అన్నారు. 70 మంది మాజీ సైనికోద్యోగులు శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్‌తో గోడు వెళ్లబోసుకున్నారు. . ఈ సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఓఆర్‌ఓపీ మిలిటరీ సిబ్బంది హక్కని, ఈ డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని వెల్లడించారు.
 
  మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించివుంటే 509 రోజులుగా జంతర్‌మంతర్ వద్ద వారు ఆందోళన ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. 15 మంది బడా పారిశ్రామికవేత్తలకు సంబంధించి 1.1 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన కేంద్రం వద్ద... సైనికులు, రైతులకు ఇచ్చేందుకు మాత్రం ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు.  బ్యాంకర్లదే పాపం.. జైట్లీ:  గ్రెవాల్ ఆత్మహత్యపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. ఓఆర్‌ఓపీ కింద ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసినా... బ్యాంక్ పాలక వ్యవస్థ లోపం వల్ల గ్రెవాల్ ఖాతాలో డబ్బు జమ కాలేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement