
కోల్‌కత్తా: ప్రధాని నరేంద్ర మోదీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘బెంగాల్‌లో గెలవాలని కలలుకనే బదులు ముందు మీ సొంత లోక్‌సభ స్థానమైన వారణాసిలో గెలవండి. బెంగాల్‌లో మీకు స్థానంలేదు. మరికొన్ని నెలల్లో మీ పాలన ముగుస్తుంది’’ అంటూ మోదీపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. శనివారం బెంగాల్‌ని దుర్గాపూర్ ర్యాలీలో పాల్గొన్న మోదీ.. మమతపై విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. మోదీ వ్యాఖ్యలపై స్పందించిన దీదీ.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధికారం కల్ల అని జోస్యం చెప్పారు.
బెంగాల్‌లో బీజేపీకి నేతలెవ్వరూ లేరని, అందుకే పక్క రాష్ట్రం నేతలను తీసుకువస్తున్నారని మమత పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం గురించి మీ దగ్గర నేర్చుకోవల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. బెంగాల్ సంస్కృతిపై, ప్రజలపై బీజేపీకి సరైన అవగహన లేదన్నారు. అలాగే కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా తన సొంత స్థానంలో గెలిచేందుకు ప్రయత్నించాలని హితవుపలికారు.