చెల్లింపు లావాదేవీలకు ఓలా మనీ యాప్ | Ola launches dedicated app for Ola Money | Sakshi
Sakshi News home page

చెల్లింపు లావాదేవీలకు ఓలా మనీ యాప్

Published Sat, Nov 14 2015 2:37 AM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM

చెల్లింపు లావాదేవీలకు ఓలా మనీ యాప్ - Sakshi

చెల్లింపు లావాదేవీలకు ఓలా మనీ యాప్

న్యూఢిల్లీ: పేటీఎం, మొబిక్విక్, ఫ్రీచార్జ్ తదితర డిజిటల్ పేమెంట్ సంస్థలతో పోటీపడేందుకు ..  ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఓలా తమ మొబైల్ వాలెట్ ‘ఓలా మనీ’ని స్వతంత్ర యాప్‌గా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటిదాకా ఓలా యాప్‌లో భాగంగా ఉన్న ఓలా మనీ.. ట్యాక్సీ, ఆటో చార్జీల చెల్లింపులకు మాత్రమే ఉపయోగపడేది. ఇకపై దీనితో మొబైల్ రీచార్జీలు, నగదు బదిలీలు కూడా చేయొచ్చని ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు. త్వరలోనే విద్యుత్, నీటి బిల్లులు మొదలైన వాటి చెల్లింపులకు కూడా ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దనున్నట్లు ఆయన వివరించారు. ఓలా మనీకి ప్రస్తుతం 4 కోట్ల మంది యూజర్లు ఉన్నారని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement