టైటిల్: టాక్సీ
నటీనటులు: వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మీనన్, ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత తదితరులు
దర్శకుడు: హరీశ్ సజ్జా
సంగీతం : మార్క్ కె రాబిన్
సినిమాటోగ్రఫీ : ఉరుకుండారెడ్డి
విఎఫ్ఎక్స్ : ఆనంద్ పల్లకి
ఎడిటర్: టి.సి.ప్రసన్న
బ్యానర్: హెచ్ అండ్ హెచ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: హరిత సజ్జా
విడుదల తేదీ: మార్చి 10, 2023
కథ
సైంటిస్ట్ ఈశ్వర్ (వసంత్ సమీర్ పిన్నమ రాజు) కాలిఫోర్నియం 252 పై ప్రయోగాలు చేసి సక్సెస్ అవుతాడు. దాన్ని దేశం కోసం ఉపయోగించాలనుకుంటాడు. కాలిఫోర్నియం 252తో భూమి లోతుల్లో ఉన్న బంగారం నిల్వలు కనిపెట్టవచ్చు అని, అప్పుడు మన దేశం నెంబర్ వన్ అవుతుందంటూ గనుల శాఖా మంత్రి ముందు ప్రపోజల్ పెడతాడు. మరిన్ని ప్రయోగాల కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వమని అడుగుతాడు. అయితే కాలిఫోర్నియం 252 ఒక్కో గ్రాము ధర రూ.180 కోట్లు. అంతటి విలువైన సంపదను ఎవరు వదులుకుంటారు? పొలిటీషియన్స్, వారిని అంటిపెట్టుకునే మాఫియా రంగంలోకి దూకుతుంది. ఈశ్వర్ లాంటి నిజాయితీ పరుడిని వంచటం కష్టం. అందుకే అతని కుటుంబంపై కుట్ర పన్నుతారు. అక్కడ నుంచి ఈశ్వర్ పై నేరారోపణలు, అతని భార్య (అల్మాస్ మోటివాలా) మిస్సింగ్ లు జరిగిపోతూ ఉంటాయి. వాటి నుంచి ఈశ్వర్ తప్పించుకోవటానికి తన వంతు ప్రయత్నం మొదలెడతాడు.
మరో ప్రక్క ఎథికల్ హ్యాకర్ ఉజ్వల్ (సూర్య శ్రీనివాస్) కు కెరీర్ పరంగా ఎదగటానికి మంచి కాంట్రాక్ట్ వస్తుంది. దాంతో స్నేహితులు, సన్నిహితులు నుంచి అప్పులు చేసి మరీ తన సంస్దను డవలప్ చేస్తూ పై మెట్టు ఎక్కాలనుకుంటాడు. కానీ అనుకోని విధంగా తనకు వచ్చిన కాంట్రాక్ట్ సమస్యల్లో పడటం, ప్రాజెక్టు ఆగిపోవటంతో చివరకు అప్పులపాలవుతాడు. ఇలా వేర్వేరు సమస్యలతో ఉన్న ఈశ్వర్, ఉజ్వల్ అనుకోని పరిస్దితుల్లో ఓ క్యాబ్ ఎక్కుతారు. ఆ క్యాబ్ పై కొందరు ఎటాక్ చేస్తారు. వాళ్లనుంచి తప్పించుకున్న వీళ్లిద్దరు తమపై ఎటాక్ కు ప్లాన్ చేసింది విద్యుత్ (నవీన్ పండిత) అని తెలుసుకుంటారు. అతనెవరు? వీళ్లిద్దరనీ ఎందుకు టార్గెట్ చేస్తాడు? ఎటాక్ జరిగిన తర్వాత నుంచి వాళ్ల జీవితాలు ఎలా టర్న్ తీసుకున్నాయి? మిస్సైపోయిన ఈశ్వర్ భార్య తిరిగి కనపడిందా? అతనిపై పడిన పోలీస్ కేసులు, నేరారోపణలు చివరకు ఏమయ్యాయి? ఈ కథలో టాక్సీ డ్రైవర్ (సద్దాం హుస్సేన్) పాత్ర ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
సాధారణంగా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్లు అనుమానాస్పద మృతి లేదా యాక్సిడెండ్స్‌తో మొదలవుతాయి. ట్యాక్సీ కథని కూడా ఒక మిస్టరీతో మొదలుపెట్టాడు దర్శకుడు. హీరో మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎటాక్ చేయడం.. ఆ తర్వాత ఓ ఎథికల్ హ్యాకర్ వచ్చి ఈ కథలో జాయిన్ అవడంతో ఈ రెండింటికి మధ్య లింక్ ఉందని ప్రేక్షకుడికి అర్ధమవుతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా టైట్ స్క్రీన్ ప్లేతో నడుస్తుంది. అయితే సెకండ్ హాఫ్‌లో కొంత పట్టు వదిలినట్లనిపించింది. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ తరహాలో ఉండి ఉంటే బాగుండేది. సినిమా క్లైమాక్స్ బాగుంది.
సినిమాలోని హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు కథలో భాగంగా వచ్చి వెళ్తాయి. 'లవ్ స్టొరీ' చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసిన బి జె శ్రీధర్ ఈ చిత్రానికి కూడా ఫైట్స్ కంపోజ్ చేశాడు. ఫైట్ సీక్వెన్స్‌లు సరిగ్గా సరిపోయాయి. కానీ అన్ని వర్గాల వారిని అలరించాలనుకునే క్రమంతో కావాలని మరీ బలవంతంగా కథలో ఇరికించిన లవ్ సన్నివేశాలే విసిగిస్తాయి. ఫస్ట్ హాఫ్ వరకు హీరోని సమస్యలో పడేయటం... సెకండ్ హాఫ్ లో ఆ సమస్య నుంచి బయిటపడటానికి అతను ఏం ప్రయత్నం చేశాడు.. ఎలా తన సమస్యలను అధిగమనించాడు? అన్న ధోరణిలో స్క్రీన్ ప్లే రాసుకున్నాడు డైరెక్టర్. అయితే ఇలాంటి కథకు అవసరమైన భారీతనం లోపించినట్లు అనిపిస్తుంది.
నటీనటుల పనితీరు
హీరోగా చేసిన వసంత్ సమీర్ పిన్నమ రాజు పెర్ఫార్మన్స్ బాగుంది. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ మెప్పిస్తుంది. అతని భార్య పాత్రలో అల్మాస్ మోటివాలా చక్కగా నటించింది. సౌమ్య మీనన్ కీలకమైన పాత్రలో మెరిసింది. ఇక ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్ పర్వాలేదనిపించారు. మార్క్ k రాబిన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా సూటైంది. ఎడిటింగ్ ఓకే. సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment