Saddam Hussain
-
సస్పెన్స్ థ్రిల్లర్ 'టాక్సీ' రివ్యూ
టైటిల్: టాక్సీ నటీనటులు: వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మీనన్, ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత తదితరులు దర్శకుడు: హరీశ్ సజ్జా సంగీతం : మార్క్ కె రాబిన్ సినిమాటోగ్రఫీ : ఉరుకుండారెడ్డి విఎఫ్ఎక్స్ : ఆనంద్ పల్లకి ఎడిటర్: టి.సి.ప్రసన్న బ్యానర్: హెచ్ అండ్ హెచ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: హరిత సజ్జా విడుదల తేదీ: మార్చి 10, 2023 కథ సైంటిస్ట్ ఈశ్వర్ (వసంత్ సమీర్ పిన్నమ రాజు) కాలిఫోర్నియం 252 పై ప్రయోగాలు చేసి సక్సెస్ అవుతాడు. దాన్ని దేశం కోసం ఉపయోగించాలనుకుంటాడు. కాలిఫోర్నియం 252తో భూమి లోతుల్లో ఉన్న బంగారం నిల్వలు కనిపెట్టవచ్చు అని, అప్పుడు మన దేశం నెంబర్ వన్ అవుతుందంటూ గనుల శాఖా మంత్రి ముందు ప్రపోజల్ పెడతాడు. మరిన్ని ప్రయోగాల కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వమని అడుగుతాడు. అయితే కాలిఫోర్నియం 252 ఒక్కో గ్రాము ధర రూ.180 కోట్లు. అంతటి విలువైన సంపదను ఎవరు వదులుకుంటారు? పొలిటీషియన్స్, వారిని అంటిపెట్టుకునే మాఫియా రంగంలోకి దూకుతుంది. ఈశ్వర్ లాంటి నిజాయితీ పరుడిని వంచటం కష్టం. అందుకే అతని కుటుంబంపై కుట్ర పన్నుతారు. అక్కడ నుంచి ఈశ్వర్ పై నేరారోపణలు, అతని భార్య (అల్మాస్ మోటివాలా) మిస్సింగ్ లు జరిగిపోతూ ఉంటాయి. వాటి నుంచి ఈశ్వర్ తప్పించుకోవటానికి తన వంతు ప్రయత్నం మొదలెడతాడు. మరో ప్రక్క ఎథికల్ హ్యాకర్ ఉజ్వల్ (సూర్య శ్రీనివాస్) కు కెరీర్ పరంగా ఎదగటానికి మంచి కాంట్రాక్ట్ వస్తుంది. దాంతో స్నేహితులు, సన్నిహితులు నుంచి అప్పులు చేసి మరీ తన సంస్దను డవలప్ చేస్తూ పై మెట్టు ఎక్కాలనుకుంటాడు. కానీ అనుకోని విధంగా తనకు వచ్చిన కాంట్రాక్ట్ సమస్యల్లో పడటం, ప్రాజెక్టు ఆగిపోవటంతో చివరకు అప్పులపాలవుతాడు. ఇలా వేర్వేరు సమస్యలతో ఉన్న ఈశ్వర్, ఉజ్వల్ అనుకోని పరిస్దితుల్లో ఓ క్యాబ్ ఎక్కుతారు. ఆ క్యాబ్ పై కొందరు ఎటాక్ చేస్తారు. వాళ్లనుంచి తప్పించుకున్న వీళ్లిద్దరు తమపై ఎటాక్ కు ప్లాన్ చేసింది విద్యుత్ (నవీన్ పండిత) అని తెలుసుకుంటారు. అతనెవరు? వీళ్లిద్దరనీ ఎందుకు టార్గెట్ చేస్తాడు? ఎటాక్ జరిగిన తర్వాత నుంచి వాళ్ల జీవితాలు ఎలా టర్న్ తీసుకున్నాయి? మిస్సైపోయిన ఈశ్వర్ భార్య తిరిగి కనపడిందా? అతనిపై పడిన పోలీస్ కేసులు, నేరారోపణలు చివరకు ఏమయ్యాయి? ఈ కథలో టాక్సీ డ్రైవర్ (సద్దాం హుస్సేన్) పాత్ర ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ సాధారణంగా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్లు అనుమానాస్పద మృతి లేదా యాక్సిడెండ్స్తో మొదలవుతాయి. ట్యాక్సీ కథని కూడా ఒక మిస్టరీతో మొదలుపెట్టాడు దర్శకుడు. హీరో మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎటాక్ చేయడం.. ఆ తర్వాత ఓ ఎథికల్ హ్యాకర్ వచ్చి ఈ కథలో జాయిన్ అవడంతో ఈ రెండింటికి మధ్య లింక్ ఉందని ప్రేక్షకుడికి అర్ధమవుతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా టైట్ స్క్రీన్ ప్లేతో నడుస్తుంది. అయితే సెకండ్ హాఫ్‌లో కొంత పట్టు వదిలినట్లనిపించింది. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ తరహాలో ఉండి ఉంటే బాగుండేది. సినిమా క్లైమాక్స్ బాగుంది. సినిమాలోని హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు కథలో భాగంగా వచ్చి వెళ్తాయి. 'లవ్ స్టొరీ' చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసిన బి జె శ్రీధర్ ఈ చిత్రానికి కూడా ఫైట్స్ కంపోజ్ చేశాడు. ఫైట్ సీక్వెన్స్‌లు సరిగ్గా సరిపోయాయి. కానీ అన్ని వర్గాల వారిని అలరించాలనుకునే క్రమంతో కావాలని మరీ బలవంతంగా కథలో ఇరికించిన లవ్ సన్నివేశాలే విసిగిస్తాయి. ఫస్ట్ హాఫ్ వరకు హీరోని సమస్యలో పడేయటం... సెకండ్ హాఫ్ లో ఆ సమస్య నుంచి బయిటపడటానికి అతను ఏం ప్రయత్నం చేశాడు.. ఎలా తన సమస్యలను అధిగమనించాడు? అన్న ధోరణిలో స్క్రీన్ ప్లే రాసుకున్నాడు డైరెక్టర్. అయితే ఇలాంటి కథకు అవసరమైన భారీతనం లోపించినట్లు అనిపిస్తుంది. నటీనటుల పనితీరు హీరోగా చేసిన వసంత్ సమీర్ పిన్నమ రాజు పెర్ఫార్మన్స్ బాగుంది. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ మెప్పిస్తుంది. అతని భార్య పాత్రలో అల్మాస్ మోటివాలా చక్కగా నటించింది. సౌమ్య మీనన్ కీలకమైన పాత్రలో మెరిసింది. ఇక ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్ పర్వాలేదనిపించారు. మార్క్ k రాబిన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా సూటైంది. ఎడిటింగ్ ఓకే. సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదనిపించింది. -
అయ్యో! అపచారం.. నిందితుడి అరెస్ట్
సాక్షి, చెన్నై : ఇటీవల శివలింగంపై కాళ్లు పెట్టి ఫొటో దిగిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులోనూ చెప్పులు ధరించి దర్జాగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే నిందితుడికి ముచ్చెమటలు పట్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. సద్దాం హుస్సేన్ (35) తిరు మూర్తి మండపం వద్దకు ఇటీవల తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. అయితే పాదరక్షలతోనే గుడిలోకి వెళ్లాడు సద్దాం. అనంతరం శివలింగంపై మెకాలు పెట్టి ఫొటోలకు పోజులిచ్చాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. తమ మత విశ్వాసాలు, మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కొందరు హిందూత్వవాదులు, మున్నాయ్ హిందూ గ్రూపు మమళ్లాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సద్దాం హుస్సేన్ ఛెంగల్పేట్ సబ్ జైలులో ఉన్నాడు. ఆ ఫొటోలో సద్దాం పక్కన ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. -
40 సార్లు జాబ్ రిజెక్ట్: అతని పేరుతో వణుకు!
ఆ తాత ఎంతో ప్రేమతో తన మనవడికి పేరు పెట్టాడు. భవిష్యత్తులో అతనో మంచి వ్యక్తి అవుతాడని భావించాడు. కానీ 25 ఏళ్లు తిరిగి చూస్తే ఇప్పుడు ఆ తాత పెట్టిన పేరే మనవడికి మోయలేనంత భారమైపోయింది. అతని పేరు చెప్తే చాలు భయపడుతున్నారు. ఇక, ఉద్యోగం ఎలా ఇస్తారు?.. ఇదే ఇప్పుడు జార్ఖండ్ జెంషెడ్‌పూర్‌కు చెందిన మేరిన్ ఇంజినీర్ సద్దాం హుస్సేన్ ఎదుర్కొంటున్న సమస్య. ఇరాక్ పాలకుడు సద్దాం హుస్సేన్ పేరే తనకు ఉండటంతోనే అతనికి అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. కరుడుగట్టిన నియంతగా ప్రజలపై అనేక అకృత్యాలకు పాల్పడ్డట్టు ఆరోపిస్తూ 2003లో అమెరికా సద్దాంను గద్దె దింపిన సంగతి తెలిసిందే. 'సద్దాం అనే పేరు ఉండటంతో నాకు ఉద్యోగం ఇవ్వడానికి భయపడుతున్నారు' అని అతను వాపోతున్నారు. తమిళనాడులోని నూరుల్ ఇస్లాం యూనివర్సిటీలో మేరిన్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన సద్దాం.. ఇప్పటివరకు 40సార్లు ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరైనా.. అనేక మల్టీనేషనల్ షిప్పింగ్ కంపెనీల చుట్టూ ఉద్యోగాల కోసం తిరిగినా.. అన్నిసార్లు చివరకు నిరాశే ఎదురైంది. అతని బ్యాచ్మేట్లు అంతా ప్రపంచమంతటా మంచి కొలువులు సంపాదించి.. జీవితంలో స్థిరపడిపోగా.. సద్దాం మాత్రం పేరు కారణంగా నిరుద్యోగిగా మిగిలిపోయాడు. సద్దాం అనే పేరు ఉండటం వల్ల వెంటనే అనుమానం వచ్చే అవకాశముందని, అందుకే అతనికి ఉద్యోగం ఇవ్వడానికి టాప్ కంపెనీలు నిరాకరిస్తున్నాయని ఢిల్లీకి చెందిన రిక్రూట్మెంట్ కన్సల్టెంట్ సంస్థ టీమ్‌లీజ్ సర్వీసెస్ అభిప్రాయపడింది. ఈ కష్టాల నేపథ్యంలో సద్దాం ఇప్పుడు తన పేరును సాజిద్‌గా మార్చాలని, ఈ మేరకు తన పదో తరగతి ధ్రువపత్రాలలో మార్పులు చేసేందుకు సీబీఎస్ఈకి ఆదేశాలు ఇవ్వాలంటూ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాడు. తన తాత ప్రేమతో పెట్టిన పేరే ఇప్పుడు తనకు పీడకలను మిగిల్చిందని, కేవలం పేరు కారణంగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని సద్దాం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
విశ్వమానవ స్వేచ్ఛాగీతిక!
13వ శతాబ్దంలో ఇంగ్లండ్ రాజుకు, భూస్వామ్య ప్రభువులకు మధ్య కుదిరిన మాగ్నాకార్టాకు సహస్రాబ్దాలకు పూర్వమే అంతకంటే ఎంతో మెరుగైన విశ్వమానవ సౌభ్రాత్రం మధ్య ప్రాచ్యంలో వెల్లివిరిసిందని ‘సైరస్ సిలండర్’ కళాత్మకంగా చెబుతోంది. ఇరాక్ అధ్యక్షుడు దివంగత సద్దాం హుసేన్ వేసవి విడిదిలోంచి కన్పించే బాబిలోన్ ప్రాం తంలో మానవకథావికాసపు తొలి వసంతం ప్రభవించింది. క్రీ.పూ. 8 వేల ఏళ్ల నాడే బాబి లోన్ సామ్రాజ్యంలో గ్రంథాలయాలుండేవి. మెత్తటి మట్టి పలకలపై పక్షి ఈకలను వత్తు తూ, బాణపు మొన లేక పాళీ కొన ఆకారం లో తొలి నాళ్లలో బొమ్మలను, మలినాళ్లలో అక్షరాలను ఒత్తేవారు. ఇటుకల్లా ఎండలో ఆర నిచ్చి భద్రపరచేవారు. ప్రాధాన్యతల రీత్యా పరిరక్షించాల్సిన వాటిని కాల్చేవారు. ‘మట్టి పేజీ’ల్లోని త్రిభుజాకార లిపిని ‘క్యూనిఫాం’ అంటున్నారు. దాదాపు ఇరవై లక్షల వరకూ లభించిన క్లే టాబ్లెట్స్‌లో లక్ష పేజీలను మాత్ర మే ఆధునిక భాషల్లోకి అనువదించారు. క్యుని ఫాం లిపిలో ‘సుమేరియన్, అక్కాడియన్, అస్సీరియన్,బాబిలోనియన్, ఎలమైట్, హిటి టీ తదితర భాషల సాహిత్యం ఉంది. తొలి గ్రంధాలయాలు! క్లే టాబ్లెట్స్‌లో పురాణాలు, గాథలు, వ్యాసా లు, సామెతలు, మంత్రాలు, ఐతిహాసి క కవి త్వం, మొక్కలు, చట్టాలు వంటివి అక్షరబద్ధం చేశారు. సుమేరు ప్రాంతంలో వచ్చిన ఒక వర ద గురించిన ప్రస్తావన ఒక ఫలకంలో ఉంది. ఎల్లిపాయ, ఉల్లిపాయ, ఉప్పుపాలు, మేక మాంసంతో చేసే వంటకాల వివరణ వీటిల్లో ఉంది. వార్తలు పంపడానికి ప్రత్యేక టాబ్లెట్స్ వాడేవారు. కాల్చిన ఒరిజినల్ లెటర్‌కు కవరిం గ్ లెటర్‌లా మట్టిపూత పూసేవారు. పైపొరను తొలగించి కాలిన పలకల్లోని అక్షరాలు చది వేవారు! ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, ఒక జాతిని మరొక జాతి హింసించే సాంఘిక ధర్మం చెలరేగిన ‘అంధ’యుగాల ఫలితంగా మట్టిలో దాగిన మహావిజ్ఞానం శిథిలమైపో యింది. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం ప్రసరించిన వెలుగుల నేపథ్యంలో, ఆధునిక విజ్ఞానం చరిత్రను నిర్మించే క్రమంలో 19వ శతాబ్దంలో ‘క్లే టాబ్లెట్స్’ మట్టిలోంచి మళ్లీ పురుడు పోసుకున్నాయి. క్రీ.శ.19వ శతాబ్ది నుంచే ‘క్యూనిఫాం’ లిపిలోని భాషలను చదవడం ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో పెన్ మ్యూజియం, (http://www.penn.museum/ cgi/ cuneiform.cgi) క్యునిఫామ్ లిపిని బాలలకు పరి చయం చేస్తోంది. తొలి మానవహక్కుల సర్వసత్తాక పత్రం! బాబిలోన్లోని మర్దుక్ ఆలయ సమీపంలో 1879లో అసిరొ-బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ మొర్ముజ్ద్ రస్సమ్ ఆధ్వర్యంలో జరిపిన పురా వస్తు తవ్వకాలు అక్కాడియన్ భాషలో క్యుని ఫాం లిపిలో ముద్రితమైన స్థూపాకారపు మట్టి ఫలకాన్ని (సైరస్ సిలండర్) వెలుగులోకి తెచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాయి. ఏమా విశేషం? సైరస్ చక్రవర్తి క్రీ.పూ.539 అక్టోబర్ 12వ తేదీన మహాసైన్యంతో నగర ప్రవేశం చేసి బాబిలోన్‌ను, విజయధ్వానాలతో ప్రజా హృదయాలను గెలుచుకున్నారు. అంత మాత్రాన ఆ ఫలకం అరుదైనదా? ‘పర్షియా సామ్రాజ్యంలోని ఏ వ్యక్తి అయినా తన ఇష్ట దేవతను ఆరాధించవచ్చని, ఇతరేతర కారణా లతో ప్రవాసులైన పర్షియా దేశస్థులందరూ తమ మాతృభూమికి స్వేచ్ఛగా తిరిగి విచ్చే యవచ్చ’ని స్పష్టం చేసింది! ఇరాన్ పాలకుడు షా మహ్మద్ రెజాపెహ్లవీ సోదరి బ్రిటిష్ మ్యూజియంలోని ‘సైరస్ సిలండర్’ నమూ నాను నాటి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్య దర్శి ఊథాంట్కు సమర్పించిన నేపథ్యంలో, జాతుల హక్కులకు, మానవ హక్కులకు సం బంధించి ‘సైరస్ సిలండర్’ ప్రపంచ చరి త్రలో తొలి చార్టర్‌గా 1971లో యునెటైడ్ నేషన్స్ ప్రకటించింది. 13వ శతాబ్దంలో ఇం గ్లండ్ రాజుకు, భూస్వామ్య ప్రభువులకు మధ్య కుదిరిన మాగ్నాకార్టాకు సహస్రాబ్దాల కు పూర్వమే అంతకంటే ఎంతో మెరుగైన విశ్వ మానవ సౌభ్రాత్రం మధ్య ప్రాచ్యంలో వెల్లివి రిసిందని ‘సైరస్ సిలండర్’ కళాత్మకంగా చెబుతోంది. సైరస్ ‘హక్కుల చార్టర్’ విశ్వ విజేత అలెగ్జాండర్‌పై ప్రభావం చూపిందని, పరోక్షంగా ఆధునిక సమాజపు స్వేచ్ఛ-స్వాం తంత్య్రం-సామరస్య భావనలకు ప్రేరణని చ్చిందని చరిత్రకారులు భావిస్తున్నారు. ‘సైరస్ చార్టర్’ పురుడు పోసుకునే వేళ, గౌత మ బుద్ధుడు జింకల వనంలో విశ్వ ప్రాణుల సంక్షేమాన్ని ప్రబోధించారు. 3 శతాబ్దాల తర్వాత అశోకుని కాలంలో ఆ బోధనలు అక్షర రూపం ధరించాయి. ఒక తీరాన్ని తాకిన సముద్రపు అలే భూభ్రమణంలో మరొక తీరా న్నీ తాకుతుంది! పున్నా కృష్ణమూర్తి (బ్రిటిష్ మ్యూజియానికి చెందిన ‘సైరస్ సిలండర్’ను ముంబైలోని శివాజీ మహరాజ్ వస్తు సంగ్రహాలయంలో డిసెంబర్ 21 నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకూ ప్రదర్శిస్తోన్న సందర్భంగా...)