విశ్వమానవ స్వేచ్ఛాగీతిక! | cyrus cylinder belongs to 13th century | Sakshi
Sakshi News home page

విశ్వమానవ స్వేచ్ఛాగీతిక!

Published Wed, Dec 18 2013 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM

విశ్వమానవ స్వేచ్ఛాగీతిక!

విశ్వమానవ స్వేచ్ఛాగీతిక!

 13వ శతాబ్దంలో ఇంగ్లండ్ రాజుకు, భూస్వామ్య ప్రభువులకు మధ్య కుదిరిన మాగ్నాకార్టాకు సహస్రాబ్దాలకు పూర్వమే అంతకంటే ఎంతో మెరుగైన విశ్వమానవ సౌభ్రాత్రం మధ్య ప్రాచ్యంలో వెల్లివిరిసిందని  ‘సైరస్ సిలండర్’ కళాత్మకంగా చెబుతోంది.
 
 ఇరాక్ అధ్యక్షుడు దివంగత సద్దాం హుసేన్ వేసవి విడిదిలోంచి కన్పించే బాబిలోన్ ప్రాం తంలో మానవకథావికాసపు తొలి వసంతం ప్రభవించింది. క్రీ.పూ. 8 వేల ఏళ్ల నాడే బాబి లోన్ సామ్రాజ్యంలో గ్రంథాలయాలుండేవి. మెత్తటి మట్టి పలకలపై పక్షి ఈకలను వత్తు తూ, బాణపు మొన లేక  పాళీ కొన ఆకారం లో తొలి నాళ్లలో బొమ్మలను, మలినాళ్లలో అక్షరాలను ఒత్తేవారు. ఇటుకల్లా ఎండలో ఆర నిచ్చి భద్రపరచేవారు. ప్రాధాన్యతల రీత్యా పరిరక్షించాల్సిన వాటిని కాల్చేవారు.  ‘మట్టి పేజీ’ల్లోని త్రిభుజాకార లిపిని ‘క్యూనిఫాం’ అంటున్నారు. దాదాపు ఇరవై లక్షల వరకూ లభించిన క్లే టాబ్లెట్స్‌లో లక్ష పేజీలను మాత్ర మే ఆధునిక భాషల్లోకి అనువదించారు. క్యుని ఫాం లిపిలో ‘సుమేరియన్, అక్కాడియన్, అస్సీరియన్,బాబిలోనియన్, ఎలమైట్, హిటి టీ తదితర భాషల సాహిత్యం ఉంది.
 
 తొలి గ్రంధాలయాలు!
 క్లే టాబ్లెట్స్‌లో పురాణాలు, గాథలు, వ్యాసా లు, సామెతలు, మంత్రాలు, ఐతిహాసి క కవి త్వం, మొక్కలు, చట్టాలు వంటివి అక్షరబద్ధం చేశారు. సుమేరు ప్రాంతంలో వచ్చిన ఒక వర ద గురించిన ప్రస్తావన ఒక ఫలకంలో ఉంది. ఎల్లిపాయ, ఉల్లిపాయ, ఉప్పుపాలు, మేక మాంసంతో చేసే వంటకాల వివరణ వీటిల్లో ఉంది. వార్తలు పంపడానికి ప్రత్యేక టాబ్లెట్స్ వాడేవారు. కాల్చిన ఒరిజినల్ లెటర్‌కు కవరిం గ్ లెటర్‌లా మట్టిపూత పూసేవారు. పైపొరను తొలగించి కాలిన పలకల్లోని అక్షరాలు చది వేవారు! ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, ఒక జాతిని మరొక జాతి హింసించే సాంఘిక ధర్మం చెలరేగిన ‘అంధ’యుగాల ఫలితంగా మట్టిలో దాగిన మహావిజ్ఞానం శిథిలమైపో యింది. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం ప్రసరించిన వెలుగుల నేపథ్యంలో, ఆధునిక విజ్ఞానం చరిత్రను నిర్మించే క్రమంలో 19వ శతాబ్దంలో ‘క్లే టాబ్లెట్స్’ మట్టిలోంచి మళ్లీ పురుడు పోసుకున్నాయి. క్రీ.శ.19వ శతాబ్ది నుంచే ‘క్యూనిఫాం’ లిపిలోని భాషలను చదవడం ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో పెన్ మ్యూజియం, (http://www.penn.museum/ cgi/ cuneiform.cgi) క్యునిఫామ్ లిపిని బాలలకు పరి చయం చేస్తోంది.
 
 తొలి మానవహక్కుల సర్వసత్తాక పత్రం!
 బాబిలోన్‌లోని మర్దుక్ ఆలయ సమీపంలో 1879లో అసిరొ-బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ మొర్ముజ్ద్ రస్సమ్ ఆధ్వర్యంలో జరిపిన పురా వస్తు తవ్వకాలు అక్కాడియన్ భాషలో క్యుని ఫాం లిపిలో ముద్రితమైన స్థూపాకారపు మట్టి ఫలకాన్ని (సైరస్ సిలండర్) వెలుగులోకి తెచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాయి. ఏమా విశేషం?  సైరస్ చక్రవర్తి క్రీ.పూ.539 అక్టోబర్ 12వ తేదీన  మహాసైన్యంతో నగర ప్రవేశం చేసి బాబిలోన్‌ను,  విజయధ్వానాలతో ప్రజా హృదయాలను గెలుచుకున్నారు. అంత మాత్రాన ఆ ఫలకం అరుదైనదా? ‘పర్షియా సామ్రాజ్యంలోని ఏ వ్యక్తి అయినా తన ఇష్ట దేవతను ఆరాధించవచ్చని, ఇతరేతర కారణా లతో ప్రవాసులైన పర్షియా దేశస్థులందరూ తమ మాతృభూమికి స్వేచ్ఛగా తిరిగి విచ్చే యవచ్చ’ని స్పష్టం చేసింది! ఇరాన్ పాలకుడు షా మహ్మద్ రెజాపెహ్లవీ సోదరి  బ్రిటిష్ మ్యూజియంలోని ‘సైరస్ సిలండర్’ నమూ నాను నాటి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్య దర్శి ఊథాంట్‌కు సమర్పించిన నేపథ్యంలో,  జాతుల హక్కులకు, మానవ హక్కులకు  సం బంధించి ‘సైరస్ సిలండర్’ ప్రపంచ చరి త్రలో తొలి చార్టర్‌గా  1971లో యునెటైడ్ నేషన్స్ ప్రకటించింది.
 
 13వ శతాబ్దంలో ఇం గ్లండ్ రాజుకు, భూస్వామ్య ప్రభువులకు మధ్య కుదిరిన మాగ్నాకార్టాకు సహస్రాబ్దాల కు పూర్వమే అంతకంటే ఎంతో మెరుగైన విశ్వ మానవ సౌభ్రాత్రం మధ్య ప్రాచ్యంలో వెల్లివి రిసిందని  ‘సైరస్ సిలండర్’ కళాత్మకంగా చెబుతోంది. సైరస్ ‘హక్కుల చార్టర్’ విశ్వ విజేత అలెగ్జాండర్‌పై ప్రభావం చూపిందని, పరోక్షంగా ఆధునిక సమాజపు స్వేచ్ఛ-స్వాం తంత్య్రం-సామరస్య భావనలకు ప్రేరణని చ్చిందని చరిత్రకారులు భావిస్తున్నారు. ‘సైరస్ చార్టర్’ పురుడు పోసుకునే వేళ, గౌత మ బుద్ధుడు జింకల వనంలో  విశ్వ ప్రాణుల సంక్షేమాన్ని ప్రబోధించారు. 3 శతాబ్దాల తర్వాత అశోకుని కాలంలో ఆ బోధనలు అక్షర రూపం ధరించాయి. ఒక తీరాన్ని తాకిన సముద్రపు అలే భూభ్రమణంలో మరొక తీరా న్నీ తాకుతుంది!
 పున్నా కృష్ణమూర్తి
 (బ్రిటిష్ మ్యూజియానికి చెందిన
 ‘సైరస్ సిలండర్’ను  ముంబైలోని
 శివాజీ మహరాజ్ వస్తు సంగ్రహాలయంలో  డిసెంబర్  21 నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకూ ప్రదర్శిస్తోన్న సందర్భంగా...)
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement