Vevela Taarale Song From Taxi Movie: ఈ మధ్య మెలోడీ పాటలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు సింగర్ సిద్ శ్రీరామ్. ఆయన పాటలో ఉండే కమ్మదనం ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా అతడు 'టాక్సీ' సినిమాలో పాడిన యూత్‌ఫుల్ మెలోడీ సాంగ్ 'వేవేల తారలే..' శుక్రవారం రిలీజైంది. ''వేవేలా తారలే నా చుట్టూ చేరి మురిసేనా.. మేఘాల పైన తేలుతున్నా'' అంటూ మొదలైన ఈ బ్యూటిఫుల్ మెలోడీ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఎప్పటిలాగే సిద్ శ్రీరామ్ తన గొంతుతో మరోసారి మ్యాజిక్ చేశారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందించిన ఈ పాటకు కృష్ణ కాంత్ లిరిక్స్ సమకూర్చారు.
హెచ్ అండ్ హెచ్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్‌పై హరిత సజ్జ నిర్మిస్తున్న 'టాక్సీ' సినిమాకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన హరీష్ సజ్జా దర్శకత్వం వహిస్తున్నారు. బిక్కి విజయ్ కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మీనన్, ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment