Software service
-
సాఫ్ట్వేర్ సంస్థల ఎగుమతులు పెంపు
దేశీయ సాఫ్ట్వేర్ కంపెనీల ఎగుమతులు పెరుగుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.17.2 లక్షల కోట్ల విలువైన సాఫ్ట్వేర్ సేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. దేశీయ కంపెనీలు విదేశాల్లోని వాటి అనుబంధ సంస్థలతో కలిసి ఈ ఘనత సాధించాయి. ఈమేరకు భారతీయ రిజర్వ్ బ్యాంకు వివరాలు వెల్లడించింది.ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం..2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ సాఫ్ట్వేర్ కంపెనీల సేవల ఎగుమతులు రూ.200.6 బిలియన్ డాలర్లు(రూ.16.8 లక్షల కోట్లు)గా ఉన్నాయి. 2023-24లో అది రూ.17.2 లక్షల కోట్లుకు పెరిగింది. దేశీయ కంపెనీలు విదేశాల్లోని తమ అనుబంధ సంస్థలతో కలిసి ఈ ఘనత సాధించాయి. రూ.17.2 లక్షల కోట్ల నుంచి విదేశీ అనుబంధ సంస్థల సేవలను మినహాయిస్తే కేవలం దేశీయ కంపెనీలే రూ.16 లక్షల కోట్ల విలువైన సేవలను ఎగుమతి చేశాయి. ఇది గతేడాదితో పోలిస్తే 2.8 శాతం ఎక్కువ. భారత కంపెనీలు అధికంగా అమెరికాకు ఈ సేవలను ఎగుమతి చేస్తున్నాయి. మొత్తం భారత కంపెనీల ఎగుమతుల్లో అమెరికా వాటా 53 శాతం కాగా, యూరప్ వాటా 31 శాతంగా ఉంది.ఇదీ చదవండి: రెండేళ్లలో రూ.5 లక్షల కోట్ల ఆదాయంఅంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక అస్థిరతలు పెరగడం వల్ల యుద్ధ భయాలు నెలకొంటున్నాయి. దాంతో బ్యాంకింగ్ రంగ సంస్థలతోపాటు ఇతర కంపెనీలు సాఫ్ట్వేర్ సేవలను అప్డేట్ చేయడంలో కొంత వెనుకంజ వేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణం రేటు కొంత స్థిరంగా కదలాడుతోంది. దాంతో సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. ఫలితంగా లోన్లు పెరిగి బ్యాంకింగ్ రంగ సంస్థలు తమ సాఫ్ట్వేర్ కేటాయింపులకు నిధులు పెంచే అవకాశం ఉంటుంది. దాంతో రానున్న రోజుల్లో సాఫ్ట్వేర్ ఎగమతులు మరింత పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
విప్రో లాభం డౌన్...
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం దాదాపు 12 శాతం క్షీణించి రూ. 2,694 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 3,053 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 4 శాతం వెనకడుగుతో రూ. 22,205 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 23,229 కోట్ల టర్నోవర్ సాధించింది. ఐటీ సర్విసుల విభాగం 4.5 శాతం తక్కువగా రూ. 22,151 కోట్ల ఆదాయం అందుకుంది. గైడెన్స్ ఇలా ఈ ఏడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో ఐటీ సర్విసుల బిజినెస్ 261.5–266.9 కోట్ల డాలర్ల(రూ. 21,845–22,296 కోట్లు) మధ్య టర్నోవర్‌ను సాధించే వీలున్నట్లు విప్రో తాజాగా అంచనా వేసింది. వాటాదారులకు ప్రతీ షేరుకీ రూ. 1 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఇతర విశేషాలు ♦ ఐటీ సర్వీసుల నిర్వహణ లాభం(ఇబిట్) త్రైమాసికవారీగా 2 శాతం తగ్గి రూ. 3,540 కోట్లుగా నమోదైంది. ♦బీఎఫ్ఎస్ఐ సర్విసుల విభాగం ఆదాయం 12.1% క్షీణించగా.. కన్జూమర్ 6.9%, తయారీ 9.1% చొప్పున నీరసించాయి. కమ్యూనికేషన్స్ నుంచి మాత్రం 18.8 శాతం జంప్‌చేసింది. ♦ ఆర్డర్ బుక్ 0.2 శాతం బలపడి 3.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. వీటిలో భారీ డీల్స్ విలువ 0.9 బిలియన్ డాలర్లు. ♦ ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు గత 6 క్వార్టర్లకల్లా కనిష్టంగా 14.2 శాతంగా నమోదైంది. ♦ డిసెంబర్‌కల్లా 4,473 మంది ఉద్యోగులు తగ్గారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,40,234గా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 465 వద్ద ముగిసింది. -
రూ. 251తో 14ఏళ్లకే సాఫ్ట్వేర్ కనిపెట్టిన 'కన్హయ శర్మ' - ఎవరు?
ప్రస్తుతం మొబైల్ ఫోన్ లేకుండా పెద్దవారికైనా, పిల్లలకైనా రోజు గడవదు అంటే అందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. పెద్దవారి సంగతి అలా ఉంచితే, పిల్లలు పుస్తకాల్లో కంటే మొబైల్, ఇంటర్నెట్, కంప్యూటర్లలోనే ఎక్కువ కాలం గడిపేస్తున్నారు. ఇది తల్లిదండ్రులకు ఆందోళనగా మారిపోతోంది. అయితే అందుకు భిన్నంగా 'కన్హయ శర్మ' అనే యువకుడు చిన్నప్పుడే అద్భుతాలు సృష్టించి ప్రపంచ వ్యాప్తంగా హ్యాకింగ్‌లో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఇతడెవారు? ఇప్పుడేం చేస్తున్నాడు? అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన 'కన్హయ శర్మ' కేవలం 14 ఏళ్ల వయసులోనే ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి రూ. 50వేలకు విక్రయించాడు. ప్రస్తుతం దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో గొప్ప హ్యాకర్‌గా పేరు తెచ్చుకున్నాడు. కన్హయ శర్మ తండ్రి ఇండోర్ నగరంలో ఉపాధ్యాయ వృత్తిలో తమ కుటుంబాన్ని పోషించేవాడు. కానీ కన్హయ శర్మ తన చిన్నతనంలోనే కేవలం రూ. 251తో ప్రారంభమైన ఇప్పుడు ఐటీ అండ్ లీగల్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన కంపెనీలను స్థాపించి ఇప్పుడు కోట్లలో టర్నోవర్ చేస్తున్నాడు. నిజానికి కన్హయ శర్మ ఇండోర్‌లోని సరాఫా విద్యా నికేతన్‌లో 8వ తరగతి చదువుతున్నప్పుడు పాఠశాలలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఆ నిర్మాణ పనులకు అవసరమయ్యే సామాగ్రి కోసం కూలీలు ఎంతగానో కష్టపడేవారు. ఇది చూసి కన్హయ ఒక కొత్త సాఫ్ట్వేర్ కనిపెట్టాలని నిర్ణయించుకుని 30 రోజుల్లోనే అనుకున్న విధంగానే సాఫ్ట్వేర్ కనిపెట్టాడు. దానిని సంస్థ వారికి యాభైవేల రూపాయలకు విక్రయించాడు. ఇప్పటికీ వారు సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగిస్తుండటం గమనార్హం. (ఇదీ చదవండి: నిండా 18 ఏళ్ళు లేవు..! రూ. కోటి కంటే ఎక్కువ ఖరీదైన కారు కొనేసాడు - వీడియో) తాను 6, 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి కంప్యూటర్లు, ఇంటర్నెట్ ప్రపంచంతో చాలా సంబంధాలు ఉండేవని, కానీ ఏడో తరగతిలో ఆన్లైన్ సర్టిఫికేషన్ పరీక్షలో ఫెయిల్ అయ్యానని కన్హయ తెలిపారు. అయితే ప్రస్తుతం న్యాయ సేవలకు ఐటీ సాఫ్ట్వేర్ అభివృద్ధిని అందించే కంపెనీలను ప్రారంభించినట్లు కూడా తెలిపాడు. (ఇదీ చదవండి: ప్రైవేట్ చేతుల్లోకి ఆధార్ అథెంటికేషన్ - ప్రజలు సమ్మతిస్తారా..?) కన్హయ శర్మ చదువుకునే రోజుల్లో తమ ఇంట్లో కేవలం ఒక సైకిల్ మాత్రమే ఉండేదని, ఇప్పుడు 5 నుంచి 6 లగ్జరీ కార్లు ఉన్నాయని వెల్లడించాడు. అంతే కాకుండా తనకు దేశంలోని ప్రభుత్వ సంస్థలతో అనుబంధం కలిగి ఉన్నట్లు, అక్కడి అధికారులకు, విద్యార్థులకు తానే ట్రైనింగ్ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: సినిమా హీరోలా ఉంటాడనుకున్నా, తీరా చూస్తే.. భర్తపై సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు) కన్హయ శర్మ హ్యాకింగ్ నైపుణ్యాలను చూసి దేశవ్యాప్తంగా అనేక పెద్ద ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు అతనితో చేరడానికి 2.5 కోట్ల వార్షిక ప్యాకేజీ ఆఫర్ చేసినప్పటికీ వాటిని కన్హయ తిరస్కరించారు. ప్రస్తుతం ఇతడు వాప్‌గో అండ్ లీగల్251 వ్యవస్థాపకుడు & CEOగా ఉన్నట్లు సమాచారం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
మైండ్‌ట్రీ లాభం జూమ్...
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల కంపెనీ మైండ్‌ట్రీ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం 34% జంప్‌చేసి రూ. 437 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 326 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 36 శాతం పురోగమించి రూ. 2,750 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 2,024 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. డాలర్ల రూపేణా ఈ ఏడాది క్యూ3లో మైండ్‌ట్రీ డాలర్ల రూపేణా 58.3 మిలియన్ డాలర్ల నికర లాభం ఆర్జించింది. ఇది 32 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం 34 శాతం పుంజుకుని 366.4 మిలియన్ డాలర్లకు చేరింది. డిసెంబర్ చివరికల్లా కంపెనీ యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 265ను తాకగా.. 31,959 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. తాజా త్రైమాసికంలో 4,500 మంది ఉద్యోగులను చేర్చుకుంది. వచ్చే ఏడాది(2022–23)లో క్యాంపస్‌ల ద్వారా మరింత మందిని ఎంపిక చేసుకోనున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ దేవశిష్ చటర్జీ పేర్కొన్నారు. గత 12 నెలల్లో ఉద్యోగ వలసల రేటు 21.9 శాతంగా నమోదైనట్లు తెలియజేశారు. కోయంబత్తూర్, వరంగల్‌లో కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో మైండ్‌ట్రీ షేరు బీఎస్ఈలో 2.4% లాభపడి రూ. 4,744 వద్ద ముగిసింది. -
కోవిడ్ కాలంలోనూ తగ్గని సాఫ్ట్వేర్ సేవలు
ముంబై: కోవిడ్–19 సమయంలో అంటే 2020–21 ఆర్థిక సంవత్సరంలోనూ భారత్ సాఫ్ట్వేర్ సేవల ఎగుమతులు (భారత్ కంపెనీల విదేశీ అనుబంధ విభాగాల సేవలనూ కలుపుకుని) 2.1 శాతం పెరిగాయి. విలువలో 148.3 బిలియన్ డాలర్లకు చేరినట్లు సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సర్వే ఒకటి తెలిపింది. కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ సమాచార సాంకేతికత ఆధారిత సేవల (ఐటీఈఎస్) వార్షిక సర్వేలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ►భారత్ కంపెనీల విదేశీ అనుబంధ విభాగాల సేవలను కలుపుకోకుండా పరిశీలిస్తే, ఎగుమతుల విలువ 4 శాతం పెరిగి 134 బిలియన్ డాలర్లుకు పెరిగింది. ►మొత్తం ఎగుమతుల్లో కంప్యూటర్ సేవల వాటా 65.4 శాతంకాగా, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ సమాచార సాంకేతికత ఆధారిత సేవల (ఐటీఈఎస్) వాటా 34.7 శాతం. ఇందులో (ఐటీఈఎస్)లో బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ ప్రధాన వాటా ఉంది. ►సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల వాటా 50% కన్నా అధికంగా ఉంది. ►సాఫ్ట్వేర్ ఎగుమతులకు ప్రధాన మార్కెట్ వాటాలో మొదటి స్థానంలో అమెరికా (54.8 శాతం) ఉంది. యూరోప్ వాటా 30.1 శాతం. ఇందులో సగం వాటా కేవలం బ్రిటన్‌ది కావడం గమనార్హం. ►సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో ప్రధాన ఇన్వాయిసింగ్ కరెన్సీలో అమెరికా డాలర్ వాటా 72 శాతం. యూరో, పౌండ్ స్టెర్లింగ్ వాటా 15.9 శాతం. ►6,115 సాఫ్ట్వేర్ ఎగుమతి కంపెనీలను ఈ సర్వేకోసం సంప్రదిస్తే, 1,815 కంపెనీలు మాత్రమే ప్రతిస్పందించాయి. వీటిలో పెద్ద కంపెనీలే అధికంగా ఉన్నాయి. అయితే మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీల్లో కేవలం వీటి వాటానే 86.5 శాతం కావడం గమనార్హం. -
భారీగా పుట్టుకొస్తున్న సాస్ స్టార్టప్‌లు, ఐపీఓకి జోష్
ముంబై: ఇటీవల డిమాండుకు అనుగుణంగా దేశంలో సాస్(ఎస్ఏఏఎస్) స్టార్టప్‌లు భారీగా పుట్టుకొస్తున్నాయి. మరోపక్క కొద్ది నెలలుగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న పబ్లిక్ ఇష్యూల హవా చిన్నా, పెద్దా కంపెనీలకు కొత్త జోష్‌నిస్తోంది. దీంతో సాఫ్ట్‌వేర్‌నే సర్వీసులుగా అందించే(సాస్) స్టార్టప్‌లు సైతం పబ్లిక్ ఇష్యూలను చేపట్టాలని యోచిస్తున్నాయి. తద్వారా పెట్టుబడుల సమీకరణతోపాటు స్టాక్ ఎక్ఛేంజీలలో లిస్టింగ్‌ను సాధించాలని ఆశిస్తున్నాయి. గత నెలలో రెండు సాస్ స్టార్టప్‌లు ఐపీవో బాటలో సాగనున్నట్లు ప్రకటించాయి కూడా. ఇవి రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్, ఫ్రెష్‌వర్క్స్ ఇంక్. మర్చంట్ బ్యాంకర్ల సమాచారం ప్రకారం సాస్ స్టార్టప్‌ల పట్ల ఇన్వెస్టర్లు అత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. దీంతో పలు కంపెనీలు ఈ బాట పట్టనున్నట్లు భావిస్తున్నారు. దేశీయంగా ఆతిథ్యం, ట్రావెల్ విభాగంలో అతిపెద్ద సాస్ కంపెనీగా నిలుస్తున్న రేట్‌గెయిన్ టెక్నాలజీస్ తొలిగా స్టాక్ ఎక్ఛేంజీలలో లిస్ట్‌కానున్నట్లు అంచనా వేస్తున్నారు. రూ. 1,200 కోట్లు పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,200 కోట్లు సమకూర్చుకునేందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి రేట్‌గెయిన్ దరఖాస్తు చేసింది. మరోవైపు చెన్నై సిలికాన్ వ్యాలీ కంపెనీ.. ఫ్రెష్‌వర్క్స్ ఇంక్ 10 కోట్ల డాలర్ల(సుమారు రూ. 730 కోట్లు) సమీకరణకు గత వారాంతాన యూఎస్‌లో ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా నాస్డాక్ గ్లోబల్ సెలక్ట్ మార్కెట్లో క్లాస్–ఏ కామన్స్టాక్గా లిస్టయ్యే ప్రణాళికల్లో ఉంది. కొన్నేళ్ల నుంచీ సాస్ కంపెనీలు పెట్టుబడులను భారీగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ రంగంలో ఇప్పటివరకూ 6 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 44,000 కోట్లు) పెట్టుబడులు నమోదయ్యాయి. గత మూడేళ్లలోనే 4 బిలియన్ డాలర్లు లభించడం గమనార్హం! కాగా.. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్(ఏపీఐలు)లకు సహకార ప్లాట్‌ఫామ్‌గా వ్యవహరించే పోస్ట్‌మ్యాన్ కంపెనీ ఇటీవల 22.5 కోట్ల డాలర్లను సమీకరించింది. తద్వారా కంపెనీ విలువ 5.6 బిలియన్ డాలర్లను అందుకుంది. వెరసి దేశీయంగా అత్యంత విలువైన సాస్ స్టార్టప్‌గా ఆవిర్భవించింది. యూనికార్న్‌లుగా దేశంలో ప్రస్తుతం బిలియన్ డాలర్ విలువను సాధించడం ద్వారా యూనికార్న్ హోదా పొందిన 60 సంస్థలలో 10 స్టార్టప్‌లు సాస్ విభాగంలోనే నమోదయ్యాయి. ఈ ఏడాదిలో నాలుగు సంస్థలు కొత్తగా జాబితాలో చేరాయి. దేశీయంగా సాస్ విభాగంలో సమర్ధవంతమైన కంపెనీలు ఊపిరి పోసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కస్టమర్లకు ప్రాధాన్యత, ప్రపంచస్థాయి ప్రొడక్టులు సహకరిస్తున్నాయి. డిమాండు ఆధారంగా సంస్థలను నెలకొల్పే టెక్ వ్యవస్థాపకులకుతోడు.. నైపుణ్యం కలిగిన డెవలపర్ల అందుబాటు వంటి అంశాలతో పరిశ్రమ వేగంగా ఎదుగుతున్నట్లు ట్రూస్కేల్ క్యాపిటల్ అధికారి సమీర్ నాథ్ తెలియజేశారు. దీంతో చివరి కస్టమర్లకు పలు విలువైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా దేశీ సాస్ కంపెనీలు పోటీలో ముందుంటున్నట్లు వివరించారు. పలు దేశీ కంపెనీలు యూఎస్‌తోపాటు, అవకాశాలకు వీలున్న గ్లోబల్ మార్కెట్లపై దృష్టిసారిస్తున్నాయి. అధిక వృద్ధి, ఆదాయాలు, ఆకర్షణీయ మార్జిన్లతో పోటీ సంస్థలతో పోలిస్తే ప్రీమియం విలువలను అందుకుంటున్నాయని విశ్లేషకులు తెలియజేశారు. రేట్‌గెయిన్ ఐపీవో రేట్‌గెయిన్ ట్రావెల్‌ను 2004లో భాను చోప్రా ఏర్పాటు చేశారు. హోటళ్లు, ఎయిర్‌లైన్స్, ఆన్లైన్ ట్రావెల్, టూర్ ప్యాకేజీ ప్రొవైడర్స్, రైల్, క్రూయిజర్లు తదితరాలలో సొల్యూషన్స్ అందిస్తోంది. ఆతిథ్యం, ట్రావెల్ విభాగంలో అతిపెద్ద డేటాపాయింట్ సర్వీసులను కల్పిస్తోంది. 1400 కస్టమర్ సంస్థలను కలిగి ఉంది. గ్లోబల్ ఫార్చూన్–500 కంపెనీలలో 8 సంస్థలకు సేవలు సమకూర్చుతోంది. హోటళ్ల విభాగంలో ఇంటర్కాంటినెంటల్, కెస్లర్ కలెక్షన్, లెమన్ ట్రీ, ఓయో తదితరాలున్నాయి. ఫ్రెష్వర్క్స్కు పెట్టుబడులు ఇటీవల ఫ్రెష్‌వర్క్స్ 40 కోట్ల డాలర్ల(రూ. 2,925 కోట్లు) పెట్టు బడులు సమకూర్చుకుంది. దీంతో కంపెనీ విలువ 3.5 బిలియన్ డాలర్లకు చేరింది. ఫ్రెష్‌వర్క్స్‌లో దిగ్గజాలు సీక్వోయా క్యాపిటల్, యాక్సెల్, టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, క్యాపిటల్ జి తదితరాలు ఇన్వెస్ట్ చేశాయి. గత ఏడాది కాలంలో యూఎస్‌లో సాప్ ఐపీవోలు విజయవంతమయ్యాయి. నాస్డాక్లో లిస్టింగ్ ద్వారా 10 బిలియన్ డాలర్ల విలువను అందుకోవాలని ఫ్రెష్‌వర్క్స్ చూస్తోంది. వెరసి అతిపెద్ద దేశీ సాస్ స్టార్టప్‌లలో ఒకటిగా నిలిచే అవకాశముంది. చదవండి : రూ.16వేల కోట్ల ఐపీఓ,పేటీఎం కొత్త స్ట్రాటజీ! -
యూఎస్ ఎన్నికలు- ఐటీ షేర్లు గెలాప్
యూఎస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో దేశీయంగా సాఫ్ట్వేర్ సర్వీసుల రంగం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ దాదాపు 3 శాతం ఎగసింది. యూఎస్ అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్.. లేదా డెమొక్రటిక్ బైడెన్ గెలిచినాగానీ దేశీ ఐటీ రంగానికి మేలే జరగనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. బైడెన్ విజయం సాధిస్తే హెచ్1బీ వీసాల నిబంధనల సడలింపు ద్వారా దేశీ ఐటీ కంపెనీలు లబ్ది పొందే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదేవిధంగా ట్రంప్ తిరిగి ప్రెసిడెంట్ పదవి చేపడితే.. యూఎస్ డాలరు బలపడుతుందని అంచనా వేస్తున్నారు. దేశీ ఐటీ కంపెనీలు అధిక శాతం ఆదాయాలను ఉత్తర అమెరికా నుంచి సాధించే విషయం విదితమే. దీంతో డాలరు బలపడితే ఐటీ రంగ మార్జిన్లు మెరుగుపడే వీలుంటుంది. వెరసి రెండు విధాలా దేశీ ఐటీ కంపెనీలకు ప్రయోజనమేనని నిపుణులు చెబుతున్నారు. ట్రేడింగ్ వివరాలు చూద్దాం.. హుషారుగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో పలు బ్లూచిప్, మిడ్ క్యాప్ ఐటీ కౌంటర్లు హుషారుగా కదులుతున్నాయి. కోఫోర్జ్ 4.3 శాతం జంప్‌చేసి రూ. 2,222ను తాకగా.. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 3.5 శాతం పెరిగి రూ. 3,039కు చేరింది. ఈ బాటలో ఇన్ఫోసిస్ 3.4 శాతం ఎగసి రూ. 1,099 వద్ద, విప్రో 3.1 శాతం బలపడి రూ. 346 వద్ద ట్రేడవుతున్నాయి. ఇతర కౌంటర్లలో టీసీఎస్ 2.2 శాతం పుంజుకుని రూ. 2691కు చేరగా.. మైండ్‌ట్రీ 2.2 శాతం లాభంతో రూ. 1,346 వద్ద, టెక్ మహీంద్రా 2.1 శాతం వృద్ధితో రూ. 825 వద్ద కదులుతున్నాయి. ఇదేవిధంగా ఎంఫసిస్ 1.6 శాతం పెరిగి రూ. 1,383ను తాకగా.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 1.3 శాతం అధికంగా రూ. 825 వద్ద ట్రేడవుతోంది. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం హైజంప్
►54% వృద్ధితో రూ. 1,834 కోట్లు ►షేరుకి రూ. 12 డివిడెండ్ సాక్షి, న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గడిచిన ఏడాది(2013 జూలై-2014 జూన్) క్యూ4(ఏప్రిల్-జూన్)లో ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 54% ఎగసి రూ. 1,834 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2012 జూలై- 2013 జూన్) ఇదే కాలంలో(క్యూ4) రూ.1,193 కోట్లను మాత్రమే ఆర్జించింది. కంపెనీ జూలై-జూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. అప్లికేషన్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసుల విభాగాల్లో నమోదైన వృద్ధి ఇందుకు దోహదపడినట్లు కంపెనీ సీఈవో అనంత్ గుప్తా పేర్కొన్నారు. గడిచిన ఏడాది పటిష్ట వృద్ధిని సాధించామని, తొలిసారి 5 బిలియన్ డాలర్ల(రూ. 30,000 కోట్లు) ఆదాయాన్ని అందుకున్నట్లు గుప్తా తెలిపారు. ప్రస్తుత సమీక్షా కాలంలో ఆదాయం కూడా 21% పుంజుకుని రూ. 8,424 కోట్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 12 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. ఆన్సైట్ ఉద్యోగులకు 3%, ఆఫ్‌షోర్ సిబ్బందికి 7% చొప్పున వేతన పెంపును అమలుచేయనున్నట్లు గుప్తా చెప్పారు.