
రాహుల్‌పై ‘రాజద్రోహం’ విచారణ స్వీకరణ
అలహాబాద్: జేఎన్‌యూలో రాజద్రోహానికి పాల్పడ్డ వ్యక్తులపై పోలీసు చర్యను వ్యతిరేకించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై రాజద్రోహం కేసును విచారించేందుకు అలహాబాద్ కోర్టు అంగీకరించింది. భారతీయ శిక్షా స్మృతి (200 సెక్షన్) ప్రకారం రాహుల్‌పై వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సుశీల్ కుమార్ ఆదేశించారు.