ప్రతిష్ఠాత్మక ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీ సీపీఐ అనుబంధ విద్యార్థి సంఘం ఏఐఎస్ఏ ఘనవిజయం సాధించింది.
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీ సీపీఐ అనుబంధ విద్యార్థి సంఘం ఏఐఎస్ఏ ఘనవిజయం సాధించింది.
ఆదివారం ఉదయం విడుదలైన ఫలితాల్లో ఏఐఎస్ఏ( ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్) అధ్యక్ష, కార్యదర్శి పదవులను సొంతం చేసుకోగా, బీజేపీ అనుబంధ ఏబీవీపీ (అఖిలభారత విద్యార్థి పరిషత్) ఉపాధ్యక్ష స్థానంతో సరిపెట్టుకుంది.
శనివారం వెల్లడయిన ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల ఫలితాల్లో నాలుగు పదవులకు అన్నింటినీ గెలుచుకుని ఏబీవీపీ క్లీన్ స్వీప్ సాధించిన సంగతి తెలిసిందే.