aisa
-
ఆసియాలోనే ఒకే ఒక్కడు కోహ్లీ దరిదాపుల్లో కూడా ఎవరు లేరు ..
-
ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ హవా
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సత్తా చాటింది. అధ్యక్ష పదవితోపాటు మరో రెండు పదవులు కైవసం చేసుకుంది. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో ఏబీవీపీకి చెందిన అశ్విత్ దాహియ ఎన్ఎస్యూఐ అభ్యర్థి చెత్న త్యాగిపై 19వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత కొన్ని సంవత్సరాల ఎన్నికలు పరిశీలిస్తే ఇదే అత్యధిక మెజార్టీ అని ఏబీవీపీ జాతీయ మీడియా కన్వీనర్ మోనికా చౌదరి తెలిపారు. మహిళా సాధికారత కోసం ‘మిషన్ సాహసి’ని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. ఏబీవీపీకి చెందిన ప్రదీప్ తన్వార్ ఉపాధ్యక్షుడిగా, శివాంగి ఖర్వాల్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. దీంతో వర్సిటీ ప్రాంగణంలో ఆ సంస్థ మద్దతుదారులు భారీ విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ అనుబంధ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) ఒక సెక్రటరీ పదవిని గెలుచుకుంది. ఆ సంస్థ అభ్యర్థి అశిష్ లంబా ఏబీవీపీ అభ్యర్థి యోగి రతీపై విజయం సాధించారు. రామ్జాస్ కాలేజ్‌లో అల్లర్లు జరిగినపుడు యోగి అధ్యక్షుడిగా ఉన్నారని, అల్లర్లకు తాము వ్యతిరేకమని ఈ తీర్పుతో విద్యార్థులు స్పష్టం చేశారని ఎన్ఎస్యూఐ తెలిపింది. గురువారం జరిగిన ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో 39.90 శాతం ఓటింగ్ నమోదైంది. గత సంవత్సరం ఓటింగ్ శాతం (44.46)తో పోలిస్తే ఇది దాదాపు నాలుగు శాతం తక్కువ. మొత్తం నాలుగు స్థానాలకు 16 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఇందులో నలుగురు మహిళా అభ్యర్థులున్నారు. 1.3లక్షల మంది ఓటర్లున్నారు. వామపక్ష పార్టీల మద్దతు సంస్థ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) ఒక్క సీటూ గెలవలేకపోయింది. గతంతో పోలిస్తే తమ ఓటింగ్ శాతం పెరిగినందుకు ఆ సంస్థ హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. -
జేఎన్‌యూలో ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలు ముగిసి 24 గంటలు కూడా గడవకముందే క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల్లో గెలిచిన వామపక్ష కూటమిలోని ఆల్ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ), ఓటమి పాలైన ఏబీవీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. అనంతరం పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున క్యాంపస్‌లోని గంగా దాబా వద్ద ఏబీవీపీ నేత సౌరభ్ శర్మ ఆధ్వర్యంలో తమపై దాడి జరిగిందంటూ విద్యార్థి సంఘం నూతన అధ్యక్షుడు సాయి బాలాజీ, మాజీ అధ్యక్షురాలు గీతాకుమారి తదితరులు వసంత్‌కుంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హాస్టల్ గదుల్లో ఉన్న తమ మద్దతుదారులను వామపక్షాలకు చెందిన విద్యార్థులు తీవ్రంగా కొట్టారంటూ ఏబీవీపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. అంతకుముందు ఏబీవీపీ నుంచి తనకు ప్రాణహాని ఉందని సాయి బాలాజీ ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో క్యాంపస్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. కాగా, జేఎన్‌యూ విద్యార్థి సంఘం నూతన అధ్యక్షుడు ఎన్.సాయిబాలాజీ స్వస్థలం హైదరాబాదు. 2014 నుంచి ఆయన జేఎన్‌యూలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో పీహెచ్డీ చేస్తున్నారు. -
ఆసియా సైక్లింగ్ పోటీలకు దత్తాత్రేయ, ఆదిత్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన కె.దత్తాత్రేయ, ఆదిత్య మెహతాలిద్దరూ ఆసియా సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు బహ్రెయిన్ బయల్దేరనున్నారు. దత్తా త్రేయ ట్రాక్ సైక్లింగ్ పోటీల్లో, ఆదిత్య ఆసియా పారా సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో తలపడనున్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు బహ్రెయిన్‌లో ఈ పోటీలు జరుగుతాయి. దత్తాత్రేయ దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగి కాగా, ఆదిత్య మెహతా గతంలో అంతర్జాతీయ సైక్లింగ్ పోటీల్లో రెండు రజత పతకాలు గెలిచాడు. -
జేఎన్‌యూలో లెఫ్ట్ విద్యార్థి సంఘం హవా
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీ సీపీఐ అనుబంధ విద్యార్థి సంఘం ఏఐఎస్ఏ ఘనవిజయం సాధించింది. ఆదివారం ఉదయం విడుదలైన ఫలితాల్లో ఏఐఎస్ఏ( ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్) అధ్యక్ష, కార్యదర్శి పదవులను సొంతం చేసుకోగా, బీజేపీ అనుబంధ ఏబీవీపీ (అఖిలభారత విద్యార్థి పరిషత్) ఉపాధ్యక్ష స్థానంతో సరిపెట్టుకుంది. శనివారం వెల్లడయిన ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల ఫలితాల్లో నాలుగు పదవులకు అన్నింటినీ గెలుచుకుని ఏబీవీపీ క్లీన్ స్వీప్ సాధించిన సంగతి తెలిసిందే. -
డూసూ ఎన్నికలు హాస్టల్ వసతే ప్రధాన ఎజెండా
న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికల్లో హాస్టల్ వసతే తమ ప్రధాన ఎజెండా అని భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) ప్రకటించింది. డీయూ పరిధిలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులతో సంప్రదింపులు జరిపి, వారి అభిప్రాయాలను సేకరించిన అనంతరం ఈ ఎజెండాను నిర్ణయించింది. ఎన్ఎస్యూఐ అందజేసిన ఫారాలను స్వీకరించిన దాదాపు 20 వేలమంది విద్యార్థులు హాస్టల్ వసతినే అందులో ప్రస్తావించారు. ఎన్నికల్లో ఈ అంశాన్ని లేవనెత్తాల్సిందిగా తమను కోరారు. ఈ విషయాన్ని ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు రోజి ఎం జాన్ వెల్లడించారు. దేశంలోని అత్యంత ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన డీయూలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రతి ఏడాది లక్షలమంది చేరుతుంటారన్నారు. అయితే అందులో కొందరికి హాస్టల్ వసతి లభించడం లేదన్నారు. డీయూ సెక్షన్ 33 చట్టం ప్రకారం ఈ విశ్వవిద్యాలయంలో చదివే ప్రతి ఒక్కరికీ కచ్చితంగా హాస్టల్ వసతి కల్పించాల్సి ఉంటుందన్నారు. అయితే ఈ డీయూ వెలుపల 15 హాస్టళ్లు ఉన్నాయన్నారు. ఇంకా తొమ్మిది కళాశాలల్లో బోర్డింగ్ వసతి ఉందన్నారు. డీయూలో మొత్తం 1.8 లక్షలమంది విద్యార్థులు ఉండగా కేవలం తొమ్మిది వేల హాస్టళ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కారణంగా అనేకమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందువల్లనే ఈ అంశాన్ని ఎన్నికల ఎజెండాగా నిర్ణయించామని వివరించారు. లాటరీ ద్వారా కేటాయింపుకోసం కోర్టుకు బ్యాలట్ క్రమసంఖ్యలను లాటరీ ద్వారా కేటాయించాలని కోరుతూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ (ఏఐఎస్ఏ) ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. సంబంధిత అధికారులకు తదనుగుణంగా ఆదేశాలు జారీ చేయాలంటూ సదరు పిటిషన్లో కోరామని ఏఐఎస్ఏ నాయకుడు అమన్ గౌతం పేర్కొన్నారు. కాగా సెప్టెంబర్ 12వ తేదీన డూసూ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు ఆయా విద్యార్థి సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. అదే నెల మూడో తేదీలోగా అభ్యర్థులు తమ తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐదో తేదీలోగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. -
జేఎన్‌యూ ఎన్నికల్లో ఏఐఎస్ఏ హవా
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యు) ఎన్నికలను వామపక్షానికి చెందిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) స్వీప్ చేసింది. నాలుగు స్థానాల్లోనూ విజయ దుంధుబి మోగించింది. ప్రత్యర్థులను భారీ మెజార్టీతో మట్టి కరిపించింది. అధ్యక్షుడిగా అక్బర్ చౌదరి, ఉపాధ్యక్షుడిగా అనుభూతి ఏగ్నెస్, ప్రధాన కార్యదర్శిగా సందీప్ సౌరవ్, సంయుక్త కార్యదర్శిగా సర్ఫరాజ్ హమీద్ ఎన్నికయ్యారు. మూడు రోజులకు పైగా ఓట్లను లెక్కించిన అధికారులు సోమవారం ఫలితాలను ప్రకటించారు. మొత్తం 4,589 ఓట్లు పోలయ్యాయని జేఎన్‌యూఎస్‌యు ఎన్నికల కమిషనర్జ్ఞాన్ప్రకాశ్ తెలిపారు. అన్ని స్థానాల్లో ఏఐఎస్ఏ విజయం సాధించిందన్నారు. అధ్యక్ష పదవికి పోటీపడిన డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (డీఎస్ఎఫ్)కు చెందిన ఇషాన్ఆనంద్, ఎన్ఎస్యూఐకి చెందిన ప్రాణ్‌వీర్ సింగ్, ఏబీవీపీకి చెందిన ఆలోక్‌కుమార్ సింగ్, కన్సర్న్స్డూడెంట్స్కు చెందిన చంద్రసేన్‌పై ఏఐఎస్ఏకు చెందిన అక్బర్ చౌదరి విజయం సాధించారు. ఫిలాసఫీలో డాక్టరేట్ చేస్తున్న చౌదరికి 1,977 ఓట్లు పొలవగా, ప్రత్యర్థి డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (డీఎస్ఎఫ్)కు చెందిన ఇషాన్ ఆనంద్‌కు 1,327 ఓట్లు పొలయ్యాయి. ఉపాధ్యాక్షుడిగా పోటీ చేసిన హిస్టరీలో ఎంఫిల్ చేస్తున్న ఏఐఎస్ఏకు చెందిన అగ్నెస్కు 1,966 ఓట్లు పోలయ్యాయి. ప్రత్యర్థి డీఎస్‌ఎఫ్‌కు చెందిన జీశాన్ అలీకి 1,052 ఓట్లు పోలయ్యాయి. ప్రధాన కార్యదర్శి పదవీకి పోటీచేసిన స్కూల్ ఆఫ్ లాంగ్వేజేస్ నుంచి సౌరవ్‌కు 1,657 ఓట్లు పోలయ్యాయి. ఇతను ఎన్ఎస్యూఐకి చెందిన కారొలిన్ మనైనీని 953 ఓట్లతో మట్టికరిపించాడు. కార్యదర్శి పదవికి పోటీచేసిన ఫ్రెంచ్ మాస్టర్ స్టూడెంట్ హమీద్ 1,705 ఓట్లు పోలయ్యాయి. ఇతను డీఎస్‌ఎఫ్‌కు చెందిన సోనమ్ గోయల్‌ను 59 ఓట్లతో మట్టికరిపించాడు. 2012 సంవత్సరంలో మూడు పదవులను గెలుచుకున్న ఏఐఎస్ఐకి డీఎస్‌ఎఫ్‌కు మధ్య గట్టిపోరు సాగింది. ‘మా కృషిని విద్యార్థులు గుర్తించారు. గత రెండు నెలల నుంచి వివిధ సమస్యల సాధనకు కృషి చేశాం. మెస్, హాస్టల్ వసతులతో పాటు విద్యార్థుల ఉపకారవేతనాన్ని రూ.200ల నుంచి రూ.500లకు పెంచేలా చొరవ తీసుకున్నామ’ని చౌదరి సోమవారం విలేకరులకు తెలిపారు. వీటన్నింటి వల్లే తాము ఘన విజయం సాధించగలిగామని సంతోషం వ్యక్తం చేశారు. నాలుగు పదవులను కైవసం చేసుకున్న ఏఐఎస్ఏ సభ్యులు క్యాంపస్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.