ప్రశాంతంగా విద్యార్థి సంఘాల ఎన్నికలు
నగరంలోని ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ, ఢిల్లీ విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జేఎన్‌యూ ఎన్నికల్లో 55 శాతం మంది విద్యార్థులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ విశ ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం గం 9.30కి మొదలైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం ఐదున ్నర గంటలకల్లా ముగిసింది. తొలిసారిగా ఈ ఎన్నికల్లో నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్)ను ప్రవేశపెట్టారు. దీంతోపాటు నామినేషన్ పత్రాల్లో మూడో లింగం ఐచ్ఛికాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి మొత్తం ఏడుగురు పోటీపడ్డారు. ఇంకా ఐదుగురు ఉపాధ్యక్ష పదవికి, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులకు పదిమంది చొప్పున పోటీ చేశారు. ఈ ఎన్నికలకోసం బ్యాలట్‌ను వినియోగించారు.
జవహర్‌లాల్ నెహ్రూ విశ ్వవిద్యాలయం (జేఎన్‌యూ) పై వామపక్ష విద్యార్థి సంఘానికి ఆది నుంచి గట్టి పట్టు ఉంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వామపక్ష పార్టీల మద్దతు కలిగిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్‌ఏ) మొత్తం నాలుగు పదవులను తన ఖాతాలో వేసుకుంది. విద్యార్థి సంఘానికి జరిగిన ఎన్నికల్లో ఏఐఎస్‌ఏతోపాటు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ), లెఫ్ట్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ (ఎల్‌పీఎఫ్), డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ తదితర విద్యార్థి సంఘాలు ఈ ఎన్నికల బరిలోకి దిగాయి.
ఇక ప్రధాన పార్టీలకు చెందిన ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ లు కూడా తమ తమ అభ ్యర్థులను బరిలోకి దించాయి. విద్యార్థినులకు భద్రత, హాస్టల్ వసతి, వైఫై కనెక్షన్, విద్యార్థుల కోసం ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రాలు. కాగా పోలింగ్ సందర్భంగా ఎటువ ంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా యూనివర్సిటీకి చెందిన ప్రయివేటు గార్డులను మోహరించారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయంలో
ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘానికి (డూసూ) జరిగిన ఎన్నికల్లో దాదాపు లక్షమంది విద్యార్థులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయం గం 8.30కి మొదలైన ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం మూడున ్నర గంటలకల్లా ముగిసింది. ఇక ఈవెనింగ్ కళాశాలల్లో సాయంత్రం మూడు గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ రాత్రి ఏడుగంటలదాకా కొనసాగింది. కాగా అధ్యక్ష పదవికి ఏడుగురు, ఉపాధ్యక్ష పదవికి 32 మంది, కార్యదర్శి పదవికి 41 మంది, సంయుక్త కార్యదర్శి పదవికి 34 మంది పోటీపడ్డారు.
కాంగ్రెస్ అనుబంధ ఎన్‌ఎస్‌యూఐ, ర్‌ఎస్‌ఎస్ అనుబంధ ఏబీవీపీలతోపాటు ఇతర విద్యార్థి సంఘాలకు చెందిన అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల్లో పోటీపడ్డారు. ఇదిలాఉంచితే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏబీవీపీ అభ్యర్థులు అధ్యక్ష పదవితోపాటు ఉపాధ్యక్ష, సంయుక్త కార్యదర్శి పదవులను దక్కించుకున్నారు. ఇక ఎన్‌ఎస్‌యూఐని కార్యదర్శి పదవి వరించింది. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఢిల్లీ పోలీసులను ఈ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మోహరించారు.
నేడు ఫలితాలు
ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) గెలిచే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. వివాదాస్పద నాలుగేళ్ల కోర్సు (ఎఫ్‌వైయూపీ) రద్దు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాటం తదితర అంశాలు ఈ సంఘానికి వరంగా మారుతాయని అంటున్నారు. ఓటింగ్ అనంతరం కొంతమంది విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ ఏబీవీపీ తమ కోసం పాటుపడిందని, అందువల్లనే ఆ సంఘానికి తాము ఓటు వేశామని పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం.
ఈ విషయమై రాజ్‌మస్ కళాశాల విద్యార్థి ఉజ్వల్ కుమార్ మాట్లాడుతూ ‘ఏబీవీపీకే ఓటేశా. వివాదాస్పద నాలుగేళ్ల కోర్సు (ఎఫ్‌వైయూపీ) రద్దుకోసం ఏబీవీపీ కృషి చేసింది. విద్యార్థులకు నిరంతరం అండగా నిలిచింది. ఇదే విషయమై హిందూ కళాశాలకు చెందిన మరో విద్యార్థి మాట్లాడుతూ ఏబీవీపీ విజయం సాధించడం తథ్యమన్నాడు. విద్యార్థుల కోసం ఈ సంఘం నిరంతరం పోరాటాలు జరుపుతూనే ఉంద న్నారు. ప్రాచీ త్యాగి అనే మరో విద్యార్థిని మాట్లాడుతూ ఎన్‌ఎస్‌యూఐతో పోలిస్తే ఏబీవీపీ ఎంతో ఉత్తమమని అభిప్రాయపడింది. పైగా కేంద్రంలో బీజేపీలో అధికారంలో ఉందని, అందువల్ల ఏబీవీపీ గెలవడమే ఉత్తమమంది.