సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ (జేఎన్‌యూ) యూనివర్సిటీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ దాడిలో అనుమానితులుగా భావిస్తున్న తొమ్మిది మంది ఫోటోలను ఇదివరకే బటయకు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈనెల 5న జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిని విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌తో పాటు వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందిన వారు ఉన్నారంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే దాడి జరిగిన రోజున రాత్రి ముసుగులు ధరించిన దుండగులు చేతిలో కర్రలతో యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, టీచర్లపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డ విషయం తెలిసిందే. వారి దాడిలో ఆయిషీ ఘోష్ సహా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి