
న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ హన్స్‌రాజ్ హన్స్ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. జవహర్‌లాల్ నెహ్రు యూనివర్సిటీ(జేఎస్‌యూ) పేరును మర్చాలని సూచించారు. దాని పేరును మోదీ నరేంద్ర యూనివర్సిటీగా(ఎంఎన్‌యూ) మార్చాలని కోరారు. శనివారం జేఎన్‌యూను సందర్శించిన హన్స్‌రాజ్ అక్కడ ఆర్టికల్ 370 రద్దుపై మాట్లాడారు.
జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు ప్రశాంతంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు హన్స్‌రాజ్ తెలిపారు. పూర్వీకులు చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పారు. అలాగే జేఎన్‌యూ పేరును ఎంఎన్‌యూగా మర్చాలని సూచించారు. మోదీ పేరు మీద కూడా ఏదో ఒకటి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, 1969లో ఏర్పాటైన జేఎన్‌యూకు.. భారత ప్రథమ ప్రధాని జవహరలాల్ నెహ్రు పేరు పెట్టడం జరిగింది.