న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) 2018–19 విద్యా సంవత్సరానికిగాను నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను గురువారం విడుదల చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 27 నుంచి 30 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు జేఎన్‌యూ పాలకమండలి ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రవేశాల్లో భాగంగా ఎంఫిల్ / పీహెచ్‌డీ కోర్సుల్లో 720 సీట్లు, బీఏ కోర్సుల్లో 459 సీట్లు, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎంపీహెచ్ కోర్సుల్లో 1,118 సీట్లను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. పార్ట్ టైమ్(డిప్లోమా, సర్టిఫికెట్) కోర్సులకు 240 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది.