మాట మార్చిన ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: రాజద్రోహం అభియోగాలతో అరెస్ట్ చేసిన జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్యకుమార్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ పోలీసులు మాట మార్చారు. తొలుత అతడికి బెయిల్ మంజూరు చేయటానికి అభ్యంతరం లేదని పేర్కొన్న పోలీసులు.. మంగళవారం బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించారు. ఈ కేసు విచారణకు వచ్చినపుడు.. అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా ఢిల్లీ పోలీసుల తరఫున హాజరై.. పిటిషన్‌ను వ్యతిరేకిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభారాణికి తెలిపారు. అతడి బెయిల్‌కు అభ్యంతరం చెప్పబోమని గత వారం పేర్కొన్న ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సి.. కన్హయ్య బెయిల్‌పై విడుదలై వచ్చినట్లయితే దర్యాప్తుపై ప్రభావం చూపుతారని పేర్కొన్నారు.
ప్రభుత్వ న్యాయవాదుల వాగ్వాదం...
ఈ కేసులో మెహతా, సంజయ్‌జైన్, న్యాయవాది అనిల్‌సోనీలు ఏఎస్‌జీలుగా వాదించటంపై ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాది రాహుల్‌మెహ్రా అభ్యంతరం తెలిపారు. దీంతో.. జేఎన్‌యూ కేసులో పోలీసుల తరఫున వాదించేందుకు ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాదిని తొలగించి.. మెహతా, జైన్, సోనీ తదితరులను ఏఎస్‌జీలుగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నియమించినట్లు ఆయన కార్యాలయం పోలీసులకు తెలిపింది.
8 మంది బయటివారి ఫొటోలు సిద్ధం...
జేఎన్‌యూ వివాదంలో ప్రమేయం ఉందని అనుమానిస్తూ 8 మంది వ్యక్తుల ఫొటోలను ఢిల్లీ పోలీసులు సిద్ధం చేశారు. వారు ఆ వర్సిటీ విద్యార్థులు కాదని భావిస్తున్నారు.
కన్హయ్యకు బెయిల్ ఇవ్వద్దు
Published Wed, Feb 24 2016 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM
Advertisement