సమ్మెలు అవసరం లేదు: జేఎన్ యూ వీసీ
న్యూఢిల్లీ: ఎవరైనా శాంతియుతంగా తమ అభిప్రాయాలు వెల్లడించొచ్చని జవహర్ లార్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్ యూ) వైస్ ఛాన్సలర్ జగదీశ్ కుమార్ అన్నారు. భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోబోమని స్పష్టం చేశారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కారించుకోవాలని, సమ్మెలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
క్యాంపస్ లో తలెత్తిన వివాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు కమిటీ వేశామని తెలిపారు. ఈనెల 25లోగా కమిటీ నివేదిక ఇస్తుందని చెప్పారు. క్యాంపస్ లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, జేఎన్ యూ అధ్యాపకులు, విద్యార్థులు సోమవారం వీసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.