దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బరిలో నిలిచే తమ అభ్యర్థుల జాబితాను వివిధ పార్టీలు విడుదల చేస్తున్నాయి. తాజాగా ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్‌లో భాగమైన సీపీఐ (ఎంఎల్) బీహార్‌లోని ఆరా, నలంద, కరకత్ స్థానాల అభ్యర్థులను ప్రకటించింది.
వీటిలో నలంద టిక్కెట్‌ను 2013లో జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన సందీప్ సౌరవ్ (36)కు కేటాయించింది. సందీప్ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించేందుకు 2017లో తాను చేస్తున్న హిందీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలివేశారు. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా పాలిగంజ్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
పాట్నా సమీపంలోని మానేర్‌లో నివాసం ఉంటున్న సౌరవ్ 2009లో జేఎన్‌యూలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, 2014లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. సౌరవ్ 2013 వరకు రెండుసార్లు ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు.
నలంద నుంచి ఎన్నికల బరిలోకి దిగిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను బీహార్ సీఎం నితీశ్ కుమార్ అవినీతి రాజకీయాలపై పోరాటం చేస్తానన్నారు. ఎన్డీఏ హయాంలో ప్రజాస్వామ్య విలువలపై దాడులు జరుగుతున్నాయని సందీప్ ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment