ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జేఎన్‌యూ రణరంగంగా మారింది. పార్లమెంటు దాడి కేసులో దోసి అఫ్జల్ గురును ఉరితీయడానికి వ్యతిరేకంగా క్యాంపస్‌లో జరిగిన సమావేశం, అనంతర పరిణామాలు ఢిల్లీ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.
ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జేఎన్‌యూ రణరంగంగా మారింది. పార్లమెంటు దాడి కేసులో దోసి అఫ్జల్ గురును ఉరితీయడానికి వ్యతిరేకంగా క్యాంపస్‌లో జరిగిన సమావేశం, అనంతర పరిణామాలు ఢిల్లీ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. తాజాగా మాజీ సైనికులు కూడా ఈ వివాదంపై స్పందించారు. జేఎన్‌యూలో జాతి వ్యతిరేక కార్యకలాపాలు వెంటనే ఆపకపోతే.. ఆ యూనివర్సిటీ తమకు ఇచ్చిన డిగ్రీలను తిరిగి ఇచ్చేస్తామని హెచ్చరించారు. తాము గతంలో జేఎన్‌యూలో చదివామని చెప్పుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని వీసీకి స్పష్టం చేశారు.
1978 ఎన్డీయే బ్యాచ్‌కి చెందిన మాజీ సైనికులు ఈ మేరకు వైస్ చాన్స్‌లర్‌కు లేఖ రాశారు. తమలో చాలామంది జేఎన్‌యూలోనే చదివామని, కానీ క్యాంపస్‌లో 'అఫ్జల్ గురు డే' సంబరాలు చేసుకోవడం లాంటి జాతి వ్యతిరేక కార్యకలాపాలు జరగడం చూస్తే.. తమ రక్తం ఉడికిపోతోందని చెప్పారు. ఇదే యూనివర్సిటీలో చదివి.. దేశమాత సేవలో ప్రాణాలు అర్పించిన వాళ్ల త్యాగాలు వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ యూనివర్సిటీతో అనుబంధాన్ని తాము కొనసాగించలేమని.. ఇది జాతి వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని, భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగితే మీరిచ్చిన డిగ్రీలను తిరిగి ఇచ్చేస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు.